Guppedantha Manasu June 22 Episode: ఈరోజు ఎపిసోడ్ లో రిషి కాలేజ్ కి రాగానే అక్కడ టేబుల్ పైన ఒక లెటర్ ఉండటంతో అందులో పెన్ డ్రైవ్ ఉంటుంది. ఎవరు పంపారు అని చూసేసరికి అందులో సాక్షి మాట్లాడిన వీడియో రికార్డింగ్ ఉంటుంది. వసుకు ప్రపోజ్ చేసావు అని.. తను రిజెక్ట్ చేసిన కూడా తన కోసం ఎందుకు అంత తపన పడుతున్నావు అని.. నా ప్రేమను అర్థం చేసుకో అని.. ఐ లవ్ యూ అని అనగానే వెంటనే ఆ వీడియో క్లోజ్ చేసేసాడు.
వసు పై కోపంగా అరిచిన రిషి..
అప్పుడే అటెండర్ తో వసును పిలిపించగా.. వసు పై కోపంగా అరుస్తాడు. సాక్షితో అన్ని విషయాలు ఎందుకు చెప్పావు అని.. ఏదో నిన్ను ఇష్టపడ్డాను కానీ.. అలా నువ్వు సాక్షితో అన్ని విషయాలు చెబుతావా అంటూ బాగా కోపంతో అరుస్తాడు. ఇక వసు గతంలో జరిగిన విషయాన్ని తలచుకొని.. తన మనసులో అక్కడ సాక్షి ఉన్న విషయం ఎలా చెప్పాలి అని.. ఇప్పుడు చెప్తే అప్పుడు ఏం చేశావు అని అరుస్తాడు అని ఊరుకుంటుంది.
ఆలోచనలో పడ్డ వసుధార..
ఆ తర్వాత వసు బయటకి వచ్చి రిషి అన్న మాటలు తలుచుకుంటూ ఉంటుంది. అక్కడ సాక్షి ఉన్న విషయం ఎలా చెప్పాలి అని అనుకుంటుంది. అప్పుడే అక్కడకు జగతి రావటంతో.. ఏం జరిగింది అని ప్రశ్నిస్తుంది. ఎందుకు అలా ఉన్నావు అని అంటుంది. రిషి ఏమైనా అన్నాడా అనటంతో.. రిషి జెంటిల్ మెన్ అని అక్కడి నుంచి బయలుదేరుతుంది.
మౌనంగా ఉన్న వసు..
అప్పుడే వసుకు మహేంద్రవర్మ ఎదురుకావడంతో.. ఏం జరిగింది అని మహేంద్ర ప్రశ్నించగా.. వసు ఏమి చెప్పకుండా మౌనంగా వెళ్ళి పోతుంది. ఇక మహేంద్రవర్మ జగతి దగ్గరికి వెళ్లి వసు ఎందుకు అలా ఉంది అని అడుగుతాడు. నేను అడిగినా కూడా ఏమీ సమాధానం చెప్పలేదు అని జగతి అంటుంది.
ఆ తర్వాత సాక్షి దేవయాని దగ్గరికి వెళ్లి తనకు ఎటు అర్థం కాకుండా ఉంది అని అనటంతో.. వెంటనే దేవయాని కొన్ని డైలాగులు చెబుతూ.. రిషి ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది అని.. అయినా కూడా దాని కోసం ప్రయత్నిస్తూ ఉండాలి అని సాక్షి ధైర్యం ఇస్తూ ఉంటుంది. ఒకవైపు రిషి, మరోవైపు వసు ఇద్దరు తమ దగ్గర ప్రేమకు గుర్తుగా ఉన్న గోలీల సీసాను చూసుకుంటూ ఆలోచనలో పడతారు.

Guppedantha Manasu June 22 Episode: జ్ఞాపకాలతో మునిగిపోతున్న వసు, రిషి..
అది చూసుకుంటూ ప్రేమించుకుంటారు. అదే సమయంలో ఇద్దరి చేతిలో ఉన్న ఆ వస్తువు కింద పడిపోతుంది. అప్పుడే రిషి దగ్గరికి జగతి వచ్చి వసును ఉద్దేశించి మాట్లాడుతుంది. ఒక వస్తువు జారిపడితే మళ్ళీ తిరిగి పొందలేము అన్నట్లుగా చెబుతుంది. ఆ తర్వాత జగతి తను ప్రాజెక్టు వర్కు కోసం వచ్చాను అని దాని గురించి టాపిక్ తీసి మాట్లాడుతుంది. ఆ తర్వాత వసు, రిషి ఆ సీసంను మళ్లీ దగ్గరికి తీసుకుంటారు.