Guppedantha Manasu May 12 Episode: ఈ రోజు ఎపిసోడ్ లో వసు రిషి క్యాబిన్ లో వర్క్ చేస్తూ ఉండగా అక్కడికి రిషి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రిషి వసుతో కాసేపు మాట్లాడుతూ ఉంటూ చదువు గురించి పట్టించుకోవా అని అడుగుతాడు. దాంతో చదువు గురించి తను మర్చిపోలేను అని చక్కగా వర్ణిస్తుంది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఒకరికొకరు తమ మనసులో ఒకరి గురించి ఒకరు కొత్తగా ఉంది అన్నట్లుగా అనుకుంటారు.
అప్పుడే సాక్షి కారులో రావటంతో అది గమనించిన రిషి వెంటనే వసును అక్కడి నుంచి తీసుకొని లైబ్రరీ కి వెళ్తాడు. తన గురించి ఎవరు వచ్చినా లేరని చెప్పమని అంటాడు. దాంతో సాక్షి వచ్చి అక్కడ ఓ వ్యక్తిని అడగటంతో సార్ ఇప్పుడే వెళ్ళాడు అని చెబుతాడు. ఇక సాక్షి రిషి ని కలిసే రైట్స్ తనకు ఉన్నాయి అని.. తనను గట్టిగా అడిగే అర్హత తనకు ఉంది అని.. ఎందుకంటే తమకు ఇదివరకే ఎంగేజ్మెంట్ అయ్యింది అని అనుకుంటుంది.
సీన్ కట్ చేస్తే..
ఇక రిషికి ఫోన్ చేస్తూ ఉండగా రిషి ఫోన్ స్విచాఫ్ చేస్తాడు. అప్పుడే వసు రావడంతో వెంటనే అక్కడి నుంచి బయటకు తీసుకొని వెళ్తాడు. రిషి డల్ గా ఉండటం చూసి వసు అడుగుతుంది. ఏం జరిగింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. దాంతో రిషి ఓ చోట కారు ఆపి తనలో ఉన్న ప్రశ్నను వసును అడుగుతాడు. ఇష్టం, అయిష్టం కు మధ్య తేడా ఏంటి అని అడుగుతాడు. దాంతో వాటి మధ్య అక్షరాలు తేడా ఉంటాయి కానీ దానివల్ల జీవితమే మారుతుంది అన్నట్లుగా చెబుతుంది వసు.
సంతోషం గా కనిపిస్తున్న రిషి..
ఇక వాటి గురించి అద్భుతంగా వివరిస్తుంది. దాంతో రిషి మంచి సమాధానం చెప్పావు వసుధార అని సంతోషంగా ఫీల్ అవుతాడు. అంతేకాకుండా తన నుండి తన అయిష్టాన్ని దూరం చేయాలి అని అడగటంతో షో మీ అయిష్టాన్ని దూరం చేయటానికి సపోర్ట్ చేస్తాను అని అంటుంది. ఇక రిషి మనసులో నువ్వు ఇచ్చిన ధైర్యం, చెప్పిన మాటలు నాకు మరింత ధైర్యం ఇచ్చాయి అని అనుకుంటాడు. వసు కూడా నేను చెప్పిన మాటలు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి అని అంటుంది.
వసు కు జగతి గిఫ్ట్..
ఇంకా వారి మధ్య కాసేపు అలా సాగుతుంది. మరోవైపు మహేంద్రవర్మ దంపతులు వసు రూమ్ కు వెళ్లి అక్కడ లవ్ లెటర్, ఫోటోలు చూసి మురిసిపోతారు. అప్పుడే వసు రావడంతో తనకు గౌతమ్ ప్రపోజ్ చేశాడనే విషయం చెబుతుంది. ఇక మహేంద్ర వాళ్లకు మ్యాటర్ అర్థం కావడంతో సంతోషం గా కనిపిస్తారు. వెంటనే జగతి వసు ఫోన్ కు లవ్ లెటర్ ను పంపించి ఒక గిఫ్టు ఇస్తున్నాను అని అంటుంది. వసు ఆ లవ్ లెటర్ చూసి ఆశ్చర్యపోతుంది.

Guppedantha Manasu May 12 Episode: వసు మనసు ముక్కలు చేసిన బస్తీ పిల్లలు..
ఆ తర్వాత ఆ లవ్ లెటర్ ను, తన బొమ్మని చూసుకుంటూ రెండింటికీ ఒకే పోలిక ఉంది అని అనుకుంటుంది. అద్భుతమైన లెటర్ అని, అందమైన చిత్రమని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బస్తీ పిల్లవాడు వచ్చి ఆ బొమ్మను అందరికీ చూపిస్తాను అని పొరపాటున చింపేస్తాడు. అప్పుడే రిషి రావడంతో బాగా ఎమోషనల్ అవుతూ ఆ బొమ్మ గీసిన వారిపై తన మనసులో మంచి అభిమానం ఉంది అని అంటుంది.