Guppedantha Manasu November 21 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అనుపమ నిజం తెలియక తప్పు మహేంద్రదే అన్నట్టుగా దోషిని చేసి మాట్లాడుతూ ఉండగా మహేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తప్పంతా నాదే నీ చేతిలో అనవసరంగా జగతిని పెట్టాను అని కోపంగా మాట్లాడుతుంది అనుపమ. నిన్ను నమ్మి నీ చేతిలో పెడితే నువ్వు తనని నడిరోడ్లో వదిలేసావు అని అనగా స్థాపిడ్ అనుపమ అని గట్టిగా అరుస్తాడు. ఇంతలోనే వసుధార రిషి ఇద్దరు ఇంటికి వచ్చి చూడగా అక్కడ అనుపమ ఉండడం చూసి షాక్ అవుతారు. అప్పుడు అనుపమ చేసిందంతా చేసి ఇప్పుడు కోప్పడుతున్నావా మహేంద్ర ఎందుకు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని అలా దూరం పెట్టావు అనడంతో దూరం నుంచి వసుధార, రిషి ఆ మాటలు వింటూ ఉంటారు.
బాధతో మాట్లాడుతున్న అనుపమ
జగతి కలల్ని చిదిమేసావు చివరికి జగతి చనిపోయేలా చేసావు అనడంతో ఏయ్ అనుపమ నీ హద్దుల్లో నువ్వు ఉండు అని గట్టిగా అరుస్తాడు మహేంద్ర. అప్పుడు రిషి వాళ్లు అక్కడికి వెళ్లడంతో ఇప్పుడు వీళ్ళు వచ్చారేంటి అని అనుకుంటాడు శైలేంద్ర. ఆ తర్వాత అందులో కూర్చోవడంతో చూసావా రిషి అనుపమ ఎలా మాట్లాడుతుందో మీ అమ్మ చావుకు కారణం నేనే అని అంటుంది. తను అలా మాట్లాడుతుంటే నాకు బతికి ఉండాలని అనిపించడం లేదు అనడంతో నీకే కాదు మహేంద్ర నిజం తెలిసినప్పటి నుంచి నాకు కూడా అలాగే ఉంది అని అంటుంది అనుపమ. అప్పుడు అనుపమ రిషితో మాట్లాడుతూ గతంలో జరిగిన విషయాలు అన్నీ చెబుతూ ఉంటుంది. నేను గతంలో జగతికి మాట ఇచ్చాను కాబట్టి అరకులో కలిసినప్పుడు మహేంద్ర గట్టిగా నిలదీయలేదు అని అంటుంది అనుపమ.
నిజం తెలుసుకున్న వసుధార
అప్పుడు మహేంద్ర బాధతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. అప్పుడు మేడం కాఫీ తాగుతారా టీ తాగుతారా అనడంతో అంటే ఇంటికి వచ్చిన వారిని భోజనం చేయమని అడగరా అని అంటుంది అనుపమ. అదేం లేదు మేడం మీరు భోజనం చేసి వెళ్ళండి వినడంతో సరే అని అంటుంది అనుపమ. అప్పుడు శైలేంద్ర అప్పటివరకు నేను ఇక్కడే ఉండాల ఇక్కడే ఉంటే ప్రాబ్లం అవుతుందని అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకుంటుండగా ఇంతలో ఫోన్ మోగడంతో ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న గ్రీస్ ని ముఖానికి పట్టించుకొని వెళ్ళిపోతుండగా శైలేంద్రను చూసిన వసుధార శైలేంద్ర లాగా లేడే అని ధరణికి ఫోన్ చేస్తుంది. అప్పుడు నిజం తెలుసుకుని వసుధార షాక్ అవుతుంది. మా ఆయన మారిపోయాడు నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు అనడంతో వసుధార ఆలోచనలో పడుతుంది.
వసుధారపై కోపంతో రగిలిపోతున్న శైలేంద్ర
మరోవైపు శైలేంద్ర బండి నెట్టుకుంటూ వెళ్తుండగా ఇంతలో మెకానిక్ వచ్చి బైక్ ని చెక్ చేసి బైక్ కి ఆన్లో లేకపోవడంతో 1000 తీసుకొని బైక్ కీ ఆన్ చేస్తేనే కదా సార్ బండి స్టార్ట్ అయ్యేది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు రిషి,అనుపమ మాట్లాడుకుంటూ ఉంటారు. మహేంద్ర,జగతి ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అనడంతో మరి డాడ్ గురించి నాకంటే మీకు ఎక్కువగా తెలిసి ఉంటుంది అనగా అవును అంటుంది అను. అప్పుడు రిషి మీ మాటలకు డాడ్ ఎక్కువగా బాధపడుతున్నారు అని అంటాడు. అప్పుడు గతంలో జరిగిన విషయాలు అన్ని రిషి చెప్పడంతో నువ్వు మీ అమ్మని ఏమని పిలిచే వాడివి అని ప్రశ్నిస్తుంది అనుపమ. మేడం అని పిలిచేవాడిని అనడంతో కళ్ళతల్లిని ఎవరైనా మేడం అని పిలుస్తారా నీ తల్లి నీకు అంత కానిది అయిపోయిందా అనడంతో అలా మాట్లాడకండి నేను తట్టుకోలేను అని అంటాడు రిషి.
Guppedantha Manasu November 21 Today Episode: భర్తని చితకబాదిన ధరణి
వసుధార వచ్చి కాఫీ తీసుకొని వస్తాను అనడంతో వద్దు వసుధార నేను కలుపుకున్న కాఫీ ని నాకు తాగడం అలవాటు అని అనుపమ కాపీ చేసుకోవడానికి వెళుతుంది. మరోవైపు శైలేంద్ర అలాగే ముఖానికి నల్లని రంగు పట్టించుకోని లోపలికి వెళ్తుండగా ఎవరు నువ్వు అని ధరణి అడగడంతో ధరణి నీ పక్కకు నెట్టేసి వెళ్తాడు శైలేంద్ర. అప్పుడు ధరణి అత్తయ్య మామయ్య దొంగ పడ్డాడు అని గట్టిగా అరుస్తూ పక్కనే ఉన్న ఒక కర్ర ని తీసుకొని శైలెంద్ర ను చితకబాదుతుంది. అప్పుడు ధరణి నేనే నీ భర్తని అనడంతో స్వారీ అండి చూసుకోలేదు. మీరేంటంటే ఇలా వచ్చారు మనసులో పెట్టుకోకండి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ధరణి. అప్పుడు శైలేంద్ర ధరణికి మాయమాటలు చెబుతూ బైక్ మీద బయటకు వెళ్లాను. అప్పుడు ఇలా జరిగింది సరే నేను వెళ్లి స్నానం చేసేస్తాను నువ్వు రెడీగా ఉండు ఇద్దరం కలిసి బైక్ మీద బయటకు వెళ్దాం అని మాయమాటలు చెబుతాడు.