Kasthuri Shankar: వయసులో ఉన్నప్పుడు హీరోయిన్ గా రాణించి ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు మీద పడటంతో కెరీర్ కి బ్రేక్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో చిన్నచితకా పాత్రలలో నటిస్తూ బాగానే రాణిస్తున్నటువంటి నటీమణులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. అయితే తెలుగులో ఒకప్పుడు ప్రముఖ హీరో కింగ్ నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య చిత్రంలో హీరో మరదలు పాత్రలో నటించిన తమిళ ప్రముఖ హీరోయిన్ కస్తూరి శంకర్ కూడా ఈ కోవకే చెందుతుందని చెప్పవచ్చు. అయితే నటి కస్తూరి శంకర్ తెలుగులో నటించింది తక్కువ చిత్రాల్లోనే అయినప్పటికీ తన అందం, అభినయం, నటన ప్రతిభతో తనకంటూ కొద్దిమంది అభిమానులను సంపాదించుకుంది.
కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ఈ క్రమంలోనే పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలు మీద పడటం అలాగే హీరోయిన్ పాత్రలకి కావలసిన వయసు అయిపోవడం వంటి వాటి కారణంగా కొన్నాళ్ళ పాటూ సినీ ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం పలు సీరియల్స్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది. ఈ క్రమంలో తెలుగు, తమిళం తదితర భాషలలో పలు ధారావాహికలలో నటిస్తూ బాగానే రాణిస్తోంది.
అయితే ఎప్పుడూ ఏదో ఓ వివాదంతో సావాసం చేస్తుంటుంది నటి కస్తూరి శంకర్. అలాగే సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు ఆమె ఫోటోలకు చేసేటువంటి నెగెటివ్ కామెంట్లకి కూడా ఘాటుగా రిప్లై ఇస్తుంటుంది. తాజాగా నటి కస్తూరి శంకర్ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ దిగినటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో అప్పట్లో ప్రముఖ గాయని ఎస్ జానకి పాడిన ఒక బృందావనం సోయగం (తమిళ వర్షన్) పాటని జత చేసి రీల్ ని షేర్ చేసింది. దీంతో కొందరు నెటిజెన్లు ఈ వీడియో పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఓ నెటిజన్ ఏకంగా “ఈ వయసులో మీకు ఇలాంటి వీడియోలు చేయడం అవసరమా అంటూ” తమిళ భాషలో కామెంట్ చేశాడు. దాంతో కస్తూరి శంకర్ కూడా ఈ కామెంట్ కి ఏకంగా “అవును ఈ వయసులో నీకు ఈ వీడియో అవసరం లేదు. కాబట్టి వెళ్లి రామాయణం చదువుకో” అంటూ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా ఈ నెగిటివ్ కామెంట్ చేసిన నెటిజన్ అవాక్కయ్యాడు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి కస్తూరి శంకర్ తెలుగులో ఇంటింటి గృహలక్ష్మి అనే చిత్రంలో మెయిన్ లీడర్ పాత్రలో నటిస్తోంది. కాగా ఈ ధారావాహిక ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయినటువంటి స్టార్ మా చానల్లో ప్రసారమవుతోంది.