Guppedantha Manasu November 10 Today Episode: ఈరోజు ఎపిసోడ్లో వసుధార రిషి ఇద్దరు కారులో వెళుతూ జరిగిన విషయాల గురించి ఏం మాట్లాడుకుంటూ ఉంటారు. నిజం దాచి పెట్టినందుకు ఏంజెల్ చాలా ఫీల్ అయింది కానీ విశ్వనాథం గారు కాస్త అర్థం చేసుకొని మాట్లాడారు. ఏంజెల్ కూడా పోను పోను అర్థం చేసుకుంటుంది అనడంతో వసుధార మౌనంగా ఉంటుంది. నువ్వేం ఆలోచిస్తున్నావు ఎందుకు మౌనంగా ఉన్నావో నాకు తెలుసు వసుధార జగతి మేడం చనిపోయిన విషయం వాళ్లకు ఎందుకు చెప్పలేదని ఆలోచిస్తున్నావు కదా అనడంతో అవును సార్ అని అంటుంది. మనం ఏం చెప్పినా కూడా ఏంజెల్ అమ్మే పరిస్థితిలో లేదు అలాంటప్పుడు చెప్పినా కూడా తను అబద్ధం అనుకుంటుంది అని అంటాడు రిషి. అయినా వసుధార అమ్మ లేదు అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు.
రిషి కి లెటర్స్ ఇచ్చిన పాండియన్
తను ఎప్పుడూ మనతోనే ఉంటుంది అని అంటాడు రిషి. మా అమ్మ చనిపోయిన విషయం నేను ఎవరికీ చెప్పను నా ప్రాణం ఉన్నంతవరకు మా అమ్మ నా గుండెల్లోనే ఉంటుంది అని రిషి సడన్గా కారు బ్రేక్ వేస్తాడు. అప్పుడు ఎదురుగా పాండియన్ వచ్చి నిలబడడంతో పాండియన్ నువ్వా ఏంటి ఎదురుగా నిలబడ్డావు అనడంతో ఇవి ఇవ్వడానికి వచ్చాను సార్ అని లెటర్స్ ఇస్తాడు. దీనికోసం మళ్ళీ నువ్వు రావడం ఎందుకు ఫోన్ చేస్తే నేనే వచ్చే వాడిని కదా అనడంతో పర్లేదు శ్రమ ఏమీ లేదు అని అంటాడు. తర్వాత పని చేయడానికి జాగ్రత్తలు చెప్పి అక్కడ నుంచి పంపించేస్తాడు రిషి. తర్వాత వసుధార వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. మరోవైపు మహేంద్ర నిద్రపోతుండగా ఇంతలో వసుధార వాళ్ళు అక్కడికి వస్తారు.
రిషికి నిజం చెప్పేసిన మహేంద్ర
ఏంటి డాడ్ అనడంతో ఏంటి నాన్న నేను మందు తాగానని భయపడుతున్నావా నేను నీకు మాట ఇచ్చాను కదా అందుకే తాగను అనడంతో రిషి సంతోష పడుతూ ఉంటాడు. పెదనాన్న వాళ్లు వచ్చారు భోజనం చేసి వెళ్లారు అనడంతో సరే మావయ్య నేను వెళ్లి భోజనం తీసుకొని వస్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది వసు. తర్వాత రిషికి మహేంద్ర వారి లవ్ మ్యాటర్ గురించి చెబుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో వసుధార అక్కడికి వచ్చి నిలబడుతుంది. అప్పుడు మహేంద్ర వసుధార కూడా చాలా గొప్పది తన బావను పెళ్లి చేసుకోకుండా ఉండడం కోసం ప్రపంచంలో ఏ ఆడపిల్ల చేయని త్యాగం చేసింది అనడంతో వసుధార కన్నీళ్లు పెట్టుకుంటుంది.
మహేంద్ర మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న వసుధార
నువ్వే తాళి కట్టినట్టుగా మెడలో వేసుకున్న మహానుభావురాలు అని వసుధారని తెగ పోగుడుతూ ఉంటాడు మహేంద్ర. అవును డాడీ నేను కూడా అప్పుడు భ్రమపడి తనను చాలా బాధ పెట్టాను అని బాధపడుతూ ఉంటాడు రిషి. తర్వాత తన మనసు చంపుకుని అతి కష్టం మీద ఒక అబద్ధం చెప్పింది ఆ సమయంలో కూడా నువ్వు మళ్ళీ వసుధారని అపార్థం చేసుకొని దూరంగా వెళ్లిపోయావు. తర్వాత ఎదురుపడినా కూడా ఎన్ని మాటలు అన్నా కూడా తను మౌనంగానే భరించింది. అప్పుడు మహేంద్ర వాళ్లకు రిషి కూడా లోలోపల గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నాకు జగతి దొరకడం ఎంత అదృష్టమో నీకు వసుధార దొరకడం అంతకంటే ఎక్కువ అదృష్టం అని అంటాడు మహేంద్ర.
తండ్రికి మాట ఇచ్చిన రిషి
నాకైతే ఒక నమ్మకం ఉంది రిషి వసుధారకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా తను నీ చేయి వదలదు నువ్వు కూడా అలాగే తన చెయ్యి ఎప్పటికీ వదలకు అనడంతో ఆ మాటలకు వసుధార ఎమోషనల్ అవుతుంది. సారీ డాడ్ నేను కూడా వసుధారని చాలా బాధపడ్డాను అని బాధపడుతూ ఉంటాడు. తనకంట ఎప్పుడు కన్నీరు రాకుండా చూసుకో అనడంతో సరే డాడ్ అని అంటాడు రిషి. అప్పుడు మహేంద్రకు భోజనం ఇచ్చి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది వసుధార. తర్వాత వసుధార కిచెన్ లోకి వెళ్లి మహేంద్ర అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉండగా రిషి వచ్చి ఏమయింది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు.
Guppedantha Manasu November 10 Today Episode: వసుధారకి సర్ప్రైస్ ఇచ్చిన రిషి
ఎందుకు ఏడుస్తున్నావు అని రిషి గుచ్చి గుచ్చి అడగగా ఏమీ లేదు అని అబద్ధాలు చెప్పి కవర్ చేస్తుంది వసుధార. తర్వాత రిషి వసుధార కళ్ళు మూసుకో అని చెప్పి వసుధారకి చెవి కమ్మలు గిఫ్ట్ గా ఇవ్వడంతో అవి చూసి వసుధార చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఆ కమ్మలు పెట్టుకుని చూపిస్తాను అని వసుధార పెట్టుకోబోతుండగా వద్దు నేను పెడతాను అని చెప్పి రిషి ఆ కమ్మలు వసుధార చెవికి పెడతాడు. మరొక చెవికి పెట్ట బోతుండగా కింద పడిపోవడంతో కావాలని చూసి చేతిలో దాచిపెట్టుకొని వసుధారని ఆటపట్టిస్తూ ఉంటాడు.