Guppedantha Manasu July 7 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో వసు రెస్టారెంట్లో ఒక టేబుల్ దగ్గర కూర్చొని గులాబీ రెక్కలతో లవ్ సింబల్ వేస్తుంది. అప్పుడే అక్కడికి రిషి రావటంతో టేబుల్ కు అడ్డుగా నిలిచి ఉంటుంది. వేరే టేబుల్ దగ్గర కూర్చోమని అనడంతో రిషి మాత్రం అదే టేబుల్ దగ్గర కూర్చుంటాను అని అంటాడు. దాంతో వెంటనే ఆ గులాబీ రెక్కలను చెడిపేస్తుంది వసు.
షాక్ లో వసు..
ఇక రిషి ఆ టేబుల్ దగ్గర కూర్చొని ఏంటివి అంటూ మళ్లీ తాను కూడా ఆ గులాబీ రెక్కలతో లవ్ సింబల్ వేయటంతో వసు ఆశ్చర్య పడుతుంది. ఇక రిషి కాఫీ తెమ్మని ఆర్డర్ చేయడంతో కాఫీ తేవడానికి వెళ్తుంది. ఇక వచ్చేసరికి రిషి పక్కన సాక్షి ఉండటంతో సాక్షిని చూసి షాక్ అవుతుంది వసు. ఇక సాక్షి రిషితో క్లోజ్ గా మాట్లాడుతూ కనిపిస్తుంది.
అది చూసి వసు తట్టుకోలేక పోతుంది. ఏం తీసుకుంటావు అని రిషి సాక్షిని అడగటంతో.. నువ్వు ఏదంటే అదే అంటూ రిషితో అంటుంది. ఇక రిషితో సినిమా బాకీ ఉంది అని సాక్షి అనటంతో.. వసు మరింత షాకుకు గురవుతుంది. రిషి మాత్రం ఏం చెప్పకుండా గౌతం కూడా సినిమాకి వస్తా అన్నాడని అనటంతో సాక్షి దేవయాని ద్వారా గౌతమ్ ను రానివ్వకుండా చేయాలని అనుకుంటుంది.
గౌతమ్ ను బయటికి వెళ్లకుండా చేసిన దేవయాని..
మరోవైపు వసు వీరు ఏం మాట్లాడుకుంటున్నారో అని పక్కనే ఉండి వింటుంది. ఇక రిషి మాత్రం సాక్షితో వెళ్లడానికి ఇష్టపడక గౌతమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దేవయాని దొరక్క దొరక్క సాక్షికి మంచి అవకాశం వచ్చింది అని గౌతమ్ ను వెళ్ళనివ్వకుండా చేయాలి అని అనుకుంటుంది. ఇక గౌతమ్ హుషారుగా బయలుదేరుతుండగా దేవయాని పిలుస్తుంది.
ఇక దేవయాని స్టోర్ రూమ్ ను లైబ్రరీగా మార్చాలి అనుకుంటున్నాను అని కాబట్టి ఆ ఏర్పాట్లు అన్నీ నువ్వు దగ్గర ఉండి చూసుకోవాలి అని గౌతమ్ తో అంటుంది. అది కూడా ఇవ్వాళనే అనడంతో గౌతమ్ ఇవాళ రిషితో బయటికి వెళ్తున్నాను పెద్దమ్మ అనటంతో దేవయాని కాస్త ఓవర్ గా మాట్లాడి గౌతమ్ ను వెళ్ళనివ్వకుండా చేస్తుంది.
సాక్షి, రిషి లను సినిమాకు వెళ్లనివ్వకుండా చేసిన వసు..
ఇక రిషి, సాక్షి సినిమాకు వెళ్లకూడదని వెంటనే వసు రిషి కారు ఫంచర్ చేస్తుంది. వాళ్లు బయటికి రాగానే వసు కూడా బయటకి వస్తుంది. ఇక వసు టైర్ పంచర్ అయింది అనటంతో సాక్షి కోపంతో రగిలిపోతూ క్యాబ్లో వెళ్దామని అంటుంది. కానీ రిషి తనకు ఇంట్రెస్ట్ లేదని చెబుతాడు. వసు మాత్రం తెగ సంతోషపడుతుంది.

Guppedantha Manasu July 7 Today Episode: వసుపై కోప్పడిన జగతి..
అప్పుడే జగతి దంపతులు రావడంతో సాక్షిని మహేంద్ర వర్మ డ్రాప్ చేయడానికి తీసుకెళ్తాడు. ఇక వసు జరిగిన విషయం మొత్తం జగతికి చెబుతుంది. తరువాయి భాగంలో జగతి క్లాస్ చెబుతూ ఉండగా వసు వినకుండా రిషిని చూస్తుంది. ఇక జగతి వెంటనే వసుపై కోప్పడి అందరి ముందు తనను బాధపెడుతుంది