Guppedantha Manasu May 21 Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. వసు కోసం వచ్చిన రిషి వసు బస్సులో వెళ్లగానే అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అది చూసినా మహేంద్రవర్మ రిషి వచ్చాడని జగతి తో అంటాడు. అంతేకాకుండా రిషి కి ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడగటంతో ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి కట్ చేస్తాడు రిషి.
సీన్ కట్ చేస్తే..
మరోవైపు బస్సులో వసు ఒంటరిగా ప్రయాణిస్తూ రిషి ఆలోచనలో పడుతుంది. రిషి సర్ లేకుండా ఎలా వెళ్లాలి అని అనుకున్నాను అంటూ.. కానీ రిషి సర్ ఆలోచనలలో ఉంటే ఉత్సాహంగా ఉంది అని అనుకుంటుంది. ఇక అలా రిషి ఆలోచనలోనే లీనమవుతుంది వసు. ఆ తర్వాత తన పక్కనే రిషి ఉన్నాడు అని ఊహించు కొని సంతోషంగా కనిపిస్తుంది.
రిషి ఊహల్లో వసు..
పైగా తనకు డౌట్ లను క్లియర్ చేస్తున్నట్లు కనిపిస్తాడు. అలా కాసేపు రిషి ఊహల్లో బతికేస్తుంది. అప్పుడే బస్సు హారెన్ రావడంతో ఆ ఊహల్లో నుండి బయట పడుతుంది. ఇక మళ్ళీ రిషి ఆలోచనలో పడుతుంది. రిషి ప్రవర్తనలో మార్పు వచ్చింది అని.. మునుపటిలా లేడు అని అనుకుంటుంది. రిషి సర్ వస్తే బాగుండు అని అనుకుంటుంది.
అంతలోనే బస్సు ఆగడంతో ఏమి జరిగింది అని అనుకోగా.. అప్పుడే రిషి తన కారు బస్సు కి అడ్డుగా పెడతాడు. ఇక బస్సులోకి ఎక్కి అందరికీ సారీ చెప్పి వసును తీసుకొని వెళ్తాడు. దాంతో వసు తన కోసం రిషి వచ్చాడు అని సంతోషపడుతుంది. ఇక ఇద్దరు కలిసి కారులో వెళ్తుంటారు.
సరికొత్త ప్రయాణం అంటున్న రిషి..
వసు మాత్రం తనకు ఎగ్జామ్ ఉంది అని బస్సు వెళ్లిపోతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది. దాంతో రిషి కారులో కూడా వెళ్లొచ్చు అనటంతో అంటే తనతో ఎగ్జామ్ వరకు రిషి వస్తున్నాడు అని మరింత సంతోషంతో పొంగిపోతుంది. ఇక రిషి ఇది సరికొత్త ప్రయాణం అనటంతో వసు కు ఏమి అర్థం కాకుండా ఉంటుంది.
ఆ తర్వాత రిషి తనను కాసేపు చదువుకోమని ఏమైనా డౌట్లు ఉంటే చెబుతాను అని అంటాడు. ఇక వసు ఇంట్లో నాతో వెళ్తున్నాం అని చెప్పి వచ్చారా అనటంతో రిషి వెటకారం గా చూస్తాడు. ఏమి చెప్పాను నువ్వే ఊహించి చెప్పు అనటంతో.. కాలేజీ పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పరేమో అని వసు అంటుంది.

Guppedantha Manasu May 21 Episode: సింగిల్ బెడ్ రూమ్ తీసుకున్న రిషి..
దాంతో రిషి దేవయాని కి ఫోన్ చేసి అదే విషయం చెబుతాడు. మరోవైపు మహేంద్రవర్మ జగతి తో రిషి ఇంకా ఇంటికి రాలేదు అంటే వసు తో వెళ్ళాడు ఏమో అని అనుమాన పడతాడు. ఇక వసు నీరసంగా కనిపించడంతో తనకు టీ తాపిస్తాడు. తరువాయి భాగంలో డబల్ బెడ్ రూమ్ లేకపోవటంతో ఇద్దరికీ కలిపి సింగిల్ బెడ్ రూమ్ తీసుకుంటాడు రిషి.