Varun Tej -Saidharam Tej: వరుణ్ తేజ్ కంటే సాయి ధరమ్ తేజ్ అందంగా ఉంటాడా… ఇవేం కామెంట్స్ అండి బాబు!

Akashavani

Varun Tej -Saidharam Tej: టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారిలో మెగాహీరోలు ఒకరు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు వారసుడిగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అదే విధంగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు. ఇలా ఈ హీరోలు ఇద్దరు హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. ఇక వీరిద్దరికీ అభిమానులు కూడా భారీగా ఉన్నారనే చెప్పాలి.

ఇలా వరుస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఈ హీరోల గురించి డైరెక్టర్ గీత కృష్ణ షాకింగ్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న ఈయన మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. వీరిద్దరిలో చూడటానికి సాయి ధరమ్ తేజ్ చాలా బాగా, అందంగా ఉంటారని వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ తో పోలిస్తే, వరుణ్ తేజ్ పెద్దగా అందంగా ఉండరు అంటూ గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇలా ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Varun Tej -Saidharam Tej: ఆ సినిమాపై ఆశలు పెట్టుకున్న వరుణ్..

గీతాకృష్ణ మెగాహీరోల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందిస్తూ కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయాని కోస్తే రవితేజ తాజాగా నటించిన గని సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలయింది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ కావడంతో వరుణ్ తదుపరి చిత్రం ఎఫ్ 3 పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సాయి తేజ్ విషయానికొస్తే ఈయన ప్రమాదం తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఎలాంటి చిత్రాలను సాయి తేజ్ ప్రకటించలేదు.

- Advertisement -