Guppedantha Manasu June 2 Episode: ఈరోజు ఎపిసోడ్ లో వసు క్లాస్ కు ఆలస్యంగా రావడంతో రిషి
వసు మీద కోపంతో అందరి స్టూడెంట్స్ పై అరుస్తాడు. క్లాస్ కి ఆలస్యంగా రావద్దు అని.. క్రమశిక్షణ ఉండాలి అని అంటాడు. తను చెబుతున్న సమ్ చాలా కష్టమని ఒక లాజిక్ తో సొల్యూషన్ చేయాలి చెప్పి అందర్నీ పంపిస్తాడు. వసు కూడా మౌనంగా వెళ్ళి పోతుంది.
సీన్ కట్ చేస్తే..
జగతి మహేంద్రవర్మకు జరిగిన విషయం మొత్తం చెబుతుంది. దాంతో మహేంద్రవర్మ ఆశ్చర్యపోతాడు. రిషి ఓపెన్ అవ్వడమే చాలా గ్రేట్ అని కానీ వసు ఎందుకు అలా రిజెక్టు చేసింది అని ఆలోచిస్తాడు. జగతి కూడా అదే ఆలోచిస్తూ ఇద్దరూ చాలా తిరిగారు అని వసు మాత్రం ప్రతిక్షణం రిషి గురించి ఆలోచించేది అని అంటుంది. అయినా కూడా వసు ఎలా రిజెక్ట్ చేసింది అని బాధపడుతుంది.
దాంతో మహేంద్రకు గతంలో జగతికి రిషిని గురుదక్షిణగా ఇవ్వమని అన్న విషయం గుర్తుకు రావడంతో వెంటనే జగతి ఏం జరిగింది అని అంటుంది. దాంతో గతంలో నీకు రిషిని గురుదక్షిణగా ఇవ్వమన్నాను అని అందుకే వసు రిషితో అలా చనువుగా ఉంది అని అంటాడు. దాంతో జగతి మొదట షాక్ అయ్యి అయినా వసు అలా చేసే రకం కాదు అని అంటుంది.
రిషి ప్రపోజ్ విషయాన్ని తెలుసుకున్న గౌతమ్..
తనకు కూడా రిషి అంటే ఇష్టమని ప్రతి విషయంలో రిషిని బాగా తలుచుకుందని కానీ ఇలా ఎందుకు చెప్పింది అని బాధపడుతుంది. ఇక మహేంద్రవర్మ ఇప్పటికే రిషి ని దేవయాని, సాక్షి టార్గెట్ చేశారు అని అంతలోనే వసు రిజెక్టు చేసింది అని అసలు ఎలా తట్టుకుంటున్నాడో అని బాధ పడతాడు. ఇక వీరి మాటలను అక్కడే ఉన్న గౌతమ్ విని రిషి వసుకు ప్రపోజ్ చేశాడా అని ఆశ్చర్యపోతాడు.
మరి వసు ఎందుకు ఆక్సెప్ట్ చేయలేదు అని ఆలోచిస్తాడు. నేనే కోలుకోవడానికి ఇంత సమయం పట్టింది అని రిషి ఎలా తట్టుకుంటున్నాడో అని అనుకుంటాడు గౌతమ్. మరోవైపు సాక్షి తను అనుకున్నట్లుగానే రిషికి, వసుకు మధ్య అడ్డుగోడ పెట్టేసాను అని.. ఇక దేవయాని కూడా నన్ను మరోలా అనుకుంటుంది అని.. కానీ నాకు రిషి కావాలి అని అంతే కాకుండా నా గోల్ నాకు ఉంది అని అనుకుంటుంది.
వసుకు తెలిసిపోయిన నిజం..
వసు రిషి తనపై ఎందుకు కోపంగా ఉన్నాడు అని ఆలోచిస్తుంది. ఇక రిషిని గట్టిగా అడిగి తెలుసుకోవాలి అని మళ్ళీ తిరిగి క్లాస్ కి వెళ్తుంది. అప్పటికే రిషి వసు జ్ఞాపకాలతో కుమిలిపోతూ ఉంటాడు. వసు లోపలికి వెళ్తున్న సమయంలో గౌతమ్ పిలవడంతో రిషి బయటకు వచ్చి చూస్తాడు. ఇక గౌతమ్ వసుతో ఎందుకు ఇలా చేసావు అని అడిగి.. అలాగే ఆ పెయింటింగ్ గీసింది, లవ్ లెటర్ రాసింది రిషి అని చెప్పటంతో వసు షాక్ అవుతుంది.

Guppedantha Manasu June 2 Episode: తన తల్లి గొప్ప వరం ఇచ్చింది అంటున్న రిషి..
కానీ మళ్లీ వాటిని గౌరవిస్తున్నాను అని నా లక్ష్యాన్ని నేను ప్రేమిస్తున్నాను అని నాకు ఎవరి పైన ప్రేమ లేదు అని అంటుంది. తరువాయి భాగం లో జగతి రిషి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా.. నేను రిజెక్ట్ పర్సన్ అని నాకు ఇది అలవాటే అని.. గతంలో నా కన్నతల్లి నాకు తట్టుకున్న గొప్ప వరం అందించింది అని అంటాడు.