Balakrishna : టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో మంచి ఫేమ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగినటువంటి ఫ్యామిలీలలో నందమూరి ఫ్యామిలీ ఒకటి. అయితే నందమూరి ఫ్యామిలీలో అన్నగారు నందమూరి తారక రామారావు తరువాత ఆ రేంజ్ లో ప్రైజ్ మరియు గుర్తింపు తెచ్చుకున్న వారిలో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అని చెప్పవచ్చు. అయితే నందమూరి బాలకృష్ణ కి ఇద్దరు కూతుర్లు. కానీ ఇప్పటికే బాలయ్య బాబు ఇద్దరి కూతుర్లకి పెళ్లిళ్లు అయిపోయాయి. ఇక కొడుకు నందమూరి మోక్షజ్ఞ కూడా ప్రస్తుతం నటనలో మెలకువలు నేర్చుకుంటూ ఉండడంతో ఇప్పటివరకు తన నట వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. దీంతో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇంకొంత లేటుగా ఉండేట్లు తెలుస్తోంది. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ రెండో కూతురు నందమూరి తేజస్విని గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది.
ఇంతకీ ఆ వార్త ఏమిటంటే నందమూరి తేజస్విని పెళ్లి ఓ టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ హీరో కొడుకుతో జరగాల్సి ఉందని కానీ పలు అనివార్య కారణాల వల్ల ఈ పెళ్లి జరగలేదని కొందరు సోషల్ మీడియా లో తెగ చర్చించుకుంటున్నారు. ఆ తర్వాత ఆ స్టార్ హీరో కొడుకు కాస్త ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న ప్రముఖ స్టార్ హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ పెళ్లి బంధం కూడా ఎక్కువ రోజులు నిలబడక ఇటీవలే విడాకులు తీసుకున్నట్లు సమాచారం.
కానీ నందమూరి తేజస్విని పెళ్లి విషయంలో వినిపించిన ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా పెళ్లయి పిల్లలు ఉన్నటువంటి మహిళ పట్ల ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని నందమూరి బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నందమూరి తేజస్విని విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకుడు శ్రీ భరత్ ని పెళ్లి చేసుకుంది. అయితే నందమూరి తేజస్విని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయడంతో తన తండ్రి బాలకృష్ణ చిత్రాలకి తానే కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేసింది.
ఇక నందుమురి బాలకృష్ణ ఇటీవల అఖండ మూవీ తో మంచి హిట్ అందుకోవడంతో పాటూ దాదాపుగా 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించాడు. కాగా ప్రస్తుతం తెలుగు ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న మరో బిగ్ బడ్జెట్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు..