Guppedantha Manasu November 18 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అనుపమ కాలేజీకి వెళ్లి లెక్చరర్స్ ని జగతి గురించి అడిగి ఎంక్వయిరీ చేస్తూ ఉండగా ఇంతలో శైలేంద్ర అక్కడికి వచ్చి అనుపమను చూసి షాక్ అవుతాడు. మమ్మీ చెప్పిన అనుపమ తనే కదా తనకి ఇక్కడ ఏం పని వాళ్లతో ఏం మాట్లాడుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు అనుపమని ఫోటో తీసుకుంటాడు. ఆ తర్వాత అనుపమ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో లెక్చరర్స్ దగ్గరికి వెళ్లి అనుపమ ఏం మాట్లాడిందా అని ఆరా తీస్తూ ఉంటాడు శైలేంద్ర. తర్వాత దేవయానికి ఫోన్ చేసి అనుపమ వచ్చింది అని చెప్పడంతో దేవయాని అనుషాక్ అవుతుంది. ఇప్పుడు ఆ అనుపమ రిషి, వసు లను కలిస్తే ఇంకా ఏమైనా ఉందా నిజాలు మొత్తం తెలిసిపోతాయి అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
అనుపమను కలిసిన శైలేంద్ర
అప్పుడు అనుపమని తీసుకొని మన ఇంటికి రా అని సలహా ఇస్తుంది దేవయాని. తర్వాత అనుపమ నడుచుకుంటూ వెళుతుండగా శైలేంద్ర అనుపమ దగ్గరికి వెళ్లి ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే ఆరా తీసి దేవయానికి ఫోన్ చేసి పిన్ని ఫ్రెండ్ అనుపమ గారిని కలిసాను. మన కాలేజీలో ఉన్నారు. ఏంటి మమ్మీ మన ఇంటికి పీల్చుకొని రావాలా ఇదిగో మాట్లాడు అని అనుపమ కి ఫోన్ ఇస్తాడు. అప్పుడు దేవయాని దొంగ ప్రేమలు చూపిస్తూ ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. సరే అవన్నీ ఇప్పుడు ఎందుకు ఇంటికి వచ్చేయి. ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం అనడంతో నేను అందుకోసం రాలేదు రిషి వసుధారల కోసం వచ్చాను అని అంటుంది అనుపమ. అలా కాదు అనుపమ నువ్వు ఇక్కడికి వస్తే జగతికి సంబంధించిన చాలా విషయాలు నీకు చెప్పాలి.
అనుపమకు అబద్ధాలు చెప్పిన శైలేంద్ర
తను ఎప్పుడు నీ గురించి చెప్పేది. ఒకసారి నేను నిన్ను కలిస్తే నా మనసులో బాధ అంతా నీతో చెప్పుకోవచ్చు అని దొంగ నాటకాలు ఆడుతూ ఉంటుంది దేవయాని. తర్వాత శైలేంద్ర పదండి ఇంటికి వెళ్దాం అనగా ఇప్పుడు కాదు నేను ఫస్ట్ రిషి వాళ్ళతో మాట్లాడాలి అంటుంది అనుపమ. ఈరోజు రిషి వాళ్ళు లీవ్ లో ఉన్నారు అని శైలేంద్ర అనడంతో ఇంతలోనే రిషి వసుధార ఇద్దరు కాలేజీకి వస్తారు. అప్పుడు అనుపమని ఇంటికి పిలుచుకొని వెళ్లడానికి శైలేంద్ర అబద్ధాలు చెబుతూ ఉంటాడు. అప్పుడు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లడానికి బయలుదేరుతుండగా రిషి వాళ్లు ఎదురు పడడంతో శైలేంద్ర షాక్ అవుతాడు. అప్పుడు రిషి వాళ్లకు కనిపించకుండా అనుపమను వేరే దారిలో పిలుచుకొని వెళ్తాడు. తర్వాత జగతి ఫోటో దగ్గరికి పిల్చుకొని వెళ్లి పిన్ని అంటే నాకు ఇష్టం పిన్ని ఫోటోకి ప్రతిరోజు పూజలు చేస్తా అని దండం పెట్టుకుంటాను అని జగతి మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తాడు శైలేంద్ర.
దేవయాని ఇంటికి వెళ్లిన అనుపమ
ఆ మాటలు అన్నీ నిజమే అని నమ్ముతుంది అనుపమ. అప్పుడు జగతి ఫోటో చూసి అనుపమ బాధపడుతూ ఉండగా ఇక వెళ్దామా మేడం అని అనుపమని పిలుచుకొని ఇంటికి వెళ్తాడు శైలేంద్ర. ఆ తర్వాత అనుపమ దేవయాని ఇంటికి వెళుతుంది. అప్పుడు దేవయాని ఏమీ తెలియనట్టుగా నటిస్తూ ఉంటుంది. తర్వాత ధరణిని పిలిచి కాఫీ తీసుకొని రమ్మని చెబుతుంది. అయినా మీకు జగతి వాళ్ళ పెళ్లి ఇష్టం లేదు కదా అనడంతో మొదట్లో వద్దు అనుకున్నాను కానీ ఆ తర్వాత వాళ్ల పెళ్లి ని యాక్సెప్ట్ చేశాను అనడంతో అదేంటి అలా ఎలా ఒప్పుకుంటారు అని ప్రశ్నలు వేస్తుంది అనుపమ. అప్పుడు అబద్ధాలు చెప్పి కవర్ చేసుకుంటుంది దేవయాని. జగతి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే ఎందుకు ఆపలేదు అని ప్రశ్నిస్తుంది అనుపమ.
Guppedantha Manasu November 18 Today Episode: కోడల్ని తెగ పోగడేస్తున్న దేవయాని
భర్త కొడుకు ఇల్లు ఇవన్నీ కాదని వెళ్ళిపోయింది అని తప్పంతా జగతిదే అన్నట్టుగా మాట్లాడుతుంది దేవయాని. అప్పుడు దేవయాని మాటలకు ఆలోచనలో పడుతుంది. అప్పుడు తల్లి కొడుకు ఒకరిని మించి ఒకరు జగతి వాళ్ళ పై ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు. అనుపమ దృష్టిలో మహేంద్రను విలన్ లా మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు ధరణి రావడంతో కోడల్ని తెగ పొగిడేస్తూ ఉంటుంది దేవయాని. అప్పుడు అనుపమ తెలివిగా మాట్లాడడంతో దేవయాని ఏం మాట్లాడాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు జగతి మరణం గురించి ఎంక్వయిరీ చేస్తూ ఉంటుంది అనుపమ.