Guppedantha Manasu June 15 Episode: ఈరోజు ఎపిసోడ్ లో వసు మహేంద్ర దంపతులపై కోపంగా మాట్లాడుతుంది. జగతి తో రిషి సర్ ను లోపలికి అలా ఎలా పంపించావ్ మేడం అంటూ.. కనీసం ఆపకూడదా అని అంటుంది. మహేంద్ర వర్మ తో కూడా మీరు కూడా అలా ఎలా పంపించారు సర్ అని ప్రశ్నిస్తుంది.
అదిరిపోయే ప్రశ్న వేసిన జగతి..
దాంతో జగతి మరి నువ్వు ఎందుకు లోపలికి వెళ్లావు అని అడగటం తో.. నోటి వెంట ఒక్క మాట కూడా బయటకు రాదు. ఇక తన మనసులో ఇప్పుడు ఏం చెప్పాలి అని అనుకుంటుంది. దాంతో జగతి.. ముందు నువ్వు క్లారిటీ ఇవ్వు వసు.. ఈ ప్రశ్న రిషి కూడా అడుగుతాడు. మా దగ్గర తప్పించుకున్న కూడా రిషి దగ్గర తప్పించుకోలేవు అని అంటుంది.
సీన్ కట్ చేస్తే..
రిషి ల్యాబ్ లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటాడు. అంతే కాకుండా అక్కడ వసు మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకొని ఆలోచనలో పడతాడు. ఈ వసు ఏంటో అర్థం కాదు అని అనుకుంటాడు. ఒకవేళ వసును ఇలా ఎందుకు చేసావు అని అడిగితే వేరే కథలు అల్లుతూ చెబుతుంది అని అనుకుంటాడు.
మరోవైపు వసు రిషి గురించి ఆలోచనలో పడుతుంది. అక్కడ తను మాట్లాడిన మాటలను గుర్తుకు తెచ్చుకుంటుంది. అప్పుడే అక్కడికి సాక్షి వచ్చి రిషిని కాపాడినందుకు థాంక్స్ అని చెబుతూ స్వీటు కూడా తెస్తుంది. పైగా తన మాటలతో వసుకు కోపం వచ్చేలా చేస్తుంది. కానీ వసు మాత్రం నవ్వుతూ రివర్స్ సాక్షి కి ఎదురు ఇస్తుంది.
కోపంతో రగిలి పోతున్న సాక్షి..
ఇక వసు మాటలు వింటూ సాక్షి ఆశ్చర్యపోతుంది. పైగా ఇందాకే తన కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయింది అని అంటుంది. ఇప్పటివరకు ఎటు అర్థం కాకుండా ఉన్న దాన్ని.. ఇప్పుడు మాత్రం క్లియర్ గా క్లారిటీ వచ్చింది అంటూ సాక్షి తెచ్చిన స్వీటు తింటూ బాగా కౌంటర్ వేస్తుంది. రిషి సార్ ను నేను అస్సలు వదలను అంటూ.. ఇక నువ్వు మాత్రం రిషి సార్ ని ఎప్పటికీ కలవవు అని అనటంతో సాక్షి కోపంతో రియాక్ట్ అవుతుంది.

Guppedantha Manasu June 15 Episode: రిషిని కన్ఫ్యూజన్ లో పడేసిన వసు..
పైగా నీకు ఒక గిఫ్ట్ అంటూ సాక్షి ఇచ్చిన చెక్ ను తిరిగి ఇస్తుంది. మొత్తానికి తనకు గట్టి వార్నింగ్ ఇస్తుంది వసు. ఇక వసు సంతోషంగా కనిపిస్తుంది. ఎలాగైనా ఈ విషయం గురించి సర్ కు చెప్పాలి అని రిషికి మెసేజ్ చేస్తుంది. మొత్తానికి రిషిని ఒక చోట కలిసి మీరు లేకుంటే నేను ఉండలేను అని ప్రేమ మాటలు చెబుతూ.. మీరంటే నాకు.. అని అనడంతో రిషి వసు ఏం సమాధానం చెబుతుందో అని కన్ఫ్యూజన్లో పడతాడు.