Guppedantha Manasu May 7 Episode: పాపం.. తమ మధ్య బంధం ఏంటో అని సతమతమవుతున్న రిషి, వసు!

Akashavani

Guppedantha Manasu May 7 Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. రిషి తన ఇంట్లోకి రావద్దు అన్న ఉద్దేశంతో వసు తలుపులు పెట్టిన సంగతి తెలిసిందే. దాంతో రిషి బాధపడుతుండగా మహేంద్రవర్మ వచ్చి తనను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఇక ఇద్దరూ ఒకచోట నిల్చొని ఉండగా.. రిషి మాత్రం వసు ఎందుకు అలా చేసిందో అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మహేంద్ర వర్మ తనలోని ఉన్న ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటాడు.

సాక్షిను అలా పోల్చిన రిషి..

వెంటనే రిషి కాస్త వెటకారంగా సమాధానం ఇస్తాడు. అంతేకాకుండా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వను అని చెప్పేస్తాడు. ఇక మహేంద్ర సాక్షి గురించి అడగడంతో తను ఒక టీసీ తీసుకున్న విద్యార్థి అన్నట్లు సమాధానం ఇస్తాడు. వసు అలా చేయడానికి కూడా సమాధానం తనే చెబుతుంది అని అంటాడు. మహేంద్ర వర్మ రిషి నుండి సమాధానం రాక పోయేసరికి సలహా ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళి పోతాడు.

సీన్ కట్ చేస్తే..

వసు బస్తీ వాళ్లు అన్న మాటలను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా రిషి సార్ ను బాధ పెట్టాను అని సార్ ఎంత బాధ పడుతున్నాడో అని తను కూడా బాధపడుతూ కనిపిస్తుంది. రిషి తనకు వసు ఏమవుతుంది అని తన పట్ల ఎందుకు ఇలా ఉంటున్నాను అని అనుకుంటాడు. ఇక వసు కూడా తనకు రిషి పట్ల ఉన్న బంధాన్ని ఏంటో అని ప్రశ్నించుకుంటుంది. దీంతో ఇద్దరు తమ మధ్య ఉన్న బంధం ఏంటి అని సతమతమవుతారు.

రిషి గురించి ఆలోచనలో పడ్డ తల్లిదండ్రులు..

ఇక మహేంద్రవర్మ తను రిషితో మాట్లాడిన మాటలను తలచు కుంటూ ఉంటాడు. పక్కనే ఉన్న జగతికి జరిగిన విషయం చెబుతాడు. దాంతో జగతి కూడా బాధపడుతున్నట్లు కనిపిస్తుంది. ఇక మహేంద్రవర్మ తను రిషిని అడిగిన ప్రశ్నలకు తానే బాధపడుతున్నాను అని అంటాడు. అలా జగతి, మహేంద్రవర్మలు రిషి విషయంలో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత గౌతమ్ రిషి గీసిన వసు ఫోటోను చూస్తు వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు.

Guppedantha Manasu May 7 Episode: పాపం.. తమ మధ్య బంధం ఏంటో అని సతమతమవుతున్న రిషి, వసు!
Guppedantha Manasu May 7 Episode: పాపం.. తమ మధ్య బంధం ఏంటో అని సతమతమవుతున్న రిషి, వసు!

Guppedantha Manasu May 7 Episode: వసును ప్రపోజ్ చేసిన గౌతమ్..

ఈసారి ఎవరూ అడ్డురాకుండా ఎలాగైనా వసుతో మాట్లాడాలని అనుకుంటాడు. అప్పుడే రిషి రావడంతో.. గౌతమ్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత గౌతమ్ ధైర్యం తెచ్చుకొని ఇవాళ ఎలాగైనా వసు కు ఐ లవ్యూ చెబుతాను అని అనడంతో ఈ పరంగా అయిన తనకు వసు నుండి సమాధానం దొరుకుతుంది అని అనుకోని వెళ్లి ప్రపోజ్ చేయు అని గౌతమ్ ను ఎంకరేజ్ చేస్తాడు. గౌతమ్ రిషి మారినందుకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యి వెళ్లి వసు ను ప్రపోజ్ చేస్తాడు. తరువాయి భాగం లో వసు తన బొమ్మని చూసి సంతోషంగా ఫీల్ అవుతుంది. గౌతమ్ రిషితో.. వసు మనసులో ఎవరో ఉన్నారు అన్నట్లుగా చెబుతాడు.

- Advertisement -