Guppedantha Manasu May 9 Episode: వాహ్.. సాక్షి పరువు తీసిన వసు.. సంతోషంలో పార్టీ చేసుకుంటున్న రిషి!

Akashavani

Guppedantha Manasu May 9 Episode: ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్ వసుకు ఐ లవ్ యు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో వసు మర్యాద పరంగా రిజెక్ట్ చేస్తుంది. దాంతో గౌతమ్ కాస్త ఫీల్ అయినట్లు కనిపిస్తాడు. చాటున ఆ మాటలు వింటున్న రిషి మాత్రం తెగ సంతోషంగా కనిపిస్తాడు. ఇక వసు.. గౌతమ్ ను మీరు రిషి సర్ ఫ్రెండ్ అని అదే వేరే వాళ్ళు అయితే చెంప పగలగొట్టే దాన్ని అని గట్టిగా అంటుంది.

గౌతమ్ ఇచ్చిన గిఫ్ట్ ను తీసుకున్న వసు..

దాంతో గౌతమ్ కాస్త భయపడినట్లు కనిపిస్తాడు. ఇక గౌతమ్ లోలోపల బాధపడుతూ నన్ను రిజెక్ట్ చేసిన సరే కానీ నేనిచ్చిన గిఫ్టు తీసుకో అని ఆ గిఫ్ట్ నీకు నచ్చుతుంది అని అంటాడు. ఇక వసు ఆ ఆర్ట్ తీసి చూడటంతో వెంటనే ఆనందంగా ఆశ్చర్యపోతుంది. ఇంత అందమైన కళ్ళు ఎవరు గీసారు అని అడుగుతుంది. దాంతో గౌతమ్ రిషి పేరు చెప్పకుండా తననే కనుక్కోమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

బ్రేకప్ ఫీల్ ను ఎంజాయ్ చేస్తున్న రిషి..

మరోవైపు రిషి వసు గౌతమ్ కు బ్రేక్ అప్ చెప్పటంతో తెగ సంతోషంగా కారులో కూర్చుని పాట పాడుతూ ఉంటాడు. అప్పుడే గౌతమ్ బ్రేకప్ ఫీలింగ్ ను తట్టుకోలేకుండా బాధపడుతూ కనిపిస్తాడు. దాంతో రిషి గౌతమ్ ను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఇక గౌతమ్ వసు గురించి తను రిజెక్ట్ చేసిన దాని గురించి వివరిస్తాడు.

సంతోషంలో వసు..

పైగా తన మనసులో ఎవరో ఉన్నారు అని చెబుతాడు. దాంతో రిషి తన మనసులో ఎవరున్నారో అని తన ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటాడు. మొత్తానికి రిషి, గౌతమ్ ల మధ్య కాసేపు ఓదార్పు యుద్ధం జరుగుతోంది. ఇక ఇంటికి వెళ్లిన వసు తన బొమ్మని ఎవరి ఇంత అద్భుతంగా గీశారు అనుకొని తెగ సంతోష పెడుతుంది.

తనని తాను అద్దంలో చూసుకున్నట్లుగా ఉన్నానని అనుకుంటుంది. అలా కాసేపు ఆ బొమ్మ గురించి వివరిస్తుంది. ఇంట్లో మహేంద్రవర్మ, రిషి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే రిషి వచ్చి ఇవాళ నా మనసు ప్రశాంతంగా ఉంది అని అందుకే పార్టీ ఇస్తాను అని ఆ పార్టీ చీఫ్ గెస్ట్ గౌతమ్ అని అంటాడు. దాంతో గౌతమ్ లోలోపల కుమిలిపోతుంటాడు.

Guppedantha Manasu May 9 Episode: వాహ్.. సాక్షి పరువు తీసిన వసు.. సంతోషంలో పార్టీ చేసుకుంటున్న రిషి!
Guppedantha Manasu May 9 Episode: వాహ్.. సాక్షి పరువు తీసిన వసు.. సంతోషంలో పార్టీ చేసుకుంటున్న రిషి!

Guppedantha Manasu May 9 Episode: సాక్షి కి కౌంటర్ ఇచ్చిన వసు..

వసు గతంలో తనకు వచ్చిన లవ్ లెటర్ ను గుర్తు చేసుకొని అందులో రాసిన పదాలను తలుచుకుంటుంది. ఇక రిషి కూడా వసు గురించి ఆలోచనలో పడతాడు. తను కూడా ఆ లెటర్ ను చదువుతూ ఉంటాడు. తరువాయి భాగం లో వసు కోసం రిషి రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడే ఉన్న సాక్షి వారి మాటలను వింటుంది. ఇక రిషి దగ్గరికి వెళ్లడంతో రిషి కోపంగా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అప్పుడే సాక్షి వసు పై అరుస్తూ ఉండగా.. వసు ఈసారీ వచ్చేటప్పుడు డబ్బులతో పాటు మర్యాదతో కూడా రండి అని అంటుంది. ఆ మాటకు సాక్షి కోపం గా ఫీల్ అవుతుంది.

- Advertisement -