Guppedantha Manasu April 28 Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. రిషి వసును ఇంట్లోకి తీసుకొని రావడంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. కానీ దేవయాని మాత్రం కోపంతో రగిలిపోతుంది. ఇక దేవయాని ఏమిటి ఇలా తీసుకొచ్చావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటంతో.. మహేంద్ర వర్మ కూడా రిషి మనసులో ఏముందో తెలుసుకోవడానికి తను కూడా రిషిను ప్రశ్నిస్తాడు. ఇక దేవయానికి మహేంద్ర అడిగిన ప్రశ్నకు అనుమానం రావడంతో.. మళ్ళీ రిషిని పదేపదే అడిగి విసిగిస్తుంది.
వెంటనే ఫణింద్ర వర్మ దేవయానిపై అరిచి రిషిని వసును లోపలికి తీసుకొని వెళ్ళమంటాడు. ఇక ఫణీంద్ర వర్మ ధరణి తో అసలు విషయం తెలుసుకోమని అంటాడు. ఆ తర్వాత వసు దగ్గరికి జగతి వెళ్లి ఏం జరిగింది అని అడిగే ప్రయత్నం చేస్తుంది. దాంతో వసు అసలు నిజం చెప్పటం తో.. రిషి తీసుకొని వచ్చి మంచి పని చేసాడు అని అంటుంది. కానీ నావల్ల మీరంతా ఇబ్బంది పడుతున్నారు అని అనడంతో అప్పుడే వచ్చిన మహేంద్రవర్మ అలాంటిదేమీ లేదు అన్నట్లుగా మాట్లాడుతాడు.
మహేంద్ర పై అరిచిన జగతి..
ఇక ధరణి వసును తీసుకొని వెళ్లగా జగతి మహేంద్ర పై అరుస్తుంది. ఎందుకు మహేంద్ర నువ్వు కూడా రిషిని
నిలదీశావు అని అడగటంతో మహేంద్ర రిషి మనసులో ఉన్న విషయాన్ని బయట పెట్టడానికి అలా అడిగాను అని అంటాడు. మరోవైపు గౌతమ్ రిషి దగ్గరికి వెళ్లి వసును తీసుకొని రావడంలో తప్పు లేదు కానీ పెద్దమ్మ అడిగిన దాంట్లో న్యాయం ఉంది అని అంటాడు. దాంతో రిషి గౌతమ్ పై కాస్త కోపం అవుతూ అతడ్ని అక్కడి నుంచి పంపి వేస్తాడు.
కన్నతల్లిని గుర్తుకు చేసుకున్న రిషి..
రిషి ఒంటరిగా నిల్చోని వసు గురించి ఆలోచిస్తూ తనని తాను ప్రశ్న వేసుకుంటాడు. వసు పట్ల ఎందుకు నేను ఇలా చేస్తున్నాను అని అంటాడు. అంతేకాకుండా నన్ను పెంచుకోకున్నా కూడా నా కన్నతల్లి వసు విషయంలో కరెక్టు చెప్పిందా అని గతంలో జగతి మాట్లాడిన మాటలను తలచుకుంటాడు. మొత్తానికి రిషి వసు గురించి బాగా ఆలోచిస్తూ కనిపిస్తాడు. ఓ వైపు చూస్తే వసును రిషి వదులుకునే ప్రసక్తే లేదు అన్నట్టుగా కనిపిస్తాడు.
Guppedantha Manasu April 28 Episode: ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న వసు..
వసు పరిస్థితి చూసి రిషి వసుకు టీ పెట్టాలని చూస్తాడు. ఎందుకు సార్ అని పదే పదే అడగటంతో.. రిషి వసు నోరు మూయిస్తాడు. గతంలో పెట్టిన విధంగా ఇప్పుడు టీ అలా పెట్టనులే అని అంటాడు. మరోవైపు దేవయాని వీరిద్దరిని చూసి తట్టుకోలేక పోతుంది. ఎలాగైనా విడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. దాంతో వసు, జగతిలను ఒక చోట కలిసి వారిని తన మాటలతో బాధ పెడుతుంది. తరువాయి భాగం లో వసు ఇల్లు వదిలి వెళ్ళి పోతూ ఉండగా రిషి ఎంట్రీ ఇచ్చి దేవయానికి షాక్ ఇస్తాడు.