Guppedantha Manasu June 3 Episode: ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్ వసు తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక వసు తను తన లక్ష్యాన్ని ప్రేమిస్తున్నాను అని, తన చదువును ప్రేమిస్తున్నాను అని అంటుంది. గౌతమ్ మాత్రం నేను రిజెక్ట్ చేసినప్పుడు నేను రియలైజ్ కావడానికి టైమ్ పట్టింది అని కాని రిషి అలా కాదు వాడు చాలా బాధపడతాడు అని అంటాడు.
దాంతో వసు జీవితంలో ప్రేమ ఒక భాగమని కాని ప్రేమే జీవితం కాదని అనడంతో అక్కడ పక్కనే ఉన్న రిషి వెళ్తాడు. అప్పుడే రిషి ఫోన్ మోగడంతో వెంటనే వాళ్ళిద్దరు చూస్తారు. దాంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్ళిపోతాడు. వెనుకాల
గౌతమ్ పిలుస్తూ ఉంటాడు.
సీన్ కట్ చేస్తే..
రిషి జరిగిన విషయాలను తలుచుకుంటూ ఉంటాడు. అప్పుడే జగతి లోపలికి రావడం తో.. మీతో మాట్లాడాలి అని అంటుంది. దాంతో రిషి మీ శిష్యురాలు మీకు అన్ని విషయాలు చెప్పే ఉంటుంది.. మళ్లీ నేను చెప్పాల్సింది ఏముంది అని అంటాడు. ఇక చెప్పాల్సింది ఏమీ లేదు అన్నట్లుగా మాట్లాడుతాడు. జగతి మాత్రం అసలు వసు అలా అనడానికి కారణం అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా.. రిషి ఆపుతాడు.
రిషి మాటలకు తట్టుకోలేకపోయిన జగతి..
తను రిజెక్ట్ పర్సన్ అని తన లైఫ్ లో అన్నీ రిజెక్ట్ అయ్యే ఉన్నాయి అని అంటారు. చిన్నప్పుడు మీరు వదిలేశారు అని.. కొంతకాలానికి సాక్షి తన చదువు విషయంలో వదిలేసింది అని.. ఇప్పుడు వసు వదిలేసింది అని చెప్పుకుంటూ బాధపడతాడు. ఇక ఇవన్నీ అలవాటు అయ్యాయి అని.. ఈ బాధలు మోసే భారం తనకు తన తల్లి నేర్పించింది అని.. ఇది పెద్ద గొప్ప వరం అని అనటంతో జగతి చాలా బాధపడుతుంది.
జగతికి మాట్లాడటానికి మరో అవకాశాన్ని ఇవ్వకుండా చేతులెత్తి దండం పెడతాడు. మరోవైపు వసు రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రిషి సర్ కనీసం ఫోన్ కూడా చేయటం లేదు అనుకుంటుంది. ఓవైపు రిషి కూడా అలాగే అనుకుంటాడు. కనీసం ఇంత జరిగినా కూడా సారీ చెప్పడానికి ఏమవుతుంది అని అనుకుంటాడు. ఆ తర్వాత వసు ఫోటో చూస్తూ ఉంటాడు.

Guppedantha Manasu June 3 Episode: బుక్ విషయంలో టెన్షన్ పడుతున్న వసు..
పొరపాటున ఫోన్ వసుకు పోవటంతో రిషి నెంబర్ చూసి వసు సంతోషంగా ఫీల్ అవుతుంది. వెంటనే రిషి ఫోన్ కట్ చేయగా మళ్లీ వసు చేస్తుంది. ఇక రిషి ఫోన్ కట్ చేసి పొరపాటు వల్ల ఫోన్ వచ్చింది అని అంటాడు. ఇక ఉదయాన్నే రిషి కాలేజ్ కి వెళ్లగా అక్కడ పుష్పతో క్లాస్ ఉదయాన్నే ఉంటుంది అని అందరి బుక్స్ కలెక్ట్ చేసుకోమని అంటాడు. తరువాయి భాగం లో వసు తన బుక్ టేబుల్ పై ఉంది అనటంతో బాగా టెన్షన్ పడుతుంది. రిషి కూడా రాగానే ఆ బుక్కు చూసి వసు వైపు సీరియస్ లుక్ ఇస్తాడు. దీనిబట్టి వసు ఏదో విషయంలో బుక్ అయినట్లు కనిపిస్తోంది.