Guppedantha Manasu November 20 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అనుపమ మీరు ఎప్పుడు ఎండి సీట్ కావాలని అనుకోలేదా అనడంతో శైలేంద్ర దేవయాని షాక్ అవుతారు. అయ్యో అలాంటివని నాకెందుకండీ అలాంటి పెద్ద పెద్ద బాధ్యతలు నేను మోయలేను అనడంతో అయినా అలా ఎందుకు అనుకోవాలి అని అంటుంది అనుపమ. అప్పుడు దేవయాని దొంగ నాటకాలు ఆడుతూ ఆ ఎండీ సీట్ మాకెందుకు జగతి ఆ సీట్లో కూర్చున్న తర్వాతనే కష్టాలు మొదలయ్యాయి. మా కాలేజీ మీద ఎవరో కన్నేశారు. ఎన్నో కుట్రలు కూడా చేశారు చివరికి జగతి ప్రాణాలు కూడా కోల్పోయింది అంటుంది దేవయాని. అప్పుడు ఆ వసుధారకి ఆ ఎండి సీట్ దక్కింది మొదట స్టూడెంట్ గా ఉన్నావ్ వసుధారా మా రిషిని వలలో వేసుకుని ఇప్పుడు ఎండి స్థానాన్ని దక్కించుకుంది అని వసుధారపై అనుమానం వచ్చే విధంగా మాట్లాడుతుంది దేవయాని.
అనుపమ మనసులో అనుమానం బీజం నాటిన దేవయాని
రిషి కూడా ప్రేమించాడు కదా అని అనుపమ అనడంతో వయసు అలాంటిది అని అంటుంది దేవయాని. మీరు ఇలా మాట్లాడడం తప్పు కదా అని అంటుంది అనుపమ. అప్పుడు దేవయాని కావాలని నటిస్తూ తప్పు మొత్తం రిషి వసుధారదే అన్నట్టుగా వాళ్లపై అనుమానం వచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు దేవయాని మాటలు నిజమే అని నమ్మిన అనుపమ ఆలోచనలో పడుతుంది. అప్పుడు అనుపమ సరె నేను వెళ్లొస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో నువ్వు అంతలా చెప్పినా కూడా తను నమ్మలేదు కదా మామ్ అని అంటాడు శైలేంద్ర. నమ్మకపోయినా కొంచెం అనుమానం వచ్చింది కదా అది చాలు నాకు అని అంటుంది. సరే ఇప్పుడు నా ఊహ కరెక్ట్ అయితే అనుపమ నేరుగా మహేంద్ర దగ్గరికి వెళ్తుంది.
వసుధారని ఆటపట్టించిన రిషి
నువ్వు కూడా తనని ఫాలో అవుతూ వెళ్ళు అని సలహా ఇస్తుంది దేవయాని. తర్వాత రిషి నడుచుకుంటూ వెళ్తుండగా అప్పుడు ఆఫీసులో అటెండర్ వసుధార దగ్గరికి ఫైల్స్ తీసుకుని వెళ్తుండగా నువ్వు ఇక్కడే ఉండు నేను తీసుకుని వెళ్తాను అని ఆ ఫైల్స్ తీసుకొని వసుధార దగ్గరికి వెళ్తాడు. అప్పుడు గొంతు మార్చి అటెండర్ మాట్లాడినట్టుగా మాట్లాడుతాడు. అప్పుడు ఎదురుగా ఉన్న రిషిని చూసి సార్ మీరా అంటూ ఆశ్చర్యపోతుంది వసుధార. చెప్పండి మేడం ఏం చేయాలి అనడంతో నేను చెప్తే మీరు పని చేయడం ఏంటి సార్ అనగా మీరు ఎండి కాబట్టి ఎవరికి అయినా పని చెప్పొచ్చు అనగా అందరికీ ఎండిని మీకు కాదు కదా సార్ అని అంటుంది.
సంతోషంలో రిషి,వసు
అప్పుడు కొద్దిసేపు వసుధారని ఆట పట్టించినట్టుగా మాట్లాడుతాడు రిషి. ఎప్పుడు కాలేజీ ఫైల్స్ ఇవి మాత్రమేనా అయ్యో నా భర్త ఉన్నాడు భర్తను ఎలా బయటికి పిలుచుకోవాలి సరదాగా గడపాలి అని ఏమీ లేదా అని అంటాడు రిషి. ఇప్పుడు మీరేనా సార్ మాట్లాడుతూ ఉండేది ఒకప్పుడు నాకు రెస్టు లేకుండా పని చెప్పేవారు అలాంటిది మీరే ఇలా మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది అని అంటుంది వసుధార. అప్పుడు కొంచెం టైం పడుతుంది సార్, ఇవన్నీ అయిపోవడానికి వినడంతో సరే అని వసుధార రిషి ఇద్దరు కలిసి ఆ ఫైల్స్ అన్ని చూస్తూ ఉంటారు. అప్పుడు ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఆఫీస్ పని మొత్తం పూర్తి చేస్తారు. ఆ తర్వాత ధరణి వసుధారకు ఫోన్ చేస్తుంది. అప్పుడు అనుపమ అనే ఒక ఆవిడ వచ్చారు అత్తయ్య ఆయనతో మాట్లాడారు.
వసుధారకు అసలు విషయం చెప్పిన ధరణి
చాలాసేపు మాట్లాడి వెళ్లారు అని అంటుంది ధరణి. సరే మేడం మీరు ఏంటి టెన్షన్ పడకండి నేను చూసుకుంటాను అని చెప్పి ఫైల్స్ అన్ని అక్కడే పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు రిషి వసుధార కోసం ఎదురు చూస్తుండగా వసుధార వస్తుంది. తరువాత ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు. అప్పుడు మహేంద్ర కూర్చుని బాధపడుతూ ఉండగా ఇంతలో అనుపమ వచ్చి కాలింగ్ వెళ్లి కొట్టడంతో అనుపమను చూసి షాక్ అవుతాడు మహేంద్ర. తర్వాత అనుపమ, మహేంద్ర ఇద్దరు కలిసి లోపలికి వెళ్లి కూర్చుంటారు. అప్పుడు అనుపమ, మహేంద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా దొంగచాటుగా కిటికీలోంచి వింటూ ఉంటాడు శైలేంద్ర. అప్పుడు అనుపమ, జగతి ఫోటో చూసి ఏడుస్తూ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు అని అంటుంది.
Guppedantha Manasu November 20 Today Episode: మహేంద్రను నిలదీసిన అనుపమ
నీకు ఫోన్ లో కూడా చెప్పాను కదా అనుపమ మన మధ్య జగతి టాపిక్ తీసుకురావద్దని అని అంటాడు మహేంద్ర. నా మనసులో జగతి గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి వాటికీ సమాధానం కావాలి అని అంటుంది అనుపమ. నువ్వు నీ కొడుకు ఇద్దరూ జగతి 20 ఏళ్ళు దూరంగా ఉన్నారు కదా. జగతిని ఎప్పుడు తల్లిగా కూడా చూడలేదంట కదా అనడంతో ఆ మాటలకు మహేంద్ర కోపంతో రగిలిపోతూ ఉండగా ఆ మాటలు విన్న శైలేంద్ర సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు అనుపమ ఎంత అడిగినా కూడా శైలేంద్ర సమాధానం చెప్పడానికి ఇష్టపడడు. ఆరోజు ఎంతోమందిని ఎదిరించి నువ్వు జగతిను ప్రేమగా చూసుకుంటావని నీ చేతిలో పెడితే కానీ నువ్వు జగతిని ఇలా నడిరోడ్డులో విడిచి పెట్టావు అనడంతో మహేంద్ర స్టాపిడ్ అనుపమ అని గట్టిగా అరుస్తాడు.. ఇంతలోనే రిషి వాళ్ళు రావడంతో శైలెంద్ర కనిపించకుండా దాక్కుంటాడు.