Guppedantha Manasu June 20 Episode: ఈరోజు ఎపిసోడ్ లో రిషి లైబ్రరీలో ఉండగా అక్కడికి సాక్షి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సాక్షి రిషితో పెళ్లి చేసుకుంటావా లేదా అని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆ మాటకు రిషికి ఎటు అర్థం కాకుండా ఉంటుంది. ఇక నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని.. లేదంటే ఫైర్ అలారం పై నొక్కేస్తాను అని బెదిరిస్తుంది.
రిషిని బ్లాక్ మెయిల్ చేస్తున్న సాక్షి..
కానీ రిషి మాత్రం మౌనంగా ఉంటాడు. అలారం మోగడంతో అందరూ వస్తారు అని.. అప్పుడు నా జుట్టు చదరగొట్టుకుంటానని.. నా బట్టలు అంటూ నా ప్లాన్ మరోలా ఉంది అని అంటుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు అని.. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని.. ఇలా చేసినా కూడా పరువు పోయినా కూడా పెళ్లి మాత్రం జరుగుతుందని అంటుంది.
పెళ్లికి ఒప్పుకోకుంటే అలారం మోగిస్తాను అని కౌంట్ చేస్తుంది. కాని రిషి మాత్రం ఏమనలేకుండా మౌనంగా ఉంటాడు. మొత్తానికి సాక్షి అలారం మోగించటంతో.. కాలేజ్ నుంచి బయటకు వస్తున్న జగతి దంపతులు.. వెంటనే అలారం విని లోపలికి పరుగులు తీస్తారు. అంతేకాకుండా కొందరి స్టూడెంట్స్ తో పాటు స్టాఫ్ కూడా లోపలికి పరుగులు తీస్తారు.
సీన్ కట్ చేస్తే..
సాక్షి మాత్రం రిషిని తన మాటలతో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అంతేకాకుండా నిన్ను ఏ దేవుడు కూడా కాపాడడు అంటుంది. అప్పుడే సీన్ లోకి ఎంట్రీ ఇస్తుంది వసు. దాంతో రిషి ఆశ్చర్యపోతాడు. సాక్షి మాత్రం షాక్ లో ఉంటుంది. మొత్తానికి రిషిని కాపాడటానికి వస్తుంది వసు. ఇక వసు సాక్షిని ఉద్దేశించి కథ అడ్డం తిరిగింది అని వెటకారం చేస్తూ ఉంటుంది.
రిషి మాత్రం వసు ఇక్కడ ఏం చేస్తుంది అని అనుకుంటాడు. ఇక వసు సాక్షితో సర్ దగ్గరికి వస్తే అసలు ఊరుకోను అని అంటుంది. ఏదో చేస్తాను అంటున్నావు కదా ఏం చేస్తావో చెయ్యి అని వార్నింగ్ ఇస్తుంది. అందరూ లోపకి వస్తారు అని.. అందరూ అడిగితే నిజం చెప్పేస్తాను లేదా నువ్వే డోర్ ఓపెన్ చేయు అని అంటుంది.
షాక్ లో జగతి దంపతులు..
అప్పుడే జగతి వాళ్ళు వచ్చి డోర్ కొట్టడంతో సాక్షి వెళ్లి తీస్తుంది. ఇక సాక్షిని చూసి జగతి దంపతులు షాక్ అవుతారు. ఇక్కడ ఉన్నావేంటి అని అడగటంతో వసు బాగా కథలు అల్లి చెబుతుంది. దాంతో సాక్షికి దిమ్మ తిరిగి పోతుంది. ఆ తరువాత వసు, రిషి జరిగిన విషయాలు తలుచుకుంటారు.

Guppedantha Manasu June 20 Episode: రిషి ముందు పాట పాడిన వసు..
ఇక వసు ఇంటికి వెళ్తుండగా.. సాక్షి మళ్ళీ ఎదురుపడుతుంది. దాంతో సాక్షి కోపంతో రగిలిపోతూ వసు పై అరుస్తుంది. ఇక వసు కూడా సాక్షి పై గట్టిగా అరుస్తుంది. తరువాయి భాగంలో వసు రిషి ముందు పాట పాడుతూ కొత్తగా కనిపిస్తుంది.