Guppedantha Manasu May 19 Episode: ఈరోజు ఎపిసోడ్ లో రిషి దగ్గరికి వచ్చిన జగతి వసు గురించి చెబుతుంది. అంతేకాకుండా నువ్వు వసు ను ప్రేమిస్తున్నావు అని నేరుగా అంటుంది. గతంలో కూడా ఈ విషయం గురించి నీకు చెప్పాను అనటంతో వెంటనే రిషి గతంలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకొని మళ్లీ ఆ విషయం గురించి మాట్లాడటం తో.. వెంటనే జగతి లవ్ లెటర్ ని తీసి చూపిస్తుంది. ఇక ఆ లవ్ లెటర్ చూసిన రిషి షాక్ అవుతాడు.
సీన్ కట్ చేస్తే..
వసు రిషి గురించి ఆలోచిస్తుంది. రిషి తనతో ఎందుకు కోపంగా ఉన్నాడు అని ఎందుకు అలా మాట్లాడాడు అని అనుకుంటుంది. అంతేకాకుండా సాక్షి గురించి ఆలోచిస్తూ ఆ అహంకారి ఆ ఇంట్లో ఉండటం ఏంటి అని ఆలోచిస్తుంది. ఇక రిషి కి తనపై కోపం ఎక్కువగా ఉండదు అని మళ్లీ వచ్చి మాట్లాడతాడు అని అనుకోగా అప్పుడే రిషి కారు వచ్చి ఆగుతుంది. ఇక వసు రిషి సర్ వచ్చాడు అని అనుకుంటుంది.
కొడుకు కార్లో వచ్చిన జగతి..
కానీ జగతి కనిపించటంతో ఆశ్చర్యపోతుంది. రిషి సార్ వచ్చాడు అనుకున్నాను అని వసు అనటంతో నా కొడుకు కార్లో నేను రావద్దా అని.. నాతో మాట్లాడవా అని.. నా కొడుకుతోనే మాట్లాడతావా అని అంటుంది. ఇక వసు రిషి ప్రవర్తన గురించి అడగడంతో.. తను కొంచెం డిస్టబ్ లో ఉన్నాడు అని అంటుంది. అంతే కాకుండా ఆ విషయం గురించి రిషిని ప్రశ్నించకు అని అంటుంది.
సాక్షి, వసు ల ఆలోచనలో పడ్డ రిషి..
ఇక రిషి కాలేజ్ కి వస్తూ సాక్షి, వసు ల గురించి ఆలోచిస్తాడు. తన ప్రమేయం లేకుండా ఇద్దరు గుర్తుకు వస్తున్నారు అని అనుకుంటాడు. పైగా ఇద్దరిని ఒకరికి ఒకరి తో పోల్చుకుంటున్నానా అని అనుకుంటాడు. అప్పుడే వసు హాల్ టికెట్ వస్తుంది. ఇక మహేంద్రవర్మ వచ్చి కాఫీ తాగుదాం అనడంతో ఇంట్రెస్ట్ లేదని అంటారు. ఇక ఆ హాల్ టికెట్ ని జగతి మేడంకు ఇవ్వమని అంటాడు.
ఇక వసు ఆ హాల్ టికెట్ ను తీసుకొని రిషి దగ్గరికి వస్తుంది. తనతో ఎగ్జామ్ దగ్గరకు రిషిను రమ్మనడంతో రిషి సాక్షి అన్న మాటలను తలచుకుని.. వెళ్లాలని ఉన్న రాలేను అని చెప్పి తనపై ఉన్న ప్రేమను చంపుకుంటాడు. దాంతో వసు చాలా బాధపడుతుంది. జగతి వాళ్ళకి వెళ్లి చెప్పుకొన్ని బాధపడుతుంది. ఇక తరువాయి భాగంలో వసు మాటలు విని రిషి బాగా ఫీల్ అవుతున్నట్లు కనిపిస్తాడు.

Guppedantha Manasu May 19 Episode: వసుకు స్పాట్ పెట్టిన సాక్షి..
ఇక వసు ఎగ్జామ్ కోసం వెళ్తుంది. ఆ విషయం దేవయానికి తెలియటంతో సాక్షికి చెబుతుంది. ఇక సాక్షి ఆ సంగతి నేను చూసుకుంటాను అని అంటుంది. దీనిని బట్టి చూస్తే.. సాక్షి వసు ను ఏదో చేయడానికి స్పాట్ పెట్టినట్లు తెలుస్తుంది.