Guppedantha Manasu May 13 Episode: వసు హృదయాన్ని అతికించిన రిషి.. ఆలోచనలో పడిన వసు!

Akashavani

Guppedantha Manasu May 13 Episode: ఈరోజు ఎపిసోడ్ లో వసు లవ్ లెటర్ ను, తన ఫోటోను చూసుకుంటూ తెగ మురిసిపోతుంది. చూస్తే రెండింటికీ ఒకే పోలికలు ఉన్నాయి అనుకుంటుంది. అంతేకాకుండా ఈ లెటర్ రైటింగ్ ఎక్కడ చూశాను అని అనుకుంటుంది. గౌతమ్ మాత్రం ఈ లెటర్ రాయలేదు అనుకొని.. రిషి రైటింగ్ గుర్తుచేసుకొని బహుశా రిషి సర్ రాశాడా అని ఆలోచిస్తుంది.

ఒకవేళ ధైర్యం చేసి రిషి సర్ ను అడిగితే.. ఎలా ఉంటుంది అని.. మళ్ళీ భయపడి అడగక పోవటమే మంచిది అని అనుకుంటుంది. అంతేకాకుండా జగతి మేడం ఈ లెటర్ తనకు పంపించడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తుంది. అంతలోనే ఒక ట్యూషన్ పిల్ల వాడు అక్కడికి వచ్చి వసు బొమ్మను చూసి అందరికీ చూపిస్తాను అని పరిగెత్తుకొని తీసుకొని వెళ్తాడు. అప్పటికే వసు వద్దు అన్న కూడా వినిపించుకోకుండా ఆ పిల్లోడు అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాడు.

బొమ్మను చింపేసిన పిల్లలు..

అంతలోనే రిషి అక్కడ కు వస్తాడు. అక్కడ జరుగుతున్న విషయాన్ని గమనిస్తూ ఉంటాడు. ఇక ఆ పిల్లోడు మరో పిల్లోడు చేతికి ఇవ్వటంతో ఇద్దరు ఆ బొమ్మ కోసం తాపత్రయ పడటం తో వెంటనే ఆ పిల్లలిద్దరూ ఆ బొమ్మని చింపేసి అక్కడినుంచి వెళ్ళిపోతారు. దాంతో వసు షాక్ అవుతూ ఎమోషనల్ అవుతుంది. రిషి రావడాన్ని చూసి ఆ బొమ్మ గీసిన వారి గురించి అద్భుతంగా చెబుతూ బాధపడుతుంది.

వసు మనసును అతికించిన రిషి..

దాంతో రిషి తనను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. కానీ వసు మాత్రం ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక రిషి ఇంటికి వెళ్లి వసు బొమ్మ గిసే పనిలో ఉంటాడు. మరోవైపు వసు ఆ బొమ్మలు చూస్తూ ఎమోషనల్ దానిని అతికి పెట్టే పనిలో ఉంటుంది. ఇక రిషి మాత్రం వసును గుర్తుకు చేసుకొని బొమ్మ గీస్తూ ఉంటాడు. అంతలోనే తనకు సాక్షి గుర్తుకు రావడంతో సాక్షికి, వసు కు తేడా ఏంటి అని ఆలోచిస్తాడు.

సంతోషంలో వసు..

మొత్తానికి వసు బొమ్మ అద్భుతంగా గీస్తాడు రిషి. మరుసటి రోజు వసు రెస్టారెంట్ లో ఉండగా అక్కడ వసు అందరికీ సర్వ్ చేస్తుంది. ఇక బయట ఉన్న రిషి ఒక పిల్లాడితో తను గీసిన బొమ్మను వసుకు పంపిస్తాడు. ఇక వసు ఆ బొమ్మని చూసి సంతోషపడుతుంది. అప్పుడే రిషి రావడంతో తన సంతోషాన్ని పంచుకుంటుంది.

Guppedantha Manasu May 13 Episode: వసు హృదయాన్ని అతికించిన రిషి.. ఆలోచనలో పడిన వసు!
Guppedantha Manasu May 13 Episode: వసు హృదయాన్ని అతికించిన రిషి.. ఆలోచనలో పడిన వసు!

Guppedantha Manasu May 13 Episode: రిషిని హగ్ చేసుకున్న వసు..

ఆ బొమ్మ ఎవరు గీసారో ఆ బాబును కనుక్కుంటాను అని అంటుంది. దాంతో రిషి కాస్త టెన్షన్ పడుతూ కనిపిస్తాడు. తరువాయి భాగంలో వసు బాగా ఆలోచనలో పడుతుంది. ఇక రిషి ఈ బొమ్మ నేనే గీసినట్లయితే అనడంతో వెంటనే ఆలోచించకుండా రిషినీ హగ్ చేసుకుంటుంది. దీంతో రిషి షాక్ అవుతాడు.

- Advertisement -