సినిమా పరిశ్రమలో స్థిర పడాలని అందరూ అనుకుంటారు. కాని కొందరికే అటువంటి అవకాశం దక్కుతుంది. ఇక్కడ ఎంత టాలెంట్ ఉన్నా లక్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది అంటుంటారు సీనియర్ నటులు. అయితే సినిమా పరిశ్రమలో స్థిర పడాలంటే అప్పటికే పరిశ్రమలో స్థిర పడ్డ మనకు బాగా తెలిసిన వాళ్ళు ఉండాలని, లేకపోతే సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి మాత్రమే వచ్చిన వారికి ఇక్కడ అవకాశాలు వస్తాయని సాధారణంగా బయట ఒక పెద్ద అపోహ ఉంది. అయితే ఇది ఒక అపోహ మాత్రమే అని మనకు చాలా మంది సినిమా నటులు సినిమా పరిశ్రమకు సంబంధం లేని నటులు సక్సెస్ ఫుల్ గా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సినిమా పరిశ్రమ అనేది గ్లామర్ పరిశ్రమ. ఇక్కడ గ్లామర్ అనేది ముఖ్యంగా హీరోయిన్ లకు అవకాశాల విషయంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే గ్లామర్ ను నమ్ముకొని సినిమా పరిశ్రమకు వచ్చిన హీరోయిన్ లు చాలా కాలం పరిశ్రమలో సత్తా చాటలేరు. అడపాదడపా కొన్ని అవకాశాలు వచ్చినా కొన్ని సినిమాలు చేయగానే అవకాశాలు తగ్గిపోయి తొందరగానే కనుమరుగవుతారు. కాని పరిశ్రమలో అందంతో పాటు అభినయం కలగలిసిన హీరోయిన్ లకు ఇక్కడ అవకాశాలకు కొదవ ఉండదు. ఈ కోవలోకే వస్తారు నటి సాయిపల్లవి.

నటనకు అవకాశం ఉన్న పాత్రలకే ప్రాధాన్యతనిస్తున్న సాయిపల్లవి

ఫిదా మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి ఫిదా సినిమాలో నటనతో ఒక్కసారిగా ప్రేక్షకుల చూపును తన వైపు తిప్పుకునేలా చేసుకుంది. ఇక ఫిదా సూపర్ హిట్ తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది సాయిపల్లవి. ఆ తరువాత ఎంసీఏ సినిమాలో నటించి నటిగా ప్రేక్షకులలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే స్కిన్ షో పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వకుండా తన పాత్రలో నటనకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలో నటించేందుకు అంగీకరిస్తుంది నటి సాయిపల్లవి. ఇలా రూల్స్ పెట్టుకోవడంతో ఏకంగా రకరకాల సినిమాలను రిజెక్ట్ చేసి ఏకంగా 5 కోట్ల రూపాయలను పోగొట్టుకుందట సాయిపల్లవి.ప్రస్తుతం సాయిపల్లవి నటించిన విరాట పర్వం సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 16, 2021 at 5:30 సా.