Guppedantha Manasu June 23 Episode: ఈరోజు ఎపిసోడ్ లో వసు కలెక్టర్ చెప్పిన ప్రాజెక్టు పూర్తి కావడంతో కరెక్షన్ కోసం జగతికి ఫోన్ చేస్తుంది. ఇక అది రిషి చూసుకుంటాడని నేను మళ్ళీ చెబుతాను అని జగతి చెబుతుంది. అప్పుడే జగతి దగ్గరికి మహేంద్రవర్మ, గౌతమ్ వచ్చి రిషి గురించి మాట్లాడుకుంటారు. రిషిని ఒప్పించే ప్రయత్నం చేయలేక పోతున్నాను అని జగతి బాధపడుతుంది. అలా కాసేపు రిషి గురించి మాట్లాడుతూ ఉంటారు.
సీన్ కట్ చేస్తే..
మరుసటి రోజు వసు, గౌతమ్, జగతి దంపతులు కాలేజీ వర్క్ విషయంలో ఒక దగ్గర కూర్చుని వర్క్ చేస్తూ ఉంటారు. వసు ని చూసిన రిషి మళ్లీ ఆలోచనలో పడతాడు. ఎందుకు తనను రిజెక్ట్ చేసింది అని తనను తాను ప్రశ్నించుకుంటాడు. ఇక వసు కూడా రిషి ని చూసి తన వల్లే రిషి సర్ అలా ఉన్నాడు అని బాధపడుతుంది. ఆ తర్వాత అందరికోసం ధరణి కూల్ డ్రింక్ తీసుకొని వెళుతుండగా దేవయాని అడ్డుపడి వసు ను ఉద్దేశించి కోపంగా మాట్లాడుతుంది.
దాంతో అక్కడే ఉన్న ఫనీంద్ర ఎప్పుడు ఇదే ఆలోచనలో ఉంటావా దేవయాని అని గట్టిగా ప్రశ్నిస్తాడు. అయినా కూడా దేవయాని పంతం వీడకుండా వసు, జగతి లను ఉద్దేశించి మాట్లాడుతుంది. ఆ తర్వాత ప్రాజెక్టు విషయంలో మహేంద్ర వర్మ దంపతులు ఒక నిర్ణయానికి వస్తారు. ఇక ఆ విషయం గురించి రిషి దగ్గరికి వెళ్లి చెబుతారు.
ప్రాజెక్టు విషయంలో రెండు భాగాలు గా ఉండి పని చేయాలి అని చెబుతారు. ఒక గ్రూపు కు తాను, మహేంద్రవర్మ ఉంటారు అని.. మరో గ్రూపు కు వసు, వసంత మేడం ఉంటారు అని అనటంతో రిషి ఏం అనలేకుండా మౌనంగా ఉంటాడు. ఆ తర్వాత మహేంద్ర వర్మ రిషి తాను వెళ్తాను అని అంటాడేమో అనుకోని రిషి వైపు చూస్తూ ఉంటాడు.
వసు ఆలోచనలోనే ఉంటున్న రిషి.
రిషి తన నిర్ణయం చెప్పకుండా వారిని అక్కడి నుంచి పంపిస్తాడు. ఆ తర్వాత గౌతమ్ వసంత మేడం తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక వసు సైకిల్ పై అక్కడికి వస్తుంది. ఆ తర్వాత అక్కడ ప్రాజెక్టు పనిలో మునిగి పోతుంటారు. అప్పుడే రిషి అక్కడికి వచ్చివాళ్ల కోసం ఎదురుచూస్తారు. ఇక వసు తనని దూరం పెట్టిన కూడా నేనెందుకిలా ఉన్నాను అని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

Guppedantha Manasu June 23 Episode: జగతి దంపతులను అవమానించిన దేవయాని..
మరోవైపు దేవయాని దంపతులు భోజనం చేస్తూ ఉండగా.. జగతి దంపతులు వస్తారు. వారు బయట స్లమ్ ఏరియాలో భోజనం చేసాము అని చెప్పటంతో.. దేవయాని వారిపై గట్టిగా అరుస్తుంది. అలాంటి ఏరియాలో తిన్నందుకు అవమాన పరుస్తుంది. రిషి కూడా అలాగే తయారవుతాడు అని అంటుంది. ఇక రిషి గౌతమ్ కు ఫోన్ చేసి కారులో వసు ఉందా లేదా అని కనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తాడు. వసు సైకిల్ పై వచ్చింది అనటంతో రిషి ఏరియాకు సైకిల్ పై ఎలా వచ్చింది అని బాధ పడతాడు.