Guppedantha Manasu May 30 Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. రిషిని కాదని వచ్చిన వసుకు సాక్షి ఎదురు పడుతుంది. దాంతో వసు వెంటనే సాక్షి తనతో ఉదయం మాట్లాడిన మాటలను తలచుకుంటుంది. రిషిని వదిలేయమని లేదంటే బాగుండదు అని వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు నా టార్గెట్ నువ్వు కాదు అని రిషి అని అనడంతో వసు షాక్ అవుతుంది. రిషిని వదిలి వెళ్లకపోతే మీ ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను లేనిపోనివన్నీ క్రియేట్ చేసి కాలేజీ గోడలపై పెడతాను అని రిషి ఫ్యామిలీ పరువు మొత్తం రోడ్డుకు వేస్తాను అని అనటంతో వసు షాక్ అవుతూ భయ పడుతూ ఉంటుంది.
సీన్ కట్ చేస్తే..
అలా తనతో సాక్షి మాట్లాడిన మాటలు తలుచుకొని సాక్షి ఎదురుగా నిలబడి ఉంటుంది. ఇక సాక్షి వసు రిషిని కాదు అనటం తో బాగా మురిసిపోతూ వసుకు మళ్లీ క్లాస్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ వసు మాత్రం గట్టిగా తన కు సమాధానం ఇస్తూ ఉంటుంది. అప్పుడే రిషి వసుకు నువ్వు నన్ను మధ్యలో వదిలేసిన నిన్ను వదిలేయను అంటూ క్యాబ్ బుక్ చేశాను జాగ్రత్తగా వెళ్ళు అని మెసేజ్ చేస్తాడు. దాంతో వసుకు రిషి ప్రేమ అక్కడ కూడా అర్థమవుతుంది.
అప్పుడే క్యాబ్ రావడంతో అందులో వెళ్తుంది. ఇక రిషి తనకు ఐ లవ్ యు చెప్పిన విషయాన్ని తలచుకుని ఇలా చెబుతాడు అని అస్సలు ఊహించలేదు అనుకుంటుంది. మరోవైపు సాక్షి దేవయాని దగ్గరికి వెళ్లి రిషి ఎక్కడికో వెళ్లలేదని వసు దగ్గరికి వెళ్లాడని అనటంతో దేవయాని షాక్ అవుతుంది. వసు ఎగ్జామ్ రాయకుండా చేసావా అనటంతో అది కుదరలేదని కానీ అంతకంటే ఒక పని చేశాను అంటుంది.
సంతోషంలో దేవయాని..
రిషి వసుకు ఐలవ్యూ చెప్పాడు అని దేవయానితో చెప్పటంతో దేవయాని బాగా షాక్ లో ఉంటుంది. కానీ వసు నో అని చెప్పింది అనటంతో.. అంత తొందరగా వసును నమ్మకూడదు అని అంటుంది దేవయాని. కానీ సాక్షి మాత్రం వసు అందరి అమ్మాయిలా కాదు అని తను మళ్లీ రిషి దగ్గరకు రాదు అని అనటంతో దేవయాని కాస్త సంతోషంగా ఫీల్ అవుతున్నట్లు కనిపిస్తోంది.
ఇక వీరిద్దరి సంతోషాన్ని అక్కడే ఉన్న ధరణి చూసి వెంటనే మహేంద్ర వర్మ కు, జగతికి చెబుతుంది. ఇక మహేంద్రవర్మ నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పి ధరణిని అక్కడి నుంచి పంపిస్తాను అంటాడు. ఆ తర్వాత జగతి వసు కు ఫోన్ చేయటంతో వసు తన మనసు బాలేదు అని చెప్పి కట్ చేస్తుంది. మహేంద్రవర్మ రిషి కి ఫోన్ చేయడంతో రిషి నడి రోడ్డుపై కారు ఆపి నిద్రపోతాడు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి లేపటంతో పక్కకు వెళ్లి జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు.

Guppedantha Manasu May 30 Episode: తండ్రితో కలిసి మందు కొడుతున్న రిషి..
తరువాయి భాగంలో మహేంద్రవర్మ రిషిని ఏం జరిగింది అనటంతో.. వెంటనే రిషి ఎమోషనల్ అవుతూ గతంలో కన్నతల్లి వదిలేసింది అని.. అప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి వదులుకుందని.. ఇక ఇప్పుడు.. అని వసు పేరు చెప్పకుండా మానంగా ఉంటాడు. రిషి తన తండ్రితో కలిసి మందు తాగుతూ ఉండగా వసు అక్కడికి వచ్చి రిషిని తాగవద్దని చెబుతుంది.