Gopi chand: యాక్షన్ హీరో గోపీచంద్ తాజాగా రామబాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా మే 5వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా చిత్ర దర్శకుడు శ్రీవాస్, నటి డింపుల్ హైతి హీరో గోపీచంద్ ముగ్గురు కూడా సుమా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి సుమ అడ్డా కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఈ ప్రోమోలో భాగంగా సుమ ఎప్పటిలాగే సెలబ్రిటీలతో కలిసి సరదాగా మాట్లాడటమే కాకుండా వారిపై తనదైన స్టైల్ లో పంచులు వేసింది. ఇక గోపీచంద్ సైతం సుమకు తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.ఇలా ఎంతో సరదాగా సాగిపోతున్న ఈ కార్యక్రమంలో హీరో గోపీచంద్ ఒక్కసారిగా సుమపై చేయి చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది. ఆటపాటలతో ఎంతో సరదాగా సాగిపోతున్న ఈ కార్యక్రమంలో భాగంగా సుమ ఓ మనీ గేమ్ అంటూ ఆట ఆడించింది ఈ గేమ్ ఆడుతున్న సమయంలో గోపీచంద్ ఒక్కసారిగా సుమ గొంతు పట్టుకున్నారు.
Gopi chand: సుమ గొంతు పట్టుకున్న హీరో…
ఈ విధంగా గోపీచంద్ సుమ గొంతు పట్టుకోవడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈయన సుమ పట్ల ఇలా వైల్డ్ గా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని మాత్రం ఈ ప్రోమోలో రివిల్ చేయలేదు.ఇలా ఈ హీరో యాంకర్ పట్ల ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి అనే విషయం తెలియాలి అంటే ఏప్రిల్ 29వ తేదీ ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ వీడియో పై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.