Guppedantha Manasu May 6 Episode: దేవయాని నోటికి తాళం వేసిన రిషి.. ఘోరమైన అవమానం ఎదుర్కొన రిషి!

Akashavani

Guppedantha Manasu May 6 Episode: ఈరోజు ఎపిసోడ్ లో వసు రిషి కారులో తన ఇంటికి వస్తుంది. అక్కడే ఉన్న భూలక్ష్మి వీళ్ళను చూస్తూ ఉంటుంది. ఇక మహేంద్ర వర్మ కారు అక్కడ ఉండటంతో రిషి రావడానికి ఇబ్బంది పడతాడు. కానీ వసు రిషిని బలవంతంగా తీసుకొని వెళ్తుంది. అక్కడ ఉన్న జగతిని చూసి వసు ఆశ్చర్యపోతుంది. రిషి మాత్రం ఇబ్బంది గానే కనిపిస్తాడు. ఇక మహేంద్రవర్మ కాసేపు సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. వసు మాత్రం జగతి వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.

సీన్ కట్ చేస్తే..

దేవయాని, సాక్షి ఒక దగ్గర నిల్చొని రిషి గురించి మాట్లాడుతూ ఉంటారు. రిషి తనతో సరిగ్గా ఉండనందుకు బాగా ఫీల్ అవుతూ కనిపిస్తుంది. దాంతో దేవయాని తనకు ధైర్యం ఇచ్చి రిషి తో ఎలాగైనా నీ పెళ్లి చేపిస్తాను అని మాట ఇస్తుంది. ఓ వైపు వసు ఇంటి దగ్గరకు భూలక్ష్మి, సుబ్బయ్య వాళ్ళు మరి కొంతమంది బస్తీ వాళ్లతో వస్తారు. సుబ్బయ్య వసుతో కాస్త గౌరవంగానే మాట్లాడగా.. సుబ్బలక్ష్మీ మాత్రం ఇంటికి ఆయన రావడం ఏంటి అని తన సూటిపోటి మాటలతో తనను బాధపెడుతుంది.

దేవయానిపై కోపంతో రగిలిపోయిన ఫనీంద్ర..

ఇక సాక్షి దేవయాని ఇంటికి రావడంతో కాసేపు దేవయాని, ఫణీంద్ర వర్మ సాక్షితో మాట్లాడుతూ ఉంటారు. సాక్షి తను లండన్ నుంచి రిషి కోసం వచ్చినట్లు గా మాట్లాడుతుంది. పక్కనే ఉన్న దేవయాని సాక్షికి సపోర్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది అనటంతో.. వెంటనే ఫనీంద్ర దేవయానిపై కోపంతో రగిలిపోతూ నిశ్చితార్థం తర్వాత జరిగిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకో అని అంటాడు.

దేవయానికి గట్టి సమాధానం ఇచ్చిన జగతి..

అప్పుడే రిషి, మహేంద్ర వర్మ, జగతి ఇంట్లోకి రావటంతో వాళ్ళని చూసి ముగ్గురు కలిసి వచ్చారు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. దాంతో మహేంద్రవర్మ తనదైన శైలిలో సమాధానం ఇస్తాడు. వెంటనే దేవయాని సాక్షి విషయాన్ని తీస్తూ రిషి గురించి పట్టించుకోవడం లేదు అని మహేంద్రవర్మ లను అంటుంది. అంతేకాకుండా బస్తీ వాళ్లను బాగా పట్టించుకుంటున్నారు అనడంతో జగతి కోపాన్ని కంట్రోల్ చేసుకొని తనకు గట్టిగా సమాధానమిస్తుంది.

Guppedantha Manasu May 6 Episode: దేవయాని నోటికి తాళం వేసిన రిషి.. ఘోరమైన అవమానం ఎదుర్కొన రిషి!
Guppedantha Manasu May 6 Episode: దేవయాని నోటికి తాళం వేసిన రిషి.. ఘోరమైన అవమానం ఎదుర్కొన రిషి!

Guppedantha Manasu May 6 Episode: తన పెద్దమ్మ నోటికి తాళం వేసిన రిషి..

అంతేకాకుండా రిషితో సాక్షి పెళ్లి గురించి మాట్లాడటంతో వెంటనే రిషి ఈ విషయం గురించి మాట్లాడకు పెద్దమ్మ అంటూ.. ఈ విషయం పట్ల నన్ను ఒత్తిడిగా చెయ్యకు అని దేవయాని నోటికి తాళం వేస్తాడు. మరోవైపు వసు తనను బస్తీవాసులు అన్న మాటలను తలుచుకుని బాధ పడుతుంది. అప్పుడే రిషి అక్కడికి రావడంతో తనను లోపలికి రానివ్వకుండా డోర్ పెట్టేస్తుంది. దాంతో రిషి ఆ అవమానాన్ని తట్టుకోలేక బాధ పడుతూ ఉండగా అప్పుడే మహేంద్రవర్మ వచ్చి తనను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.

- Advertisement -