Guppedantha Manasu June 30 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్, రిషి లతో పాటు ధరణి కూడా వసును అభినందించడానికి వసు ఇంటికి బయలుదేరుతారు. ఆ సమయంలో వసు వీధి నుంచి బిందె మోసుకొని రావటంతో ధరణి తనకు సహాయం పడుతుంది. తర్వాత వసు స్కాలర్షిప్ టెస్టులో మంచి ర్యాంకు సొంతం చేసుకుందని ధరణి తనకు స్వీట్ పెడుతుంది. ఆ తర్వాత గౌతమ్ కూడా తనకు శుభాకాంక్షలు చెబుతాడు. ఇక రిషి కాస్త చిరాకులో ఉన్నట్లు అనిపించినా కూడా శుభాకాంక్షలు తెలిపి అక్కడ నుంచి బయలుదేరుతారు. ఇక వసు తనకోసం ఇక్కడికి వచ్చినందుకు రిషికి థాంక్స్ అని చెబుతుంది.
సీన్ కట్ చేస్తే..
ఫణీంద్ర వర్మ ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా పక్కనే ఉన్న దేవయాని ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఫణీంద్ర వర్మ కూడా తనకు వెటకారంగా సమాధానం ఇస్తాడు. అప్పుడే ఇంట్లోకి రిషి వాళ్లు రావడంతో ఎదురుగా ఉన్న దేవయానిని చూసి ధరణి భయపడుతుంది. ఇక దేవయాని ఎక్కడికి వెళ్లారు అని బాగా ఆరా తీయడంతో రిషి వెంటనే వసు గురించి అభినంద సభ ఏర్పాటు చేయడానికి స్థలం చూడడానికి వెళ్ళామని అంటాడు.
ఆ తర్వాత దేవయాని ధరణిని ఎందుకు తీసుకెళ్లావు అనటంతో.. అక్కడికి వెళ్లి నేను ఒక్కడిని వసు తో మాట్లాడితే బాగుండదు అని అందుకే వదినని తీసుకొని వెళ్లాను అని అంటాడు. దేవయాని తన మనసులో రిషి, వసు మళ్లీ ఒకటి అవుతున్నారేమో అని ఆలోచనలో పడుతుంది. ఇక కాలేజ్ లో అందరూ వసు అభినంద సభ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
సంతోషంలో వసు..
పుష్ప వెళ్లి వసుతో సన్మాన సభ గురించి మాట్లాడుతుంది. అంతేకాకుండా దానికి ఏర్పాట్లు రిషి సార్ దగ్గరుండి చేస్తున్నాడు అనటంతో వసు సంతోషపడుతుంది. తన మీద సర్ కు కోపం పోయింది అని అనుకుంటుంది. కానీ రిషి జగతి దంపతులతో ఏర్పాట్లు ఎక్కువగా చేయకూడదు అని కొన్ని కండిషన్లు పెడుతూ ఉంటాడు.
వసును చూడకుండా ఉండలేకపోతున్న రిషి..
ఆ సమయంలోనే అక్కడ వసు కనిపించడంతో రిషి వసువైపు చూస్తూ ఉంటాడు. జగతి దంపతులు కమిషనర్ ను ఆహ్వానించాలా అని అనటంతో రిషి మీ ఇష్టం అంటూ వసు వైపు చూస్తూ సమాధానం చెబుతాడు. ఆ తర్వాత జగతి దంపతులు రిషి చూపులను గమనించి అక్కడి నుంచి వెళ్తుండగా వెంటనే రిషి ఏం జరిగింది అని అంటాడు.

Guppedantha Manasu June 30 Today Episode: మరో కుట్ర బయట పెట్టిన సాక్షి..
ఇక మహేంద్ర వర్మ కమిషనర్ గురించి చెప్పటంతో తప్పకుండా పిలవాలి అని అంటాడు. ఇక జగతి వసు దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా రిషి అక్కడ ఉంటే వసు జ్ఞాపకాలు వెంటాడుతాయి అని వెళ్తాడు. వసు ఆపిన కూడా వినిపించుకోడు. ఆ తర్వాత మహేంద్ర వర్మ ఎక్కడికి వెళ్తున్నావని అడగటంతో పని ఉందని చెప్పి బయటికి వెళ్తాడు. ఇక తరువాయి భాగంలో రిషి మళ్లీ కార్యక్రమం కి రాగా అక్కడ సాక్షి రిషి, వసు ల ప్రపోజల్ వీడియోను బయటపెడుతుంది. దాంతో అది వసునే ప్లాన్ చేసింది అనుకొని రిషి తనపై గట్టిగా అరుస్తాడు.