Guppedantha Manasu July 11 Today Episode: ఈ రోజు ఎపిసోడ్ లో జగతి, మహేంద్ర వర్మ, గౌతమ్ ఒకే కారులో ప్రయాణిస్తుంటారు. ఇక గౌతమ్ ఎలాగైనా వసు, రిషి లను ఓకే కారులో పంపించేలా చేసాము అని అంటాడు. ఇక మహేంద్ర వర్మ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారో లేదో అని అనుకోవడంతో.. వెంటనే జగతి తను వసు పై కోప్పడిన విషయాన్ని చెబుతుంది. ఆ తర్వాత మహేంద్ర వర్మ ఏదేమి జరిగినా వాళ్ళిద్దరు మాత్రం కలిసి ఉండాలని అనుకుంటాడు.
సీన్ కట్ చేస్తే..
రిషి, వసు కారులో ప్రయాణిస్తుంటారు. ఆ తర్వాత వసుకు మెడిసిన్స్ కొని ఇస్తాడు. వసు తన మనసులో రిషి సర్ మనసు ఎంత గొప్పదో అని అనుకుంటుంది. ఇక రిషి తనపై కోప్పడుతూ ఉంటాడు. కాలేజ్ పైన ఎందుకు అలా పని చేయడం అని.. అంతేకాకుండా సమయానికి తినాలని కాసేపు క్లాస్ పీకుతాడు. ఆ తర్వాత ఒకచోట ఆపి కొబ్బరినీళ్లు తాపిస్తాడు.
ఆ సమయంలో రిషి తన కారు టైర్ గాలి నువ్వే తీసావు అని వసును అనటంతో వెంటనే వసు మాట మారుస్తూ ఉంటుంది. ఇక వసు ఇన్నాళ్ళ పరిచయంలో ఎప్పుడైనా నన్ను సినిమాకి తీసుకెళ్ళారా అని అనటంతో రిషి కూడా వసు దగ్గర తప్పించుకోవడానికి మాట మారుస్తాడు. ఇక అదే సమయంలో రిషికి సాక్షి ఫోన్ చేయడంతో రిషి కాస్త క్లోజ్ గా మాట్లాడుతాడు.
వెంటనే వసు కోపంతో మధ్యలో కలుగజేసుకోవడంతో రిషితో వసు ఉందని అనుకుంటుంది. వెంటనే రిషి ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత తన మనసులో ఒకప్పుడు నువ్వు శిరీష్ తో అలా ఉన్నప్పుడు నాకు అలాగే అనిపించేది వసుధార అని అనుకుంటాడు. ఇక తనను ఇంటిదగ్గర డ్రాప్ చేసి ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు రిషి.
Guppedantha Manasu July 11 Today Episode: సాక్షి మాటలకు సంతోషంలో దేవయాని..
మరోవైపు సాక్షి దేవయానితో రిషి, వసు మళ్ళీ కలిసి తిరుగుతున్నారు అని అనడంతో దేవయాని మండిపోతుంది. కానీ రిషి తనతో బాగా మాట్లాడాడని కాస్త తనలో మార్పు వస్తుంది అనటంతో.. దేవయాని సంతోషపడుతుంది. ఇక జగతి, మహేంద్ర లు వసు, రిషి రిలేషన్ గురించి మాట్లాడుకుంటారు. ఇక జగతి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో మనకు కూడా అర్థం కాదు అని అంటుంది.
సాక్షి, రిషి లను చూసి తట్టుకోలేకపోతున్న వసు..
ఎలాగైనా వీరు కలవాలని అనుకోవటంతో దేవయాని ఆ మాటలు విని మరో ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక రిషి గౌతమ్ ను వసు కు ఫోన్ చేయమని అనడంతో.. గౌతమ్ రిషి ఫోన్ చేయమన్నాడని వసును అంటాడు. దాంతో రిషి అడ్డంగా దొరికిపోతాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ బంధాల గురించి తమ మనసులో మాట్లాడుకుంటారు. తరువాయి భాగంలో రిషి, సాక్షి ల ఫ్రెండ్షిప్ ని చూసి తట్టుకోలేకపోతూ.. నా భయం నాది అనుకుంటూ ఉంటుంది వసు.