Guppedantha Manasu November 23 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో వసుధార అనుపమ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఆవిడ ఎందుకు అలా మాట్లాడింది ఆమె మాట తీరే అంతనా లేకపోతే దేవయాని అత్తయ్య వాళ్ళు నామీద లేనిపోనివని కల్పించి చెప్పి ఉంటారా. ఒకవేళ అదే నిజమైతే ఆమె అనుమానాలు పెరిగి పెద్దవ్వకముందే వాటిని తుంచేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రిషి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావ్ వసుధార ఏమి ఆలోచిస్తున్నావు అని అనడంతో ఏం లేదు సార్ అనగా అనుపమ మేడం గురించి ఆలోచిస్తున్నావు కదా నేను కూడా ఆమె గురించి ఆలోచిస్తున్నాను. డాడ్ ఒంటరిగా ఉండడం చూసి అమ్మనే అతనిని పంపించిందని నేను అనుకుంటున్నాను అని అంటాడు రిషి. అవును సార్ భోజనం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం బయటపడింది.

తండ్రిని చూసి సంతోష పడుతున్న రిషి

మామయ్య అభిరుచుల గురించి మనకు తెలియని విషయాలు కూడా ఆమె మనకు ఈరోజు చెప్పింది అని అంటుంది. మనం భోజనం తినడానికి పిలిచినా కూడా రాని డాడ్ ఈ రోజు స్వయంగా తనే వడ్డించారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది వసుధార అని అంటాడు. వాళ్లిద్దరు పోట్లాడుకుంటే చిన్నపిల్లల్లా అనిపిస్తున్నారు అంటూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆ మేడం ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండడానికి కారణం ఏంటో తెలియడం లేదు సార్ అనడంతో తన జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఏమో అని అంటాడు రిషి. తర్వాత వసు, రిషి ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. అప్పుడు మహేంద్ర సంతోషంగా ఉండడం చూసి సంతోష పడుతూ ఉంటారు.

నిజాలు రాబట్టే ప్రయత్నంలో దేవయాని

ఈరోజు ఎందుకో నువ్వు నాకు స్పెషల్ గా కనిపిస్తున్నావు డాడ్ అనగా అవును మామయ్య అని అంటుంది వసు. అదేం లేదు రిషి మీరు ఏదో పొరపాటు పడుతున్నారు అనగా లేదు డాడ్ అనడంతో సరే మీరే చెప్పండి నాలో వచ్చిన కొత్త మార్పు ఏంటో అని అంటాడు మహేంద్ర. మేము ఇన్ని రోజులు కూడా కోరుకుంది ఇదే డాడ్ అనడంతో మహేంద్ర కూడా సంతోషపడుతూ ఉంటాడు. సరే డాడ్ జాగ్రత్తగా పడుకోండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత దేవయాని అనుపమ కు ఫోన్ చేస్తుంది. ఎక్కడ ఉన్నావ్ ఏం చేస్తున్నావు అని అడగడంతో తెలుసుకొని ఏం చేస్తావు అని అంటుంది అనుపమ. అప్పుడు ఇంటికి భోజనానికి పిలుద్దామని అనుకున్నాను మా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి అంటూ ఎక్కడికి వెళ్లిందో ఎక్కడ తినిందో అని అన్ని దేవయాని నెమ్మదిగా సమాధానాలు రాబడుతూ ఉంటుంది.

దేవయానికి బుద్ధి చెప్పిన అనుపమ

అప్పుడు అనుపమ సరే అండి ఉంటాను అనడంతో హలో అనుపమ నువ్వు మహేంద్రను కలిసావా వసుధార ఏం మాట్లాడింది అనడంతో ఆపండి నేను ఎవరిని కలిస్తే ఏముంది ఎవరితో మాట్లాడితే మీకెందుకు అంటూ దేవయానికి బుద్ధి చెబుతుంది అనుపమ. దానికి అనుమానం వచ్చినట్టు ఉంది అంటూ ఏమీ లేదు అంటున్నావు ఊరికే కాల్ చేశాను అని కవర్ చేసుకుంటుంది దేవయాని. వసుధార గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేయడంతోఎందుకు పదేపదే వసుధార గురించి మాట్లాడుతున్నారు మీకేం కావాలి అని అంటుంది అనుపమ. అప్పుడు దేవయాని మహేంద్ర ఇంటికి వెళ్ళింది అంటే ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మరొకవైపు రిషి కాలేజీలో ఒక అబ్బాయి అమ్మాయిని మాట్లాడమంటూ వెంటపడుతుండగా ఇంతలో రిషి,వసు అక్కడికి వచ్చి ఎవరు మీరు ఈ ప్రాబ్లం ఏంటి అని ఆ వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు.

అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ ప్రేమ విషయం గురించి మొత్తం రిషికి చెబుతాడు. కానీ అమ్మాయి మాత్రం నేను అతని ప్రేమించలేదు అని చెప్పడంతో అలా మాట్లాడకు చిత్ర అంటూ ఆ అబ్బాయి చేతులు పట్టుకుని బ్రతిమలాడుతుండగా వసుధర చెయ్యి వదులు అంటూ ఆ అబ్బాయి చెంప చెల్లుమనిపిస్తుంది. తను అబద్ధం చెబుతున్నారు సార్ నేను తనతో కలిసి తిరగలేదు అంతా నా దగ్గర పక్కగా ఫ్రూట్స్ అని ఉన్నాయి సార్ అని అంటాడు. నేను కలిసి తనకు దిగలేదు కానీ నా ఫొటోస్ తీసుకొని మార్పు చేసి నేను రాసినట్టుగా లవ్ లెటర్స్ రాసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సార్ అని ఆ అమ్మాయి అసలు నిజం చెప్పడంతో రిషి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తరువాత అబ్బాయిని అరిచి నువ్వు తనని నిజంగా ప్రేమిస్తే తను ప్రేమించే వరకు వెయిట్ చెయ్ కానీ ఇలా చేయకూడదు అని రిషి అతనికి అర్థం ఏ విధంగా చెబుతూ ఉంటాడు.

Guppedantha Manasu November 23 Today Episode: ఫణింద్ర మాటలకు షాక్ అయిన దేవయాని

అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ బాధపడుతూ ఉండగా నువ్వేం భయపడకు ధైర్యంగా ఉండు ఏదైనా జరిగితే మాకు చెప్పు అని రిషి, వసుధార ఆమెకు ధైర్యం చెబుతూ ఉంటారు. ఆ తర్వాత శైలేంద్ర ఫ్యామిలీ అందరూ కలిసి కాఫీ తాగుతుండగా కాఫీ చాలా బాగుంది అంటూ ఇద్దరిని తెగ పొగిడేస్తూ ఉంటాడు ఆ శైలేంద్ర. తనని పొగుడుతూ తను చేసిన తినడం కాదు తనకి నచ్చినట్టుగా ఉండాలి. తనకు కావాల్సినవి కనిపెట్టాలి అని అంటాడు శైలేంద్ర. ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో వరలక్ష్మి అనే ఒక పని చేసే ఆవిడ రావడంతో ఫణింద్ర నేనే రప్పించాను కొద్ది రోజులపాటు ధరణి ఇక్కడ ఉండదు అనడంతో దేవయాని ఎందుకు ఎక్కడికి వెళ్తుంది అని ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ధరణి ఉండదు కాబట్టి పనులన్నీ నువ్వే చేసుకుంటాను అంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆ అమ్మాయిని పంపించేస్తాను అని అనడంతో దేవయాని ఆలోచిస్తూ ఉంటుంది. ధరణి శైలేంద్ర ఇద్దరూ కొద్దిరోజుల పాటు అలా బయటకు వెళ్ళొస్తారు. శైలేంద్ర ధరణి ఇద్దరు కొద్దిరోజులు అలా బయటకు వెళ్లి వస్తారు. అన్ని ఏర్పాట్లు చేశాను ఈరోజు రాత్రికి ప్రయాణం అని అనడంతో దేవయాని అడ్డుపడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 23, 2023 at 7:07 ఉద.