Guppedantha Manasu May 4 Episode: రిషికి కడుపునిండా భోజనం పెట్టి విసుగుకున్న వసు!

Akashavani

Guppedantha Manasu May 4 Episode: ఈరోజు ఎపిసోడ్ లో రిషి గౌతమ్ దగ్గరికి వెళ్లి వసు విషయంలో సీరియస్ గా మాట్లాడతాడు. ఇక గౌతమ్ అదంతా పక్కన పెట్టి సాక్షి గురించి అడగడంతో ఆ విషయంలో కూడా కాస్త వెటకారంగా సమాధానం చెబుతాడు రిషి. ఒంటరిగా కూర్చున్న రిషి దగ్గరకి దేవయాని వచ్చి ఎంతో ప్రేమ చూపిస్తున్నట్లుగా మాట్లాడుతుంది.

సాక్షిని తన మాటలతో బాధ పెట్టిన రిషి..

ఇక దేవుడు నీకు సాక్షికి రాసి పెట్టాడు ఏమో అని అనడంతో వెంటనే సాక్షి గురించి అడగొద్దు అని రిషి కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక అక్కడికి సాక్షి ఎదురుపడి.. బయటకి వెళ్దాం అని అంటుంది. దాంతో రిషి పరాయి వాళ్లతో వెళ్లను అని అనడంతో సాక్షి బాధపడుతుంది. ఇక దేవయాని వచ్చి రిషి దక్కాలంటే ఎదురుచూడక తప్పదని అంటుంది.

వసు, రిషిల ఫోటోలు తీయించిన దేవయాని..

రిషి కారులో ప్రయాణిస్తూ దేవయాని, సాక్షి మాట్లాడిన మాటలు తలచుకుంటాడు. ఇక రిషి కారును దేవయాని, సాక్షి ఫాలో అవుతారు. ఇలా వెళ్లడం కరెక్ట్ కాదేమో అని సాక్షి అనడంతో అలా ఏం కాదు అన్నట్లుగా దేవయాని సర్ది చెబుతుంది. ఇక రిషి నేరుగా వసు ఇంటికి వెళ్లడంతో వెంటనే దేవయాని సాక్షితో ఫోటోలు తీయిస్తుంది. ఇక సాక్షి ఈ ఫోటోలు ఎందుకని అనడంతో దేవయాని వీటితో పని ఉంది అన్నట్లుగా మాట్లాడుతుంది.

ఇక రిషి, వసు కారులో ప్రయాణిస్తూ మాట్లాడుకుంటారు. వసు మాటలకు రిషి వెటకారంగా సమాధానం ఇస్తూ ఉంటాడు. ఇక వసును రెస్టారెంట్ దగ్గర డ్రాప్ చేస్తాడు. మరోవైపు దేవయాని జగతి దగ్గరికి వెళ్లి వెటకారం గా మాట్లాడుతుంది. అంతేకాకుండా వసును ఉద్దేశించి కూడా మాట్లాడుతుంది. జగతి కూడా దేవయానికి తగ్గట్టుగా సమాధానమిస్తుంది.

దేవయానికి అదిరిపోయే సమాధానం ఇచ్చిన జగతి..

ఇక వసును ఎలా పంపించాను చూసావు కదా అని దేవయాని అనడంతో.. నువ్వు ఏదో కుట్ర చేస్తావని వెళ్ళిపోయింది అని అంటుంది. ఇక సాక్షిని కూడా నువ్వే రప్పించావ్ అని సాక్షికి బలం గా ఉన్నావు అని జగతి సాఫ్ట్ గా మాట్లాడుతూ ఉంటుంది. మొత్తానికి జగతి దేవయానికి అదిరిపోయే సమాధానం ఇచ్చి దేవయానిని వెళ్ళి పోయేలా చేస్తుంది.

మరోవైపు రిషి వసు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక రిషి తనతో రమ్మని అనడంతో.. మీరు ఒక పని చేస్తేనే మీ వెంట వస్తా అని అంటుంది వసు. ఇక ఆ విషయం కూడా కారులో చెబుతానని అంటుంది. రిషి మాత్రం తన మనసులో ఏం చెబుతుందని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వసు రిషిని తన ఇంటికి తీసుకెళ్ళి తన చేతి తో వండిన భోజనం చేపిస్తుంది. ఈ విషయం గురించే వసు రిషి సస్పెన్స్ లో పెట్టింది.

Guppedantha Manasu May 4 Episode: రిషికి కడుపునిండా భోజనం పెట్టి విసుగుకున్న వసు!
Guppedantha Manasu May 4 Episode: రిషికి కడుపునిండా భోజనం పెట్టి విసుగుకున్న వసు!

Guppedantha Manasu May 4 Episode: రిషిపై అరిచిన వసు..

రిషి భోజనం చేసి వెళ్లగా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అతడు ఎవరు.. అతడు మీ ఇంటికి వచ్చి భోజనం ఎందుకు చేశాడు అంటూ నానా రకాలుగా మాట్లాడుతారు. ఇక తరువాయి భాగంలో రిషి వసుకు ఫోన్ చేయగా వసు ఎందుకు ఫోన్ చేస్తున్నారు అంటూ విసుక్కుంటోంది.

- Advertisement -