Gayatri Bhargavi వామ్మో…. స్విమ్ సూట్ లో కనిపించిన తెలుగు యాంకర్….

Joythi R

Gayatri Bhargavi టాలీవుడ్ లో ఉన్నటువంటి అందమైన ఫిమేల్ యాంకర్లలో గాయత్రి ఒకరు. కాగా గాయత్రి భార్గవి మొదట్లో పలు మ్యూజిక్ ఛానళ్లలో ప్రసారం అయ్యే ప్రోగ్రామ్స్ ద్వారా తన కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత మెల్లమెల్లగా సినిమాల్లో నటించే అవకాశాలు కూడా దక్కించుకొని బాగానే రాణించింది. ఈ క్రమంలో పలు చిత్రాలలో అక్క, చెల్లి, వదిన, అమ్మ, తదితర పాత్రల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అలాగే అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లలో కూడా యాంకరింగ్ నిర్వహించి బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ మధ్య కాలంలో నటి గాయత్రి తన కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే పనిలో పడటంతో వెండి తెరపై మరియు బుల్లి తెరపై పెద్దగా కనిపించడం లేదు. దీంతో కొంతమేర నటి గాయత్రి అభిమానులు బాగానే మిస్ అవుతున్నారు.

అయితే నటి గాయత్రి తన పర్సనల్ లైఫ్ లో బిజీ బిజీగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియా మాధ్యమాలలో మాత్రం బాగానే యాక్టివ్ గా ఉంటుంది. దీంతో అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు మరియు వీడియోలు వంటివి షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా నటి గాయత్రి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న సమయంలో తీసిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

Gayatri Bhargavi వామ్మో.... స్విమ్ సూట్ లో కనిపించిన తెలుగు యాంకర్....
Gayatri Bhargavi వామ్మో…. స్విమ్ సూట్ లో కనిపించిన తెలుగు యాంకర్….

అలాగే ఓ యూట్యూబ్ ఛానల్ ని ప్రమోట్ చేస్తూ ఈ ఛానల్ లో హోమ్ డెకరేషన్ మరియు పిల్లలకు సంబంధించిన విషయాలు ఉంటాయని కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరింది. అయితే ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు నటి గాయత్రీ భార్గవి అందానికి ఫిదా అయ్యారు. అంతేకాకుండా నటి గాయత్రీ భార్గవి కి వయసు పెరుగుతున్నప్పటికీ అందం మాత్రం అసలు తగ్గలేదని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా నటి గాయత్రి భార్గవి తెలుగులో దాదాపుగా 50 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించింది. అలాగే బుల్లి తెరపై కూడా పలు వంటల ప్రోగ్రామ్స్ మరియు మ్యూజిక్ ప్రోగ్రామ్స్ వంటివాటితో బాగానే ఆకట్టుకుంది. ఇందులో నటి గాయత్రి భార్గవి కి అప్పట్లో ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే అభిరుచి అనే వంటల ప్రోగ్రాం మంచి పేరు తెచ్చిపెట్టింది.

- Advertisement -