Faima -Praveen: పటాస్ కార్యక్రమం ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు కమెడియన్ ఫైమ. ఇలా పటాస్ కార్యక్రమంలో ద్వారా బుల్లితెరకు వచ్చినటువంటి ఈమె అనంతరం జబర్దస్త్ కార్యక్రమానికి పరిచయమయ్యారు. అయితే జబర్దస్త్ కార్యక్రమంలో ఫైమా పంచులకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇలా ఈమెకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఏకంగా బిగ్ బాస్ అవకాశం కూడా వచ్చింది.ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున అందరిని సందడి చేసినటువంటి ఫైమా ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి బుల్లితెర కార్యక్రమాలలో ఫైమా సందడి చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈమె పటాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడే ప్రవీణ్ అనే వ్యక్తిని ఇష్టపడటం జరిగిందని అనంతరం వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమంలో కూడా సందడి చేశారు. ఇలా ఇద్దరు మధ్య ప్రేమ చిగురించడంతో ఇదే విషయాన్ని వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా అందరితోనూ పంచుకున్నారు ఇలా వీరిద్దరూ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా పటాస్ ప్రవీణ్ కి హైమా బ్రేకప్ చెప్పారని తెలుస్తుంది.
Faima -Praveen: బేబీ సినిమా ఎఫెక్ట్…
ఫైమా క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతోంది కానీ ప్రవీణ్ మాత్రం ఇంకా జబర్దస్త్ లోనే కొనసాగుతూ ఉన్నారు. దీంతో ఈమె తనకన్నా మంచి వాడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ప్రవీణ్ కు బ్రేకప్ చెప్పారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది తెలిసి అందరూ షాక్ అవుతున్నారు కానీ నిజానికి ఇది ఒక స్పూఫ్ మాత్రమేనని తెలుస్తోంది.ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బేబీ సినిమాకు స్పూఫ్ చేశారు. దీంతో ప్రవీణ్ కు బ్రేకప్ చెప్పి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక పోస్ట్ షేర్ చేశారు. దీంతో నిజంగానే ఫైమా ప్రవీణ్ విడిపోతున్నారు ఏమో అని ఆ అభిమానులు ఆందోళన పడ్డారు.