Guppedantha Manasu November 25 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో చిత్ర బాయ్ ఫ్రెండ్ నేను చెప్పేది అబద్ధం అయితే చిత్ర వాళ్ళ అమ్మ నాన్న అని అడగండి సార్. ఈ మేడం చెప్పినట్టు వినకపోతే చిత్రాను ఎగ్జామ్ లో ఫెయిల్ చేస్తానని అనింది సార్ అని అనగా అప్పుడు చిత్ర తల్లిదండ్రులు అవును సార్ ఈ మేడం వచ్చి బెదిరించింది అని ఏడుస్తూ ఉంటారు. ఆ మాటలకు వసుధార షాక్ అవుతుంది. సర్ ఇంకా చూస్తున్నారు ఏంటి సార్ ఈ మేడం ను వెంటనే అరెస్టు చేయండి సార్ అనే వాడు దొంగ నాటకాలు ఆడుతూ ఉంటాడు. ఈ సాక్షాలు సరిపోతాయి కదా సార్ అరెస్ట్ చేయండి అనడంతో సరిపోతాయి అని అరెస్టు చేస్తుండగా రిషి అడ్డుపడడంతో మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే పోలీస్ స్టేషన్ కి వచ్చి మాట్లాడండి సార్ అని అంటాడు. అప్పుడు పోలీసు వాళ్ళు వసుధారని పిలుచుకొని వెళ్తుండగా మీడియా వాళ్ళు గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు.

అనుపమ మాటలకు షాకైన వసుధార

అప్పుడు అనుపమ అక్కడికి వచ్చి మీకు ఇది న్యాయంగా ఉందా అని అనడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. మీరు ఒక ఆడపిల్ల అయి ఉండి సాటి ఆడపిల్ల చావుకి కారణమైనందుకు బాధగా లేదా అని వసుధారని నిలదీస్తుంది. ఎండి సీట్ కోసం ఎలాంటి పని అయినా చేస్తారా అయినా ఎండి సీట్లో కూర్చునే ముందు ఒక ఒక అర్హత ఉండాలి అనడంతో అనుపమ మాటలకు వసుధార ఎమోషనల్ అవుతుంది. అప్పుడు రిషి మేడం కొంచెం తెలుసుకొని మాట్లాడండి ఆ చిత్ర సూసైడ్ కి వసుకి అసలు సంబంధం లేదు అని అంటాడు. అలాంటప్పుడు మీరు ఆ టైంలో చిత్ర వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్లారు అనగా హెల్ప్ మీ మేడం అని తను నాకు మెసేజ్ పెట్టింటే నేను వెళ్ళాను అనడంతో అయితే ఆ మెసేజ్ లు చూపించండి అనడంతో మొబైల్లో ఆ మెసేజ్లు లేకపోవడంతో వసుధార షాక్ అవుతుంది.

అనుపమ పై సీరియస్ అయిన రిషి

ఇదంత మీరే చేశారు తను సూసైడ్ చేసుకోడానికి నువ్వే కారణం అని తెలియక అనుపమ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వసుధారని పోలీసులు అరెస్టు చేసి తీసుకొని వెళ్లిపోవడంతో అనుపమ మహేంద్ర రిషితో ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటుంది. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఎండి సీట్లో ఉంది అంటే గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి అనుకున్నాను. ఇలా ప్రేమికుల విషయంలో ప్రేమ విషయంలో జోక్యం చేసుకుంటుందని అసలు అనుకోలేదు అని అంటుంది. ఇక ఆపుతారా మేడం వసుధార గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి మీరు చూసిందే నిజం అనుకుంటే మేమేం చేయలేము ఇంకొకసారి అలా మాట్లాడకండి అని రిషి సీరియస్ అవుతాడు. అప్పుడు మహేంద్ర కూడా అనుపమ మాటలకు సీరియస్ అయ్యి అనుపమకు వార్నింగ్ ఇస్తాడు. నా కోడలు గురించి నాకు కూడా తెలుసు తను తప్పు చేయదు అని అంటాడు మహేంద్ర.

వసుధారని జగతితో పోల్చిన మహేంద్ర

కానీ నువ్వు ఒక్కటి గుర్తు పెట్టుకో అనుపమ వసుధారని అనుమానిస్తే జగతిని అవమానించినట్లే అవుతుంది అని అంటాడు మహేంద్ర. రేపు అనే రోజు చిత్ర మెలకువలోకి వచ్చి నిజం చెబుతుంది అప్పుడు వసుధార తప్పు లేదని తెలిసి మీరే పశ్చాత్తాప పడతారు అని రిషి అక్కడ నుంచి వెళ్లిపోతారు. తర్వాత రిషి పెద్దపెద్ద వాళ్లకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయగా ఇప్పటికే ఈ విషయం తెలిసిపోయింది నేను ఏమి చేయలేము అని చెప్పడంతో రిషి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి డాడీ ఎవరు హెల్ప్ చేయలేము అంటున్నారు వసుధార అక్కడే ఉండాలా అనడంతో నువ్వేం టెన్షన్ పడకు మౌనంగా ఉండు అని అంటాడు మహేంద్ర. మరొకవైపు స్టేషన్లో ఉన్న వసుధార జరిగిన విషయాలు తెలుసుకుని ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలో అక్కడికి మహేంద్ర రిషి వస్తారు. నువ్వేం టెన్షన్ పడకు మేము ప్రయత్నాలు చేస్తున్నాము నువ్వు తప్పు చేయలేదని మాకు తెలుసు నువ్వు కూడా ధైర్యంగా ఉండు అని ధైర్యం చెబుతూ ఉంటారు.

పసుధారకు బెయిల్ ఇప్పించిన అనుపమ

మహేంద్ర వెళ్లి పోలీసులను రిక్వెస్ట్ చేయగా మాకు వచ్చిన సమాచారం ప్రకారం మహేంద్ర తో సీరియస్ గా మాట్లాడుతాడు. అప్పుడు బాధలో కూడా వసుధార చిత్ర ఎలా ఉంది అనడంతో ఇప్పుడు కూడా తన గురించి ఆలోచిస్తున్నావా అని అంటాడు రిషి. ఆరోజు నేను మీ మీద నింద వేసినప్పుడు కూడా మీరు ఎంత బాధపడి ఉంటారో ఇప్పుడు నాకు అర్థం అవుతోంది మరింత కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు వసుధార ఆ విషయాన్ని వదిలేసేయ్ అని బాగా అర్థం చేసుకొని మాట్లాడతాడు రిషి. అప్పుడు లాయర్ ఫోన్ చేసినా కూడా పోలీసులు మాట వినకపోవడంతో రిషి మహేంద్ర ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు లాయర్ వచ్చి వసుధారకి బెల్ ఇప్పించడంతో రిషి కాస్త రిలీఫ్ అవుతాడు. అప్పుడు రిషి సార్ మీరు ఎవరు సార్ అని అడగగా లాయర్ కృష్ణ కాంత్ నన్ను అనుపమ మేడం పంపించారు అనడంతో మహేంద్ర వాళ్ళు షాక్ అవుతారు. అప్పుడు అనుపమ మహేంద్ర వాళ్ళ కోసం స్టేషన్ బయట ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర అనుపమకి థాంక్స్ అని చెప్పగా ఎందుకు అనడంతో మేము వసుధారని బయట తీసుకురావడానికి చాలా ప్రయత్నించాము నువ్వు మాకు హెల్ప్ చేశావు అని అంటాడు.

Guppedantha Manasu November 25 Today Episode: రిషి మాటలకు ఆశ్చర్యపోయిన అనుపమ

నేను తనపై ప్రేమతో సానుభూతి తోనో బెయిల్ ఇప్పించలేదు జగతి శిష్యురాలు అన్నారు కదా, వసుని అనుమానిస్తే జగతిని అవమానించినట్లే అవుతుంది అని అన్నారు కదా. అందుకోసమే నేను బెయిల్ ఇప్పించాను అని అంటుంది అనుపమ. జగతితో పోల్చారు కాబట్టి ఒక్క అవకాశం ఇస్తున్నాను అనడంతో వెంటనే రిషి మీ మాటలు బట్టి చూస్తుంటే మా అమ్మ అంటే మీకు ఎంత ఇష్టమవుతుంది అర్థం అవుతుంది. కానీ ఆ ఇష్టం ఎదుటి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడేలా ఉండకూడదు అనడంతో నేను తక్కువ చేసి మాట్లాడలేదు రిషి అని అంటుంది అనుపమ. జరిగిన దాంట్లో తన తప్పు లేదని నిరూపించుకోమని చెబుతున్నాను అని అంటుంది అనుపమ. అప్పుడు రిషి అనుపమ తో గట్టిగా ఆర్గ్యుమెంట్స్ చేస్తాడు. వసుధార తప్పు చేసిందని తెలిస్తే నేను కూడా వదిలిపెట్టను అనడంతో తను తప్పు చేసింది అన్న కోణంలో ఆలోచించడమే మీరు మానేయండి అని అంటాడు రిషి. అప్పుడు అనుపమ కు గట్టిగా బుద్ధి చెప్పినట్టుగా మాట్లాడుతాడు రిషి. అప్పుడు రిషిలో కాన్ఫిడెన్స్ చూసి అనుపమ ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు మీరు కోరుకోవాల్సింది ఒకటే చిత్ర దేవుడి దగ్గరకు వెళ్లకూడదని కోరుకోండి తను బతికితే మీ ప్రాబ్లంస్ అన్నీ సాల్వ్ అవుతాయి వసుధార జీవితం నిలబడుతుంది అని అంటుంది అనుపమ.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 25, 2023 at 7:09 ఉద.