Guppedantha Manasu May 10 Episode: ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్ ప్రపోజల్ ను వసు రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో రిషి తన మనస్సు ఉత్సాహంగా ఉంది అని మహేంద్రవర్మ వాళ్లకు పార్టీ ఇవ్వాలని అనుకుంటాడు. పైగా చీఫ్ గెస్ట్ గా గౌతమ్ అని అనడంతో.. మరోవైపు గౌతమ్ మండి పడుతూ ఉంటాడు. తనను వసు రిజెక్ట్ చేసిన బాధలో కనిపిస్తూ ఉండగా మహేంద్ర వర్మ మాత్రం కంగ్రాచ్యులేషన్స్ అని చెబుతాడు.
అంతేకాకుండా ఒక ఫ్రెండ్ గా నీకు రిషి చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నాడు అని అంటాడు. దాంతో గౌతమ్ లోలోపల రిషి సంతోషానికి కారణం ఏంటో నాకు తెలుసు అని అనుకుంటాడు. ఆ తర్వాత రిషి జగతిని చూసి పార్టీ ఇవాళ వద్దు అని ఆ తర్వాత ఇస్తాను అని అంటాడు. ఒకవేళ అక్కడికి వస్తే డాడ్ ప్రశ్నల మీద ప్రశ్నలతో విసిగిస్తాడు అని అనుకుంటాడు. జగతి మాత్రం తన కోసమే పార్టీ ఇవ్వను అని అన్నాడని బాధపడుతుంది.
సీన్ కట్ చేస్తే..
రిషి తన గదిలో వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వసు తన ఫోటో పంపించడంతో ఈ ఫోటో గురించి ఆలోచిస్తూ ఉందేమో అని అనుకుంటాడు రిషి. ఇక వసు ఒకచోట మీట్ అవుదాం అని అంటుంది. మరోవైపు దేవయాని, సాక్షి రిషి గురించి మాట్లాడుతూ ఉంటారు. రిషి ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు అని సాక్షి అనడంతో దేవయాని కాస్త సమయం పడుతుంది అని.. మార్చే ప్రయత్నం చేసుకోమని సలహా ఇస్తుంది.
సాక్షికి వార్నింగ్ ఇచ్చిన వసు..
ఇక ఆ తర్వాత రోజు రిషి వసు రెస్టారెంట్ కి వెళ్లి సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అక్కడికి సాక్షి వచ్చి వారి మాటలు వింటుంది. అప్పుడే వసు లోపలికి వెళ్లడంతో సాక్షి రిషి దగ్గరికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కానీ రిషి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అప్పుడే వసు రావడంతో సాక్షి వసు అమర్యాదకరంగా మాట్లాడుతుంది. దాంతో వసు తన స్టైల్లో సాక్షికి గట్టి వార్నింగ్ ఇస్తుంది.
రిషికి ఐ లవ్ యూ చెప్పిన వసు..
అప్పుడే రిషి వసుకు మెసేజ్ చేయటంతో వసు వెళ్లి రిషిని మీట్ అవుతుంది. ఇక రిషి ఏంటి అని అడగటంతో.. వెంటనే వసు ఐ లవ్ యు అంటుంది. ఆ గ్యాప్ లో రిషి షాక్ అవుతాడు. ఏంటి అని రిషి అడగటంతో అదే ఐ లవ్ యు టాపిక్ గురించి చెప్పాలి అని.. ఈ రోజు గౌతమ్ తనను ప్రపోజ్ చేశాడు అని జరిగిన విషయం చెబుతుంది.

Guppedantha Manasu May 10 Episode: అసలు నిజం తెలుసుకున్న జగతి..
తరువాయి భాగంలో రిషి రాసిన లవ్ లెటర్ ను జగతికి చూపిస్తాడు మహేంద్ర వర్మ. దీంతో జగతి అది గతంలో రాసిన లెటర్ అని గుర్తు పట్టడంతో.. వెంటనే మహేంద్రవర్మ రిషి ఎలా రాశాడో చూడు అని అంటాడు. దీంతో ఆ లెటర్ రాశాడు అనుకుంటుంది జగతి.