Guppedantha Manasu November 17 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అనుపమ విశ్వనాధంతో మాట్లాడుతూ సారీ డాడ్. నా జీవితంలో జరిగిన కొన్ని కొన్ని సంఘటనలు వల్ల దూరంగా ఉండాల్సి వచ్చింది. మిమ్మల్ని బాధ పెట్టడంతో పాటు నేను కూడా బాధపడ్డాను. ఇక నుంచి అలా జరగదు. నేను మీతోనే ఉంటాను డాడ్. మీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను కానీ ప్రస్తుతం అయితే నేను వెళ్ళాలి. ప్లీజ్ డాడ్ వద్దని చెప్పొద్దు అనడంతో సరే అమ్మ నీ ఇష్టం అని అంటాడు విశ్వనాథం. సరే వెళ్ళు కానీ నీతో పాటు నీ తోడుకి ఏంజెల్ ని తీసుకొని వెళ్ళు అని అంటాడు విశ్వనాథం. ఏం కాదు డాడీ నేను ఒంటరిగానే ఉంటాను. ఇన్ని రోజులు ఒంటరిగానే బతికాను కదా మీరు నా గురించి ఎక్కువగా ఆలోచించకండి అని అంటుంది అనుపమ. అత్తయ్య నేను మీతో పాటు వస్తాను అనడంతో సమయం వచ్చినప్పుడు నేను పిలుస్తాను కానీ ఇప్పుడు మాత్రం వద్దు అని అంటుంది అనుపమ.
భార్యపై దొంగ ప్రేమ చూపిస్తున్న శైలేంద్ర
సరే అమ్మ బయలుదేరు అని చెప్పడంతో అనుపమ అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాత శైలేంద్ర ధరణి కోసం కాఫీ తీసుకొని వచ్చి దొంగ ప్రేమలు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు భర్త ప్రవర్తనపై ధరణి అనుమాన పడుతూ ఉంటుంది. నీకోసమే నేను స్వయంగా తయారు చేసుకుని కాఫీ తీసుకొని వచ్చాను అనడంతో ధరణి షాక్ అవుతుంది. నేను నిన్ను ప్రేమగా చూసుకోవాలనుకుంటున్నాను నీకున్న కోరికలను తీరుస్తాను. నేను హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నాను ధరణి అనడంతో సడన్గా ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ధరణి. డాడ్ నన్ను అన్న మాటలు నా మనసును కలిచి వేసాయి. రాత్రంతా నిద్ర పట్టలేదు అని మాట్లాడుతూ ఉండగా ఇందులో ఫణీంద్ర అక్కడికి వస్తాడు.
శైలేంద్ర పై అనుమాన పడుతున్న ధరణి
అప్పుడు శైలేంద్ర ధరణికి మాయమాటలు చెబుతూ ఉండగా దూరం నుంచి ఆ మాటలు విని సంతోషపడి అక్కడికి వస్తాడు. నేను ఎప్పుడు వచ్చాను అన్న సంగతి పక్కన పెట్టు నీ మాటలు నాకు బాగా నచ్చాయి అనడంతో మీ మాటలు నన్ను కదిలించాయి డాడ్ అంటూ దొంగ ప్రేమలు చూపిస్తూ దొంగనాటకాలు ఆడుతూ ఉంటాడు శైలేంద్ర. దూరం నుంచి అది చూసిన దేవయాని కొంపదీసి శైలేంద్ర మారిపోయాడా ఏంటి లేకపోతే నటిస్తున్నాడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు శైలేంద్ర ప్రవర్తనపై అనుమాన పడుతూ ఉంటుంది. ఆ తర్వాత మహేంద్ర అనుపమ అన్న మాటలు తలచుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు జగతి ఫోటో పట్టుకొని ఒకవైపు నువ్వు లేవు మరొకవైపు అనుపమ ప్రశ్నలు లేవు అన్న నిజాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను అని బాధగా మాట్లాడుతూ ఉంటాడు మహేంద్ర.
తండ్రి పై సీరియస్ అయిన రిషి
అప్పుడు బాధతో మహేంద్ర మందు తాగుబోతుండగా రిషి వచ్చి ఆ మందు బాటిల్ ని లాక్కుంటాడు. ఏంటి డాడీ ఇది తాగను అని చెప్పారు కదా అనడంతో ఆ సమయంలో అలా చెప్పాను కానీ ఇప్పుడు తాగాలనిపిస్తుంది అని అంటాడు మహేంద్ర. జ్యోతి లేదు అన్న బాగా నా మనసును కలిచి వేస్తుంటే కొన్ని చూపులు కొన్ని ప్రశ్నలు నా మనసుని పొడి చేస్తున్నాయి అని అంటాడు. మీరు అంటున్నది అనుపమ గారి గురించే కదా. మీరు ఆవిడ గురించి ఆలోచించకండి ఆవిడకు చెప్పాల్సింది నేను చెప్పేసాను. ప్రతిసారి మీ అమ్మ జ్ఞాపకాలు నాకు గుర్తుకు వస్తున్నాయి అనడంతో అప్పుడు రిషి పోయిన అమ్మ తప్ప నేను గుర్తుకు రావడం లేదా అనడంతో మహేంద్ర ఆశ్చర్యపోతాడు. నేను ఎవరిని నీ కొడుకుని నీ రిషిని అని రిషి బాధగా మాట్లాడుతాడు. అప్పుడు మహేంద్ర కూడా కొడుకుతో బాధగా మాట్లాడుతూ ఉంటాడు.
ఇప్పుడు నా మైండ్ మారాలి అంటే నేను మందు తాగాలి అని మహేంద్ర మందు తాగబోతుండగా తాగండి డాడ్ మీరు తాగుతున్నది మీ కొడుకు ఆయుషు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి అని అంటాడు రిషి. అలా మాట్లాడుక రిషి అనడంతో మీరు తాగడం వల్ల మా సంతోషం పోతుంది మా జీవితాలు కూడా నాశనం అవుతాయి అని అంటాడు రిషి. నా బాధ అర్థం చేసుకో రిషి అనగా మీకు ఒక్కరికే కాదు డాడీ నాకు బాధ ఉంటుంది నేను ఆవేదన పడుతున్నాను అని తండ్రిపై సీరియస్ అవుతాడు రిషి. చిన్నప్పటి నుంచి మా అమ్మ లేకపోయినా ఒంటరిగా ఉన్నాను కానీ ఆ బాధని దిగమింగు కోవడానికి ఎలాంటి అలవాట్లు నేర్చుకోలేదు కదా డాడ్ అని అంటాడు.
Guppedantha Manasu November 17 Today Episode: కొడుకుకు మాట ఇచ్చిన మహేంద్ర
అప్పుడు తండ్రికి అర్థమయ్యే విధంగా తన మనసులో బాధ మొత్తం చెబుతాడు రిషి. దయచేసి మీరు ఎప్పుడు ముందు తాగొద్దు. తాగను అని నా మీద ఒట్టేసి చెప్పండి అనడంతో మహేంద్ర షాక్ అవుతాడు. అప్పుడు మహేంద్ర చేసేది ఏమీ లేక కొడుకుపై ఒట్టు వేసి తాగను అని మాట ఇస్తాడు. మందు మానేయడం మాత్రమే కాదు కాలేజీ కూడా తలుచుగా రావాలి ముందు మాదిరిగానే ఉండాలి అని చెప్పి వసూ రిషి ఎక్కడి నుంచి వెళ్లిపోతారు.