Guppedantha Manasu May 31 Episode: ఈరోజు ఎపిసోడ్ లో జగతి, మహేంద్రవర్మ రిషి గురించి ఆలోచిస్తారు. రిషి ఎక్కడికి వెళ్ళాడో అని బాగా టెన్షన్ పడుతూ కనిపిస్తారు. ఇక మహేంద్రవర్మ జగతికి ఎక్కడికి వెళ్ళడు అని వస్తాడు అని ధైర్యం చెబుతూ ఉంటాడు. అప్పుడే ధరణి వచ్చి దేవయాని అత్తయ్య పిలుస్తుంది అని అనటంతో వెంటనే మహేంద్రవర్మ ఇప్పుడు తనకి ఇది ఒక అవకాశం లాగా కనిపించింది అని అనుకుంటాడు.
సీన్ కట్ చేస్తే..
రిషి కారులో ప్రయాణిస్తూ అక్కడ జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటాడు. తనను వసుధార ఎందుకు ఇలా ఆక్సెప్ట్ చేయలేదు అని అనుకుంటాడు. తనతో మాట్లాడిన మాటలు అన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు దేవయాని మహేంద్రవర్మ లతో రిషి గురించి అడుగుతుంది. రిషి ఇంకా రాలేదు అని ఎక్కడికి వెళ్ళాడో పట్టించుకోరా అన్నట్లు మాట్లాడుతూ ఉంటుంది.
అప్పుడే జగతి మీరు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు ఉన్నారు కదా అని అనటంతో.. ధరణి తన మనసులో తనకు కావాల్సింది అదే కదా అని అనుకుంటుంది. అదే సమయంలో రిషి ఇంట్లోకి రావడం తో ధరణి ఎదురుగా వెళ్లాలని అనుకుంటుంది. అప్పుడే దేవయాని ధరణిపై అరుస్తుంది. రిషి రావడంతో మహేంద్రవర్మ ఎక్కడికి వెళ్లావు రిషి అని అడగటం తో దేవయాని ఆపి తాను ఎంతో ప్రేమగా అడుగుతుంది.
ప్రపోజ్ చెయ్యకుండా ఉంటే బాగుండేది అనుకుంటున్న వసు..
ఇక రిషి మాత్రం సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్తాడు. మరోవైపు వసు కూడా అక్కడ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. రిషి సార్ తన తో ఇలా అంటాడు అని ఊహించుకోలేదు అని అనుకుంటుంది. ఇంతకుముందే బాగుండే వాళ్లం అని రిషి సర్ ఇప్పుడు అలా ఎందుకు చెప్పాడు అని.. చెప్పకుండా ఉన్నా సరిపోయేది కదా అనుకుంటూ బాధపడుతుంది.
రిషి కూడా అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వసుకు ఫోన్ చేయాలి అని అనుకొని మళ్ళీ కోపంతో ఫోన్ విసిరేస్తాడు. వసు కూడా రిషి కి ఫోన్ చెయ్యాలని అనుకుంటుంది. మొత్తానికి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ రిషి చూసుకోడు. అప్పుడే మహేంద్రవర్మ వచ్చి ఫోన్ లో పొగరు అని చూసి ఎవరా పొగరు అనటంతో వెంటనే రిషి ఫోన్ తీసుకుంటాడు.

Guppedantha Manasu May 31 Episode: తండ్రి ముందు మందు గ్లాస్ పట్టుకున్న రిషి..
ఇక మహేంద్రవర్మ ఎందుకు ఇలా ఉన్నావు అనటంతో.. వెంటనే రిషి తను ప్రిన్స్ అని చిన్నప్పుడు కన్నతల్లి వదిలేసింది అని, ఆ తర్వాత సాక్షి వదిలేసింది అని ఇప్పుడు.. అని ఆగడంతో మహేంద్ర వర్మ అక్కడే పక్కన ఉండి వింటున్న జగతి బాధపడతారు. ఇక ఎవరు అని మహేంద్రవర్మ అడగటంతో వెంటనే రిషి మహేంద్రవర్మను బార్ కు తీసుకెళ్లి అక్కడ తన తండ్రి ముందు గ్లాస్ పట్టుకొని ఉంటాడు.
అక్కడ వసు వచ్చి మాట్లాడినట్టు ఊహించుకోవటంతో గ్లాస్ పక్కన పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత జగతి వసు ను కలిసి ఏం జరిగింది అని అడగటంతో.. తరువాయి భాగం లో తనకు రిషి సర్ ప్రేమిస్తున్నాడు అని చెప్పగా రిజెక్ట్ చేశాను అని అనటం తో రిషి గుండెను ముక్కలు చేసావు కదా వసు అంటూ జగతి కుమిలిపోతుంది.