Galata Geetu: గలాట గీతూ చిత్తూరు యాసతో జబర్దస్త్ కార్యక్రమంలో ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె అనంతరం షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న గీతు తన చిత్తూరు యాసతో అద్భుతమైన కామెడీ డైలాగ్ ద్వారా అందరినీ ఆకట్టుకుంటున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ఇక మాట్లాడటం అంటే తనకు చాలా ఇష్టం అందుకే ఆర్జే కావాలని అనుకుంటున్నట్లు తెలియజేశారు. ఇకపోతే గతంలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఆ అనుభవాలను ఈ సందర్భంగా బయటపెట్టారు. తనకు గతంలో ఆస్ట్రేలియా నుంచి ఒక బిగ్ ఆఫర్ వచ్చిందని గీతు వెల్లడించారు.

Galata Geetu: భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు..
ఆస్ట్రేలియాలో ఒక ఈవెంట్ ప్లాన్ చేయడంతో ఆ ఈవెంట్ కి హోస్ట్ గా తనకి ఆఫర్ ఇచ్చారు.భారీ రెమ్యునరేషన్ కూడా ఇవ్వడంతో తనకు హోస్టింగ్ అంటే ఎంతో ఇష్టం కావడంతో ఒప్పుకున్నాను. ఎంచక్కా మూడు రోజులపాటు ఆస్ట్రేలియాలో షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేయవచ్చని ఈమె సంతోషం వ్యక్తం చేశారు. తీరా టికెట్స్ బుక్ చేసే సమయంలో ఈవెంట్ మేనేజర్ పీఏ నుంచి తనకు ఫోన్ వచ్చిందని తెలిపారు. పర్సనల్ గా మీకు అన్ని ఓకే కదా అని అడిగారు. అతను నా అసిస్టెంట్ గురించి అడుగుతున్నారేమోనని ఓకే అని చెప్పాను.అయితే అతను అది కాదు మేడమ్ మా మేనేజర్ గారితో మీకు పర్సనల్ గా ఓకే కదా అని అడిగారు. అతను అలా అడగడంతో వెంటనే ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను.అయితే ఆయన పర్సనల్ గా కాకపోయినా కనీసం హోస్ట్ గా అయిన రావాలని కోరారు. అయితే తనకు భయం వేసి ఆ ఈవెంట్ కివెళ్లలేదని ఈ సందర్భంగా తనకు గతంలో జరిగిన క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి ఈమె బయట పెట్టారు.