Faria Abdullah: నవీన్ పోలిశెట్టి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి కామెడీ ఎంటర్టైనర్ జాతి రత్నాలు.ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమయ్యారు హైదరాబాది ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా.ఇలా ఈ సినిమా ద్వారా చిట్టి పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం ఏ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ విధంగా ఈ సినిమా తర్వాత ఈమె నాగార్జున నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేశారు.
ఈ సినిమా తర్వాత ఈమె ఎలాంటి స్పెషల్ సాంగ్స్ లోను చేయలేదు అదే విధంగా ఎలాంటి సినిమా అవకాశాలను అందుకోలేదు ఇలా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అదే విధంగా తాను చేసే డాన్స్ వీడియోలు అలాగే ఇంస్టాగ్రామ్ రిల్స్ ద్వారా నిత్యం అభిమానులను సందడి చేస్తూ సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
Faria Abdullah: జీవితాంతం ఒకరితోనే ఉండలేను…
ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో బిజీగా ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఫరియా పెళ్లి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి ప్రస్తావన రావడంతో ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ ఒకడితోనే బతకాల్సి ఉంటుంది ఇలా ఒకరితోనే గడపడం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు అంటూ కామెంట్ చేశారు. దీనితో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కొందరు ఇలాంటి వారే పెళ్లి చేసుకోవడం వెంటనే విడాకులు ఇవ్వడం జరుగుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.