Galla Ashok: ఆ డ్రగ్స్ వ్యవహారమే నన్ను హీరోను చేసింది: గల్లా అశోక్

Akashavani

Galla Ashok: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో అశోక్ గల్లా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. హీరో సినిమా ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు.. మొదటి సినిమాతోనే నిధి అగర్వాల్ తో జతకట్టాడు. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయినప్పటికీ అశోక్ మాత్రం హీరోగా తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకున్నాడు.

మొత్తానికి అశోక్ గల్లా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక అశోక్ సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ అప్డేట్స్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా నెటిజన్ల కు పంచుకుంటూ ఉంటాడు.

ఇదిలా ఉంటే శనివారం రోజు బంజారాహిల్స్ లో ఒక పబ్ పై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. దాదాపు చాలా మంది యువతీ యువకులను పోలీసులు డ్రగ్స్ కేసులో స్టేషన్ కు తీసుకుని వెళ్లారు. వీరిలో పలు స్టార్ హీరోల కొడుకు కూతుర్లు కూడా ఉన్నట్లు సమాచారం అందింది. ఇక కొణిదెల నిహారిక, బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నట్లు సమాచారం.

Galla Ashok: ఆ డ్రగ్స్ వ్యవహారమే నన్ను హీరోను చేసింది: గల్లా అశోక్
Galla Ashok: ఆ డ్రగ్స్ వ్యవహారమే నన్ను హీరోను చేసింది: గల్లా అశోక్

Galla Ashok: అశోక్ గల్లా కు నేను హీరో అనే ఫీలింగ్ కలగడానికి కారణం ఇదే!

ఇక ఇదే క్రమంలో ముందుగా అశోక్ గల్లా పేరు వినబడింది. అతని గురించి చర్చలు కనిపించకపోవడం కూడా జరిగింది. కానీ నిజానికి సిద్ధార్థ గల్లా ఉన్నట్లు తెలిసింది. కానీ అశోక్ గల్లా డ్రగ్స్ వ్యవహారంలో అతడి పేరు వినిపించినందుకు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా పంచుకున్నాడు.

ఆ ఇంటర్వ్యూలో.. యాంకర్ పబ్ ఇష్యు లో మీ పేరు బయటకు వచ్చింది. దానికి మీకు ఏమనిపించింది అని అడిగారు. దానికి అశోక్ గల్లా సడన్ గా నా పేరు వార్తల్లోకి ఎలా వచ్చిందో తెలియదు. అప్పుడే నేను ఒక హీరో అనే ఫీలింగ్ కలిగింది. అని ఆనందంగా ఇంటర్వ్యూలో అశోక్ గల్లా చెప్పుకొచ్చాడు.

- Advertisement -