Guppedantha Manasu May 26 Episode: ఈరోజు ఎపిసోడ్ లో రిషి వసు కోసం గిఫ్ట్ తీసుకొని వస్తాడు. అందులో లవ్ సింబల్ లో ఒకవైపు రిషి ఫోటో, మరొకవైపు వసు ఫోటో ఉంటుంది. ఒక గిఫ్ట్ ఇస్తే తీసుకునే వారికంటే ఇచ్చేవారికి చాలా ఆనందంగా ఉంటుంది అని మొదటిసారి అనిపిస్తోంది అని రిషి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత గిఫ్ట్ తీసుకొని వసు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మరొకవైపు సాక్షి, రిషి కి కాల్ చేస్తుంటుంది.
సీన్ కట్ చేస్తే..
వసు ఎగ్జామ్ రాసి బయటకు వస్తుంది. రిషికి ఫోన్ చేసి నేను ఎగ్జామ్ బాగా రాశాను సార్ మీరు ఇలా రాయడానికి కారణం మీరే అని అంటుంది. అప్పుడు చూసి ఎందుకు అలా అని అడగగా.. మీరు నాకు మానసికంగా ఎంతో బలాన్ని ఇచ్చారు అంటూ రిషిని పోగొడుతుంది. నువ్వు బాగా రాస్తావు అని నమ్మకంతోనే ముందే నేను నీకు గిఫ్ట్ తీసుకుని వచ్చాను నువ్వు తప్పకుండా గిఫ్టు తీసుకోవాలి అని అనడంతో మీరు ఇస్తే నేను ఎందుకు తీసుకోను సార్ అని అంటుంది వసు.
ఆ గిఫ్ట్ ఎప్పుడు ఎప్పుడు వసు కి ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు దేవయాని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ జగతి,ధరణి కోపంతో రగిలి పోతూ ఉంటుంది. అప్పుడు ధరణి రిషి కి కాల్ చేయగా రిషి కాల్ కట్ చేస్తాడు. ఇక రిషి ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళి వసుకోసం ఎదురు చూస్తు తన జ్ఞాపకాలన్ని గుర్తు చేసుకొని మురిసి పోతూ ఉంటాడు.
బాధ పడుతున్న వసు..
మరొకవైపు వసు ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చి నేను నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు వసు కొంచం ఫీల్ తో మాట్లాడగా అప్పడు రిషి వసు మాటలు ఎందుకో కొంచెం తేడాగా ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాడు. కానీ వసు మాత్రం లోపల ఏదో బాధతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ తరువాత వసు,రిషి ఇద్దరు కారు లో వెళ్తూ ఉండగా వసు మీలో చాలా మార్పు వచ్చింది సార్ అని అంటుంది.

Guppedantha Manasu May 26 Episode: ఐ లవ్ యు వసు అని చెప్పిన రిషి…
రిషి,వసు ఇద్దరూ రోడ్డు సైడ్ కొబ్బరి నీళ్ళు తాగడానికి ఆపుతారు. అప్పడు రిషి,వసు ఒకప్పుడు ఇలా మనం తాగాము గుర్తుకు ఉందా అని అడుగుతుంది. ఆ తరువాత రిషి,వసు ఇద్దరు ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు రిషి నువ్వు నేను అయ్యాను నేను నువ్వు అయ్యావు అని అనడంతో వసు ఆశ్చర్యపోతుంది. రేపటి ఎపిసోడ్ లో వసు కి గిఫ్ట్ ఇస్తాడు రిషి. గిఫ్ట్ చూసి వసు ఐ లవ్ యు అని అనగా వెంటనే రిషి ఐలవ్యూ వసుధార అని అంటాడు.