Gunasekhar: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా గుర్తింపు పొందిన గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1992లో లాటి సినిమా ద్వారా దర్శకుడుగా మారిన గుణశేఖర్ ఆ తర్వాత సొగసు చూడతరమా రామాయణం, చూడాలని ఉంది మృగరాజు, ఒక్కడు, రుద్రమదేవి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇక ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్ పనులు వేగవంతం చేశారు.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటీనటులతో పాటు దర్శకుడు గుణశేఖర్ కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గుణశేఖర్ శాకుంతలం సినిమా విశేషాలతో పాటు మన తెలుగు హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అని సంబంధం లేకుండా అన్ని భాషల సినిమాలను ప్రేక్షకులు చూస్తున్నారు. ఈ క్రమంలో హీరోలు కూడా భాషతో సంబంధం లేకుండా ఇతర భాషలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ హీరోలు మన తెలుగు సినిమాలలో గెస్ట్ రోల్స్ లో నటించారు.
Gunasekhar: తెలుగు హీరోలు చేస్తారని నమ్మకం లేదు…
ఇక ఈ విషయం గురించి గుణశేఖర్ ప్రస్తావిస్తూ..” సల్మాన్ ఖాన్, అమితాబచ్చన్, షారుక్ ఖాన్ వంటి బాలీవుడ్ హీరోలు ఇతర భాషలలో అతిథి పాత్రలు చేస్తున్నారు. ఈ విషయంలో మన తెలుగు హీరోలు కూడా మారాలి. రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ ది అతిథి పాత్ర అయినప్పటికీ ఆ పాత్రకి మంచి స్పందన లభించింది. శాకుంతలం సినిమాలో దుష్యంత మహారాజు పాత్రలో చాలా కోణాలు ఉన్నాయి. అటువంటి పాత్ర మన తెలుగు హీరోలు చేస్తారన్న నమ్మకం లేదు. ఆ పాత్ర కోసం మన హీరోలను అడిగి కాదనిపించుకోవడం ఇష్టం లేక వారిని స్పందించలేదు. అందుకే దేవ్ మోహన్ ని సంప్రదించాను ” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఈ వ్యాఖ్యల గురించి మన తెలుగు హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.