Guppedantha Manasu May 23 Episode: ఈరోజు ఎపిసోడ్ లో వసు, రిషి ఒక దాబా దగ్గరికి వెళ్లి అక్కడ టీ తాగుతూ కనిపిస్తారు. ఇక వసు అక్కడ కూడా ఏదో ఒక విషయం గురించి వివరిస్తూనే ఉంటుంది. ఇక ఇద్దరు టీ తాగుతూ ఉండగా వసు పెదాలకు టీ మరకలు అంటుకోవడంతో రిషి వసును ఫోటో తీసి ఆ ఫోటో ద్వారా తన పెదాలకు అంటిన మరకలను చూపిస్తాడు. అంతే కాకుండా తన కర్చీఫ్ ఇచ్చి తుడుచుకో అని చెబుతాడు.
రిషి, వసులను చూసిన సాక్షి..
మరోవైపు వసు పని చేయడానికి సిద్ధమైన సాక్షి అక్కడికి కూడా వస్తుంది. దారిలో రిషి కారు చూసి అక్కడే ఉన్న రిషి, వసు లను చూసి వసు కోసం రిషి వచ్చాడు అని అనుకుంటుంది. దాంతో వసు రాసే ఎగ్జామ్ లో ఊహించని మలుపు ఉంటుంది అని అది నువ్వు కూడా ఊహించ లేవు రిషి అని అంటుంది. ఇక వసు అక్కడ కూడా టీ గురించి వివరించడంతో ముందు ఎగ్జామ్ మంచిగా రాయు అని రిషి వెటకారం చేస్తాడు.
ఇక ఇద్దరు కలిసి కారులో ప్రయాణిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికి ఒక హోటల్ కి వెళ్లి రూమ్ తీసుకోవాలని అనగా అక్కడ సింగిల్ రూం ఉండటంతో అదే రూమ్ తీసుకుంటాడు రిషి. దాంతో పక్కనే ఉన్న వసు షాక్ అవుతుంది. సింగిల్ రూం తీసుకోవడం ఏంటి అని ఇబ్బంది పడుతుంది. రిషి వసును రూమ్ కి వెళ్ళమని చెప్పి తాను బయటికి వెళ్తాడు.
రిషి వాళ్లతో పాటు అదే హోటల్లో సెటిల్ అయిన సాక్షి..
రూమ్ కి వెళ్ళిన వసు మళ్ళీ ఆలోచనలో పడుతుంది. ఇక్కడికి రావడం ఏంటి అని ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడే రిషి రావడంతో కాసేపు ఇద్దరి మధ్య ఫన్నీగా కనిపిస్తుంది. ఆ తర్వాత వసుకు ఫుడ్ ఆర్డర్ చేసి వేరే హోటల్ రూమ్ తీసుకుంటాను అని చెప్పి ఎగ్జామ్ కు ప్రిపేర్ అవ్వమని చెప్పి వెళ్తాడు. సాక్షి కూడా అక్కడే ఒక రూమ్ తీసుకుంటుంది.
రిషి కారులో కూర్చుని వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వసు కోసం ఇక్కడికి కూడా వచ్చానా అని అనుకుంటాడు. అప్పుడే దేవయాని ఫోన్ చేయటంతో కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు. అక్కడే రిషిని సాక్షి చూస్తుంది. సాక్షి కూడా దేవయాని ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇక రిషి పాటలు విందాము అని రేడియో ఆన్ చేస్తాడు.

Guppedantha Manasu May 23 Episode: వసు కోసం లవ్ డాక్టర్ కి ఫోన్ చేసిన రిషి..
అందులో ఎఫ్ఎం లో లవ్ గురించి చెబుతూ లవ్ లో సమస్య కోసం ఫోన్ చేసి లవ్ డాక్టర్ తో మాట్లాడమని అంటాడు. వెంటనే రిషి ఆ నెంబర్ కి ఫోన్ చేసి పోగరు అని పేరు చెప్పి తనతో ఏదో చెప్పాలని అనుకుంటున్న కానీ చెప్పలేకపోతున్నాను అని అంటాడు. దాంతో అదే ప్రేమ అని ఆ లవ్ డాక్టర్ అనటంతో కొత్తగా ఫీల్ అవుతాడు రిషి.