Guppedantha Manasu July 15 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో రిషి ఒక గదిలో ఒంటరిగా నిల్చోని గతంలో తన మెడలో వసు వేసిన పూల దండను తీసుకొని గతంలో జరిగిన సీన్ గుర్తుకు చేసుకుంటాడు. పైగా ఆ దండను మరోసారి మెడలో వేసుకుంటాడు. అదే సమయంలో వసు తనని రిజెక్ట్ చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటాడు.
వసు ఆలోచనలోనే ఉంటున్న రిషి..
తనకు వసు ఏంటో అర్థం కావడం లేదు అని.. ఈమధ్య కొత్తగా ప్రవర్తిస్తుంది అని.. అసలు తన మనసులో ఏముంది అని తానే ప్రశ్నలు వేసుకుంటాడు. ఇక తనను రిజెక్ట్ చేసినప్పటి నుంచి మరింత క్లోజ్ గా కనిపిస్తుంది అని అనుకుంటాడు. అప్పుడే ఆ గది దగ్గరికి వసు రిషి గురించి ఆలోచించుకుంటూ వస్తుంది.
సాక్షికి కౌంటర్ వేసిన వసు..
తనకు రిషి సార్ ఎందుకు గుర్తుకు వస్తున్నాడో అని అనుకుంటుంది. గదిలోకి రాకుండా నేరుగా తన గదిలోకి వెళ్తుంది. అక్కడ తన ఫోన్ ను సాక్షి లాక్కుంటుంది. అందులో చూసేసరికి రిషి ఫోటో ఉండటంతో.. అదేంటి రిషి ఫోటో చూస్తున్నావు అని కోపంతో అడుగుతుంది. దాంతో వసు.. ఒకరి ఫోన్ లాక్కోవడం కరెక్ట్ కాదు.. ఫోన్లో రిషి సార్ ఫోటోనే కాకుండా వేరే వాళ్ళ ఫోటో కూడా చూస్తాను అని అంటూ మరిన్ని మాటలతో కౌంటర్ వేస్తుంది.
ఆ తర్వాత రిషి బయటికి వచ్చి మళ్ళీ వసు ఆలోచనలో తేలుతాడు. వసు ఆలస్యంగా పడుకుందేమో అని అందుకే ఇంకా లేవలేదేమో అని అనుకుంటాడు. అయినా తన గురించి నేను ఆలోచించకపోవటమే అని అనుకుంటాడు. కానీ మళ్ళీ తన గురించే ఆలోచిస్తాడు. ఇక వసు గదిలో తన పెన్సిల్ కనిపించకపోయేసరికి చుట్టూ వెతుకుతుంది.
Guppedantha Manasu July 15 Today Episode: వసు దగ్గరకు రొమాంటిక్ గా వచ్చిన రిషి..
ఇక అప్పుడే రిషి వచ్చి పడుకున్నావా లేదా అనిఅడుగుతుంటాడు. ఆ తర్వాత ఏదో వస్తువు వెతుకుతున్నావు అని వసు పెన్సిల్ అని చెబుతుంది. ఇక ఆ పెన్సిల్ వసు జడ కొప్పులో ఉండటంతో.. దానిని రొమాంటిక్గా దగ్గరికి వచ్చి తీస్తాడు. వసు మర్చిపోతున్నాను అనడంతో.. రిషి మర్చిపోవడం కొందరికి వరం అని మర్చిపోక పోవటం శాపం అని అంటాడు.
ఇక టిఫిన్ చేసావా లేదా అని అడుగుతాడు. ఆ సమయంలో వసు తన మనసులో.. మీరు నా మనసులో ఉన్నారన్న విషయం చెప్పలేకపోతున్నాను అని బాధపడుతుంది. మరోవైపు దేవయాని సాక్షితో రిషికి కాఫీ పంపిస్తుంది. అదే సమయంలో అక్కడకు ధరణి రావడంతో తన పై కాసేపు మండిపడుతుంది దేవయాని.
సాక్షి తెచ్చిన కాఫీ ని షేర్ చేసుకున్న రిషి, వసు..
ఓవైపు రిషితో గౌతమ్ కాఫీ తాగాలని ఉందనటంతో అప్పుడే సాక్షి కాఫీ తీసుకుని వస్తుంది. వెంటనే గౌతమ్ కాఫీ తీసుకోవడంతో సాక్షికి బాగా కోపం వస్తుంది. ఇక రిషి కి కూడా ఇవ్వగా.. అప్పుడే వసు వచ్చి తలనొప్పి అనటంతో.. రిషి తన దగ్గర ఉన్న కాఫీని తనకు షేర్ చేస్తాడు. అది చూసిన సాక్షికి మరింత మండుతుంది.