Guppedantha Manasu November 16 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో వసుధార మీకెందుకు సార్ ఇవన్నీ కిచెన్ లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూడా మీకు తెలియదు అనడంతో ఉన్న ఐటమ్స్ అన్ని ఒక్కొక్కటి వాటి పేర్లు చెబుతుండగా ఇందులో అనుకోకుండా రిషి బియ్యం పట్టుకోవడంతో అవి జారీ వారిద్దరి మీదకు పడతాయి. అప్పుడు ఏంటి సార్ ఇది సరే పోని లేండి సార్ మనకు ఎలాగో పెళ్లిలో తలంబ్రాలు పడలేదు కదా ఇప్పుడు దేవుడు ఇలా ఆశీర్వదించాడని అనుకుందాము అని అంటుంది. ఇప్పుడు రిషి ఆ బియ్యాన్ని దులిపేసుకుంటూ ఉండగా సర్ ఆగండి అలా చేయకండి. ఈ సమయంలో సెల్ఫీ తీసుకుందాం అని ఇద్దరు కలిసి సెల్ఫీ దిగుతారు. మరొకవైపు దేవయాని శైలేంద్ర ఇద్దరు కలిసి అనుపమ మహేంద్రల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
అనుపమ దెబ్బకు భయపడుతున్న దేవయాని
అప్పుడు దేవయాని టెన్షన్ పడుతూ ఆ అనుపమకు అసలు విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా మన పని అయిపోయినట్టే. రిషి వాళ్ళు మన ఇంట్లో ఉంటే అన్ని సంగతులు తెలిసేది ఇప్పుడు వాళ్లు అక్కడ ఉన్నారు అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు శైలేంద్ర నువ్వేం టెన్షన్ పడకు ఎక్కువగా భయపడకు అని ధైర్యం చెబుతాడు. నువ్వేం టెన్షన్ పడకు ఈ క్షణం నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్క కదలికను నేను కనుక్కుంటాను అని అంటాడు. ఇంతలో ఫణింద్ర అక్కడికి వచ్చి శైలేంద్ర చెంప చెల్లుమనిపిస్తారు. అన్ని విషయాలు మీకు తెలిసి చేయాలా పిచ్చి పిచ్చిగా ఉందా ఇదివరకే మీకు మాట్లాడుకోవద్దని వార్నింగ్ ఇచ్చాను కదా తీవ్రవాదుల ఎప్పుడు గుసగుసలాడుకుంటూ ఉంటారు అంటూ తల్లి కొడుకులకు ఇద్దరికి వార్నింగ్ ఇస్తాడు.
తల్లి కొడుకులకు వార్నింగ్ ఇచ్చిన ఫణింద్ర
తర్వాత ధరణిని పిలిచి నీకేం చెప్పానమ్మా అనడంతో మీరు చెప్పినట్టే చేస్తున్నాను మామయ్య నా కళ్ళు కప్పి వీళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నారు అని అంటుంది. అప్పుడు ధరణి ముందు తల్లి కొడుకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర. మరొకవైపు మహేంద్ర అనుపమ అన్న మాటలు గురించి తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అనుపమ ఫోన్ చేయగా మహేంద్ర ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. తర్వాత అనుపమ మళ్లీ ఫోన్ చేయగా ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నా కూడా పదే పదే ఫోన్ చేస్తున్నావు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా నా కొడుకు ముందే చెప్పాడు కదా. అయినా నన్ను ఎంత మాట అన్నావు అనుపమ. అలా ఎలా మాట్లాడగలిగావు అనగా మహేంద్ర నాకు ముందే ఎందుకు ఈ విషయం చెప్పలేదు అనగా ఎప్పుడూ అనడంతో అరకులో కలిసినప్పుడు ఎందుకు నాకు విషయం చెప్పలేదు అని నిలదీస్తుంది.
అనుపమ పై సీరియస్ అయినా మహేంద్ర
ఆ సమయంలో చెప్పలేకపోయాను అని అంటాడు మహేంద్ర. జగతి ఎందుకు చనిపోయింది చనిపోయిన కూడా మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అంటూ అనుపమ గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. దాంతో మహేంద్ర సీరియస్ అవుతూ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి అయినా కూడా నేను ఇంతకంటే ఏం చెప్పలేను అని గట్టిగా అరుస్తాడు. ఈ విషయాన్ని వదిలేయ్ అనడంతో నేను వదిలేయడానికి ఫోన్ చేయలేదు అనగా పదేపదే ఎందుకు జగతి ప్రస్తావని తీసుకువచ్చి నన్ను ఇంకా బాధ పెడతావు అని అంటాడు మహేంద్ర. ఇప్పుడు నేను జీవచ్ఛవంలా ఉన్నాను జగతి నా పక్కన లేదు అన్న విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ బాధగా మాట్లాడతాడు మహేంద్ర. నువ్వు చూస్తే జగతి అంటూ నా ప్రాణాలతో ఓడిస్తున్నావు జగతి అంటే నాకు ప్రాణం నీకు తెలుసు కదా అనుపమ అని అంటాడు.
మహేంద్ర మాటలకు బాధపడుతున్న అనుపమ
అయినా జగతి మీద ప్రేమ ఉంది అనడం కాదు ఒకవేళ ఆ ప్రేమ ఉంటే చనిపోయి ఎన్ని రోజులు అవుతున్నా కూడా నువ్వు ఇంకా ఏం చేయలేదు అనడంతో గట్టిగా స్టాపిడ్ అని గట్టిగా అరవడంతో వసుధార, రిషి అక్కడికి వస్తారు. అప్పుడు అనుపమని విసుక్కుంటూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు మహేంద్ర. అప్పుడు మహేంద్ర మాటలు విని ఇద్దరు ఆలోచనలో పడతారు. మరోవైపు అనుపమ మహేంద్ర అన్న మాటలు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు మహేంద్ర అంతా కోపంగా రియాక్ట్ అవుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అని లగేజ్ తో బయలుదేరడంతో అది చూసి విశ్వనాథం, ఏంజెల్ ఇద్దరు షాక్ అవుతారు. లగేజ్ తో వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు అనడంతో నేను తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి.
Guppedantha Manasu November 16 Today Episode: ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న అనుపమ
వాటి మీద వెళ్తున్నాను అని అంటుంది అనుపమ. అప్పుడు ఇన్నాళ్లు నాకు దూరంగా ఉన్నావు అంటూ చాలా బాధగా ఎమోషనల్ అవుతూ మాట్లాడతాడు విశ్వనాథం. నువ్వు నాకోసం వచ్చినప్పుడు చాలా సంతోషపడిపోయాను కానీ ఇలా మళ్లీ అద్దాంతరంగా వదిలేసి వెళ్తావని అనుకోలేదు అని అంటాడు. అప్పుడు ఏంజెల్ కూడా వెళ్లొద్దు అత్తయ్య నా మాట వినండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది. క్షమించండి నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటన వల్ల మీకు దూరంగా ఉన్నాను అని అంటుంది అనుపమ.