Guppedantha Manasu November 24 Today Episode: ఈరోజు ఎపిసోడ్లో ఫణీంద్ర ధరణికి సపోర్ట్ చేస్తూ పెళ్లయిన ప్రతి ఒక్క ఆడపిల్లకి కోరికలు ఉంటాయి. భర్తతో సంతోషంగా గడపాలని కోరుకుంటుంది. ఎన్నాలని ఈ నాలుగు గోడల మధ్య నలిగిపోతుంది. నువ్వు మారిపోయావు ధరణి మనసును అర్థం చేసుకున్నావు. కాబట్టి ఇప్పుడు మీరు కొద్ది రోజులు ఏకాంతంగా గడిపితే మీ ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతుంది అందుకే నేను ఈ ట్రిప్పు వేశాను అని అంటాడు ఫణింద్ర. ధరణి ఒట్టి అమాయకమైనది తనకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియదు నువ్వు బయటకు తీసుకెళ్లి తనకు ప్రకృతి అందాలను పరిచయం చేయి అనడంతో నేను కూడా అదే అనుకుంటున్నాను డాడ్ ఇంతలో మీరే ఈ ప్లాన్ వేశారు అనడంతో ధరణి సంతోషపడుతూ ఉంటుంది. వెళ్లి బట్టలు సర్దు దరని ఈ రాత్రికి మనం బయలుదేరుదాం అని అంటాడు శైలేంద్ర.

ప్రేమగా మాట్లాడుకుంటున్న వసుధార, రిషి

మరొకవైపు వసుధార ఒంటరిగా బయట కూర్చొని చందమామ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. ఏం ఆలోచిస్తున్నావు అనడంతో కాళీ లో జరిగిన చిత్ర సంఘటన గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది వసుధార. అప్పుడు రిషి వాళ్ళ ప్రేమ గురించి మాట్లాడటంతో వసుధార గతంలో జరిగిన విషయాలు అన్నీ తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. రిషి మాటలకు ఆశ్చర్యపోయిన వసుధార రిషి వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అరోజు నేను మీకు ప్రపోజ్ చేసినప్పుడు చాలా భయపడ్డాను ఎందుకంటే మీరు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను రిజెక్ట్ చేసాను కదా. అది మీరు మనసులో పెట్టుకొని రిజెక్ట్ చేస్తారు ఏమో అని అనుకున్నాను అనడంతో రిషి నవ్వుతూ ప్రేమలో పంతం అసూయ లాంటివి ఏమీ ఉండవు అని అంటాడు.

చిత్ర విషయం తెలిసి షాక్ అయిన వసుధార

అప్పుడు బయట చలిగా ఉండడంతో రిషి వసుధార ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత చిత్రా నుంచి మెసేజ్ రావడంతో ఫోన్ చేయిగా స్విచ్ ఆఫ్ రావడంతో తను ఏదో ఆపదలో ఉంది వెంటనే తనని కాపాడాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మహేంద్ర,రిషి తింటుండగా వసుధార వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు రిషి మీరు మాతో పాటు కలిసి కాలేజీకి రండి అనడంతో సరే అని అంటాడు మహేంద్ర. తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ ఫోన్ చేసి చిత్ర సూసైడ్ చేసుకుంది అని చెప్పడంతో వసుధార రిషి మహేంద్ర ముగ్గురు కలిసి హాస్పిటల్ కి బయలుదేరుతారు. రిషి వాళ్లు హాస్పిటల్ కి వెళ్లడంతో చిత్ర బాయ్ ఫ్రెండ్ తప్పంతా వీళ్ళదే వీరి వల్లే చిత్రానికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని తప్పు మొత్తం వసుధార రిషిల మీదకు నెట్టేస్తాడు.

తప్పంతా వసుధారదే అంటున్నా చిత్ర లవర్

కాసేపు కూల్ గా ఉండు వసుధార అని అంటాడు రిషి. ఇంతలో నర్స్ వచ్చి పాయిజన్ తీసుకుంది అని చెప్పడంతో రిషి వాళ్ళు షాక్ అవుతారు. ఇంతలో డాక్టర్ అక్కడికి వస్తుంది. అప్పుడు రిషి హెల్త్ కండిషన్ గురించి తెలుసుకొని ఖర్చు గురించి ఆలోచించొద్దండి తను చాలా మంచి అమ్మాయి తనని బతికించండి అని చెప్పడంతో డాక్టర్ సరే అని అంటుంది. మహేంద్ర ఏంటిది అసలేం జరిగింది రిషి అని అడగడంతో రిషి జరిగింది మొత్తం వివరిస్తాడు. అప్పుడు అతను మళ్లీ తప్పంతా వసుధారదే అన్నట్టుగా మాట్లాడడంతో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను నీ మీద అని అనడంతో అతను టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు చిత్ర తల్లిదండ్రులు బోరున ఏడుస్తూ ఉండగా అతను కూడా దొంగ నాటకాలు ఆడుతూ ఏడుస్తున్నట్లు నటిస్తూ ఉంటాడు.

పోలీసులు మాటలకు షాకైన వసుధార

ఇంతలో పోలీసు వాళ్ళు మీడియా వాళ్ళు హాస్పిటల్ కి వస్తారు. అప్పుడు పోలీసు వచ్చి వసుధార అంటే మీరేనా మిమ్మల్ని అరెస్టు చేయాలి అనడంతో వసుధర రిషి వాళ్ళు షాక్ అవుతారు. మీ కాలేజ్ స్టూడెంట్స్ చిత్ర సూసైడ్ కి వసుధార కారణం అంటూ కంప్లైంట్ ఇచ్చారు అనడంతో వెంటనే ఆమెను అరెస్టు చేయండి సార్ అని చిత్ర బాయ్ ఫ్రెండ్ పోలీసుల ముందు ఏడుస్తూ నటిస్తాడు. తను సూసైడ్ చేసుకోవడానికి ముందు వసుధార పేరు రాసి సూసైడ్ చేసుకుంది అనడంతో ఆ లెటర్ చదివి రిషి షాక్ అవుతాడు. అప్పుడు వసుధార చిత్రా వాళ్ళ ఇంటికి వెళ్లిన వీడియోని పోలీసులు రిషికి చూపించడంతో రిషి షాక్ అవుతాడు. ఏంటి వసుధార ఇది నాకు తెలియకుండా చిత్ర వాళ్ళను కలిసావా అనడంతో అవును సార్ అనగా రిషి షాక్ అవుతాడు.

Guppedantha Manasu November 24 Today Episode: అసలు విషయం తెలిసి షాకైన రిషి

అప్పుడు చిత్ర బాయ్ఫ్రెండ్ ఈ మేడం మమ్మల్ని బెదిరించి మమ్మల్ని రోడ్డుకి ఈడుస్తాను భయపెట్టింది సార్ ఆ మాటలకు వసుధార షాక్ అవుతుంది. వసుధార మేడం ఇప్పుడు డిబిఎస్టి కాలేజీ ఎండి తన కాలేజ్ స్టూడెంట్ అలా చేశాడంటే బయట తెలిస్తే పరువు పోతుందని చిత్రానీ బెదిరించింది అని వసుధారపై లేనిపోని నిందలు వేస్తాడు. అప్పుడు వసుధార నేను వెళ్ళిన మాట వాస్తవమే కానీ నేను అక్కడ మాట్లాడింది వేరే ఇతను చెబుతున్నది వేరు అని అంటూ నేను అబద్ధాలు చెబితే కనీసం చిత్ర వాళ్ళు నాన్నని అమ్మని అడగండి అని అంటాడు అతను. అప్పుడు అవును సార్ ఈ మేడం వచ్చి బెదిరించింది అనడంతో వసుధార రిషి ఇద్దరు షాక్ అవుతారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 24, 2023 at 7:20 ఉద.