Guppedantha Manasu May 2 Episode: ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి రిషితో నువ్వు మారవు అనడానికి మీ అమ్మ ఈ ఇంట్లో ఉండటమే ఉదాహరణ అన్నడంతో రిషి తనపై కోపంతో రగిలిపోతూ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. కాని సాక్షి మాత్రం నిన్ను మర్చిపోవడం కష్టంగా ఉంది అని.. ఒకప్పుడు చదువు అనుకున్నాను కానీ.. ఇప్పుడు మాత్రం నువ్వే కావాలి అనిపిస్తుంది రిషి అని అనడంతో వెంటనే రిషి అప్పుడే నువ్వు వద్దనుకున్నావు కాబట్టి వదులుకున్నాను అని ఇప్పుడు మాత్రం ఇష్టం లేదు అన్నట్లుగా అని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
సగం పెళ్లి అయిపోయిందంటున్న సాక్షి..
కానీ సాక్షి మాత్రం ఇప్పటికీ మనకు సగం పెళ్లి అయిపోయింది.. మీ అమ్మ విషయంలో నీలో ఇంత మార్పు వచ్చింది అంటే నా విషయంలో కూడా నీలో మార్పు వస్తుంది అని అంతవరకు ఎదురు చూస్తాను అని అనుకుంటుంది. లేదంటే నేనే మార్చుకుంటాను అని అంటుంది. ఇక రిషి కారులో వెళ్తూ వసు మాట్లాడిన మాటలు, సాక్షి మాట్లాడిన మాటలు తలుచుకొని తన మనసుకు నచ్చని రెండు పనులు జరిగాయి అని అనుకుంటాడు.
వసును తలుచుకుంటున్న రిషి..
ఏ అర్హతతో ఇక్కడ ఉండాలి అని అడిగింది అనుకుంటూ దానికి సమాధానం నేనే చెప్పాలి కదా అనుకుంటాడు. మరోవైపు వసు రిషి తో మాట్లాడిన మాటలను తలుచుకుంటూ రోడ్డుపై వెళుతుంది. రిషి సర్ తో కరెక్టే మాట్లాడానా.. రిషి సర్ హర్ట్ అయ్యాడా అని బాధపడుతుంది. అసలు ఏ అర్హత అక్కడ ఉండాలి అని అనుకుంటుంది. ఇక అక్కడి నుంచి ఆటోలో బయలుదేరుతుంది.
రిషి కూడా తన కారులో పక్క సీట్ చూసుకోని వసును తలుచుకుంటాడు. ఓ చోట కూర్చొని తనతో గడిపిన క్షణాలను తలచుకుంటాడు. మొత్తానికి వసు ఒక ఇంట్లోకి రెంట్ కు దిగుతుంది. ఇక తన మనసులోని సర్ ని ఇన్ని ప్రశ్నలు వేసాను కానీ తను మాత్రం ప్రశ్నలు వేసుకోలేదు అని ఎందుకు రిషి సర్ ఇంతా ఆరాటపడుతున్నాడు అని అనుకుంటుంది. కాలేజీ లో పుష్ప ను వసు అనుకోని ఎంతో ఎగ్జైటింగ్ గా మాట్లాడుతాడు.

Guppedantha Manasu May 2 Episode: ప్రేమికుడిలా బయట పడుతున్న రిషి..
కానీ పుష్ప సర్ అనటంతో.. రిషి తేరుకొని వసు గురించి పదేపదే ప్రశ్నలు అడుగుతుంటాడు. ఎందుకు ఫోన్ స్విచాఫ్ చేసింది.. కాలేజీకి ఎందుకు రావట్లేదు అని ఒక ప్రేమికుడు చూపించే ప్రేమికుడిలా కనిపిస్తాడు రిషి. ఇక వసు ఎక్కడ ఉన్నావు అంటూ ఎన్ని కష్టాలు పడుతున్నావని అనుకుంటాడు. మరోవైపు వసు పిల్లలకు ఉచిత ట్యూషన్ చెప్పడానికి సిద్ధమవుతోంది. రిషి జగతిని పిలిచి వసు గురించి అడుగుతున్న సమయంలో అక్కడికి సాక్షి వస్తుంది.
వసును కలిసిన రిషి..
వెంటనే రిషి సాక్షిని ఉద్దేశించి కొన్ని మాటలు అని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అంతేకాకుండా జగతి కూడా సాక్షికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చి వెళ్ళిపోతుంది. రిషి వసు గురించి ఆలోచిస్తున్న సమయంలో ఆటోల వెళ్తున్న వసు కనిపిస్తుంది. వెంటనే తనను ఫాలో అవుతాడు. వసు పిల్లలతో దాగుడుమూతలు ఆడటంతో అక్కడ రిషి ఎదురు పడతాడు. ఇక రిషి వసును చెప్పకుండా ఎక్కడికి వచ్చావు అని బాధపడుతూ తనపై ప్రేమగా అరుస్తాడు. తరువాయి భాగంలో మహేంద్ర, జగతిలకు త్వరలోనే అన్నింటికి ఒక సమాధానం దొరుకుతుంది అని అంటాడు రిషి.