Guppedantha Manasu May 24 Episode: ఈ రోజు ఎపిసోడ్ లో రిషి ఎఫ్ఎం లో లవ్ డాక్టర్ కి ఫోన్ చేసి తనలో ఉన్న అనుమానాలను మొత్తం బయటపెడతాడు. దానితో ఆ లవ్ డాక్టర్ ఇది కచ్చితంగా లవ్వే అంటూ.. ఇవన్నీ లవ్ ప్రారంభంలో లక్షణాలు అని అంటాడు. దాంతో రిషి చాలా కొత్తగా ఫీలవుతూ కనిపిస్తాడు. మరోవైపు మహేంద్ర వర్మ కూడా తనకు బోర్ కొట్టడంతో ఎఫ్ఎం రేడియో ఆన్ చేసి వింటాడు.
అందులో రిషి లవ్ డాక్టర్ తో మాట్లాడిన మాటలు వింటూ మహేంద్ర వర్మ ఆశ్చర్యపోతాడు. ఇక జగతికి కూడా రిషి మాట్లాడుతున్న మాటలు వినిపిస్తాడు. రిషి మాటలు వింటూ మహేంద్రవర్మ పొంగిపోతూ ఉంటాడు. లవ్ దొంగ ఇప్పుడు బయట పడ్డాడు అని అంటాడు. వసు కూడా చివర్లో రేడియో ఆన్ చేసి ఆ మాటలు వినటం తో.. ఇతను కూడా రిషి సర్ లాగా ఉన్నాడు అని అనుకుంటుంది.
ఇక రిషి ఫోన్ కట్ చేశాక ఏదో కొత్త కొత్తగా ఫీలవుతూ కనిపిస్తాడు. మహేంద్ర వర్మ ఈసారి కచ్చితంగా రిషి మనసులో ఉన్న మాటను వసుకు చెబుతాడు అనడంతో జగతి మాత్రం అస్సలు నమ్మ లేకపోతుంది. ఒకవేళ చెప్పకపోతే ఎలా అని అనడంతో నా దగ్గర మరో ప్లాన్ వుంది అంటూ కానీ ఆ ప్లాన్ ఇప్పుడే చెప్పను అని సస్పెన్స్ లో ఉంచుతాడు.
సీన్ కట్ చేస్తే..
సాక్షి ఉదయాన్నే వసు రాసే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది. దేవయాని తనతో మాట్లాడిన మాటలు తలుచుకొని ఈరోజు వసుధార ను ఎగ్జామ్ రాయనివ్వకుండా చేస్తాను అని క్రూరంగా అనుకుంటుంది. మరోవైపు వసు ఎగ్జామ్ కి వెళ్లడానికి హడావుడిగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే రిషి రావడంతో తాను కూడా తొందర పెడతాడు.
సాక్షి, రిషి ల పెళ్లి కార్డును సెట్ చేసిన మహేంద్రవర్మ..
ఆ తొందరలో వసు కింద పడి పోతూ ఉండగా అక్కడే ఉన్న రిషి తనను పట్టుకుంటాడు. దాంతో బెడ్ మీద పడగా రిషి ఒడిలో కూర్చుంటుంది వసు. ఇక ఆ సీన్ అక్కడ బాగా రొమాంటిక్ గా అనిపిస్తుంది. దేవయాని దగ్గరికి మహేంద్రవర్మ వెళ్లి ఫోన్ లో ఒక ఫోటో పంపించాను అనడంతో ఓపెన్ చేసి చూస్తే రిషి, సాక్షిల పెళ్లి కార్డు ఉంటుంది. దాంతో దేవయాని మహేంద్రవర్మ ఒప్పుకున్నాడు అన్ని సంతోషపడుతుంది. అక్కడే ఉన్న జగతిని పిలిచి కార్డు చూపిస్తూ ఉంటుంది.

Guppedantha Manasu May 24 Episode: వసు కు సర్ప్రైజ్ అంటున్న రిషి..
ఇక జగతి మాత్రం మహేంద్ర పై అరుస్తూ ఉంటుంది. దాంతో మహేంద్రవర్మ తను చేసిన ప్లాన్ ఇదే అనటంతో జగతి ఆలోచనలో పడుతుంది. ఇక దేవయాని ఆ ఫోటోను రిషికి పంపిస్తుంది. ఎగ్జామ్ సెంటర్ దగ్గర రిషి వసుతో మన ఇద్దరికి సంబంధించిన విషయం గురించి మాట్లాడాలి అని సర్ప్రైజ్ అంటూ దానికి తోడు ఒక గిఫ్ట్ కూడా ఉంది అని ఒక ఫీలింగ్ తో చెబుతాడు. దాంతో వసు అదేమిటో అని ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతుంది.