Guppedantha Manasu November 1 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో వసుధార, రిషి సంతోషంగా ఉండడం చూసి మహేంద్ర సంతోషపడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు చేతిలో ఉన్న చీరను గట్టిగా పట్టుకుని లాగడంతో వసుధార రిషి గట్టిగా హత్తుకుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి సంతోషంతో వసుధారను వెనుక వైపు నుంచి హత్తుకొని వసుధారకు ముద్దు పెట్టాలి అనుకుంటుండగా వసుధార తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రిషి వసుధార ముద్దు పెట్టుకోవాలని అనుకుంటుండగా ఇంతలో సడన్ గా రిషికి ఫోన్ వస్తుంది. పెద్దమ్మ ఫోన్ చేసింది పర్లేదు మళ్ళీ మాట్లాడతాను అనడంతో ఫస్ట్ మీరు వెళ్లి మాట్లాడండి సార్ అని రిషిని అక్కడి నుంచి పంపిస్తుంది.
రిషి పై దొంగ ప్రేమలు కురిపిస్తున్న దేవయాని
అప్పుడు దేవయాని దొంగ ప్రేమను కురిపిస్తూ ఎలా ఉన్నావు నాన్న ఏంటి నాన్న నాతో పరాయి వాళ్ళతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు అని అంటుంది. పక్కనే ఉన్న వసుధార ఆ మాటలు వింటూ ఉండగా ఇంతలో అక్కడికి మహేంద్ర వస్తాడు. నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను ప్రతిసారి నువ్వే గుర్తుకు వస్తున్నావు అంటూ రిషిని సెంటిమెంటుతో పడేయాలి అని చూస్తుంది దేవయాని. మీ అన్నయ్య కూడా నీ కోసం వెక్కివెక్కి ఏడుస్తున్నాడు అంటూ అబద్ధాలు చెబుతూ ఉంటుంది. నీ మీద బెంగ పెట్టుకున్నాను నా కోసమైనా తొందరగా తిరిగి రా రిషి. నువ్వు వచ్చే లోపు నేను చచ్చిపోతానేమో అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది దేవయాని. పక్కనే ఉన్న వసుధార కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
కొడుకుని చూసి గర్వపడుతున్న మహేంద్ర
తర్వాత రిషి ఫోన్ కట్ చేయగా మహేంద్ర అక్కడికి వచ్చి మీ పెద్దమ్మ ఫోన్ చేసినట్టు ఉంది ఏమంటుంది అనడంతో అక్కడికి రమ్మని బ్రతిమలాడుతోంది అనగా మనస్ఫూర్తిగానేనా అని మహేంద్ర అనడంతో అదేంటి డాడ్ ఎలా మాట్లాడుతారు అని అంటాడు రిషి. ఏం లేదు.. ఏమి నిర్ణయం తీసుకున్నావు. వెళ్తున్నావా లేక వెళ్తున్నామా అనగా డాడ్ నేను మీ కొడుకుని. మీకు అవమానం జరిగిన ప్రదేశానికి మిమ్మల్ని ఎలా తీసుకెళ్తాను నేను ఒక్కడినే వెళ్తున్నాను కానీ అది కూడా అయిస్టంగా వెళుతున్నాను అని అంటాడు. అప్పుడు మహేంద్ర థాంక్యూ రిషి అని రిషిని హత్తుకుంటాడు. తల్లిని దూరం చేసుకున్నాను బతికుండగానే ఆమెకు కష్టాలు పెట్టాను ఇప్పుడు తండ్రి విషయంలో అదే తప్పు చేయలేను మీకోసం ఏమైనా చేస్తాను అని అంటాడు రిషి.
శత్రువులను విడిచిపెట్టను అంటున్న రిషి
అప్పుడు మహేంద్ర అమ్మని దూరం చేసిన ఆ దుర్మార్గుల్ని క్షమించే ప్రసక్తే లేదు. అప్పుడు వెంటనే వసుధార వాళ్ళను క్షమించాల్సిన పరిస్థితి వస్తే అది పిచ్చి ప్రశ్న ఈ విషయంలో డాడ్ మాటే నా మాట అని అంటాడు రిషి. మరొకవైపు శైలేంద్ర శభాష్ మామ్ నువ్వు మహానటివి చాలా బాగా నటించావు అంటూ తల్లిని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటాడు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని శైలెంద్ర సంతోష పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు రిషి వాళ్ళు ఇంటికి వస్తున్నారు కదా మంచి సమయం సందర్భం చూసి స్పాట్ పెడతాను అని అంటాడు శైలేంద్ర. ఆ మాటలకు దేవయాని కూడా వత్తాసు పలుకుతూ ఉంటుంది. మరొకవైపు అనుపమ మొబైల్ ఫోన్ లో జగతి మహేంద్ర ఫోటోలు చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది.
Guppedantha Manasu November 1 Today Episode: అనుపమను ఓదార్చిన పెద్దమ్మ
ఇంతలో అక్కడికి వాళ్ళ పెద్దమ్మ వస్తుంది. నిన్ను చూస్తే బాధేస్తుంది గత జ్ఞాపకాలు నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఇబ్బంది పడతావు అనడంతో నా చివరి శ్వాస వరకు అనడంతో అలా మాట్లాడకు అని బాధగా మాట్లాడుతుంది వాళ్ళ పెద్దమ్మ. విధిరాత నా మీద పగ పట్టింది అందుకే నేను కోరుకున్నవి ఏవి నాకు దక్కలేదు అని కన్నీళ్లు పెట్టుకోవడంతో అది చూసి వాళ్ళ పెద్దమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. జీవితంలో మనం ఇతరులతో గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేము అవి ఎంత మరచిపోవాలని ప్రయత్నిస్తే అవి మనల్ని ఎంత గాయపెడతాయి అని అనుపమకు సర్ది చెబుతూ ఉంటుంది వాళ్ళ పెద్దమ్మ.