Gunturu Kaaram: సాధారణంగా హీరోలకి సరిపోయేలా దర్శకులు కథలను సిద్ధం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో హీరోలకి కథ నచ్చకపోవడం లేదా ఇతర కారణాలవల్ల వాటిని రిజెక్ట్ చేస్తుంటారు. దీంతో ఇతర హీరోలను పెట్టీ అదే కథని సినిమా తీస్తుంటారు. అయితే అలా తీసిన సినిమాలు కొన్ని హిట్ అయితే మరికొన్ని ప్లాప్ అవుతూ ఉంటాయి. సినిమా ప్లాప్ అయితే హమ్మయ్య రిజెక్ట్ చేయడం మంచిదయ్యింది అనుకుంటారు. ఒకవేళ హిట్ అయితే అనవసరంగా సినిమా కాదనకున్నానని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. మన స్టార్ హీరోలు ఎంతోమంది వదులుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అలా ఎక్కువ హిట్ సినిమాలను వదులుకున్నారు.
తాజాగా ఎన్టీఆర్ వదులుకున్న మరొక సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నాడు. ఆ సినిమా మరేదో కాదు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ” గుంటూరు కారం” . త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా నుండి ఒక గ్లిమ్స్ వీడియోని కూడా విడుదల చేసారు.ఈ గ్లిమ్స్ వీడియోకి అభిమానులు, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకి బదులు ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల ఎన్టీఆర్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాలో నటించే అవకాశం మహేష్ బాబుకి దక్కింది.
Gunturu Kaaram:
ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఈ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తో ఈ సినిమా తెరకెక్కించాలని త్రివిక్రమ్ భావించాడు. కాకపోతే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఎన్టీఆర్ కి నచ్చకపోవటంతో దీనిని రిజెక్ట్ చేశాడని సమాచారం. అయితే అదే స్క్రిప్ట్ లో మహేష్ కి తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలలో మార్పులు చేసి మహేష్ బాబు వద్దకు వెళ్ళగా మహేష్ బాబు ఈ సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో గుంటూరు కారం పేరుతో మన ముందుకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక ప్రస్తుతం రూపొందుతున్న ఈ గుంటూరు కారం సినిమా మీద కూడా ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి.