God Father: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ పై ఇప్పుడు టాక్ భిన్నంగా వినిపిస్తోంది. అంతేకాదు కోందరిలో రక రకాల సందేహాలు మొదలయ్యాయి. మలయాళంలో భారీ హిట్ అందుకున్న లూసీఫర్ చిత్రానికి తెలుగు రీమేక్‌గా చిరు గాడ్ ఫాదర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ దీనిని రూపొందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మెజారిటీ భాగం కంప్లీట్ కావచ్చింది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతుంది.
అయితే, ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమా నుంచి చిరు పాత్రని అలాగే, ఫస్ట్ లుక్ ని చిత్రబృందం వదిలింది. అంతకముందు వరకు గాడ్ ఫాదర్ సినిమాపై ఉన్న అంచనాలు మరో లెవల్. కానీ, ఈ ఫస్ట్ లుక్ రిలీజైయ్యాక మాత్రం కొందరిలో అంచనాలు తారుమారయ్యాయట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు, మెగాస్టార్ ఘత చిత్రం ఆచార్య తో కంపేర్ చేసి కామెంట్స్ చూస్తున్నారు. ఆచార్య మాదిరిగా గాడ్ ఫాదర్ ఫలితం ఉంటుందా..! అని మాట్లాడుకుంటున్నారు.
God Father: అందుకే సినిమా ఫ్లాపయిందని చెప్పుకున్నారు.
దీనికి కారణం ఒరిజినల్ వెర్షన్ కూడా కారణం. మలయాళంలో మోహన్ లాల్ పాత్ర సినిమాకు చాలా హైలెట్‌గా నిలిచింది. అంతేకాదు, అక్కడ కథను చాలా సహజంగా తెరకెక్కించారు. కానీ, ఇక్కడికి వచ్చేసరికి మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా కథలో కీలక మార్పులు చేశారు. అంతేకాదు, తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టుగా కూడా కొన్ని సీన్స్ మార్చినట్టు తెలుస్తోంది. ఆచార్య సినిమాకు కొరటాల రాసుకున్న కథలో మెగాస్టార్ మార్పులు సూచించడం వల్లే ఒరిజినల్ కంటెంట్ దెబ్బ తిన్నదని, అందుకే సినిమా ఫ్లాపయిందని చెప్పుకున్నారు. అదే మళ్ళీ గాడ్ ఫాదర్ సినిమాకు రిపీట్ అవుతుందేమో అని ఇప్పుడు కొత్త సందేహాలు మొదలయ్యాయి.