Guppedantha Manasu November 27 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో వసుధార బాధపడుతూ ఉండగా రిషి ధైర్యం చెబుతూ ఉంటాడు. నీ మీద నింద పడిందని బాధపడుతున్నావా నువ్వు తప్పు చేసావని అందరూ నమ్మినా కూడా మేము మాత్రం నమ్మము అనడంతో అవునమ్మా నువ్వేం తప్పు చేయలేదు ధైర్యంగా ఉండు అని అంటాడు మహేంద్ర. అసలేం జరిగిందో చెప్పు వసుధార అని అడుగుతాడు. నేను ఎటువంటి తప్పు చేయలేదు సార్ ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసినందుకు నా మీద వేసినందుకు బాధపడడం లేదు. కానీ నా వల్ల డిబిఎస్టి కాలేజీకి చెడ్డపేరు వస్తుందని బాధపడుతున్నాను అని అంటుంది. అన్నిటికి మంచి చిత్రాకి ఏమైనా అవుతుందా అని నేను ఎక్కువగా భయపడుతున్నాను అనడంతో తనకేం కాదు వస్తారా నువ్వు ధైర్యంగా ఉండు అని అంటాడు రిషి.

జరిగింది మొత్తం వివరించిన వసుధార

వాళ్లు చూపించిన సీసీ కెమెరాలో నువ్వు వాళ్ళని బెదిరిస్తున్నట్టుగా ఉంది కానీ అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను ఇదివరకు కూడా నిన్ను అలాగే అపార్థం చేసుకున్నాను అని అంటాడు. చిత్రా నీకు ఎందుకు మెసేజ్ చేసింది నువ్వు అక్కడికి ఎందుకు వెళ్లావు?అక్కడ ఏం జరిగింది?ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని రిషి ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో వసుధార జరిగింది మొత్తం వివరిస్తుంది. ఈ విషయం నేను మీరు టిఫిన్ చేస్తున్నప్పుడు చెప్పాలి అనుకున్నప్పుడు మీకు ఫోన్ వచ్చింది సర్ అని అంటుంది. వెళ్లే ముందు ఒక్క మాట చెప్పాల్సింది వసుధార ఎందుకు ఒకదానివి వెళ్లావు అనడంతో మీరు అప్పటికే అలసిపోయారు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని వెళ్ళాను సార్ అని అంటుంది.

నిజాలు రాబడతాను అన్న రిషి

అప్పుడు రిషి అతను నాకు ఒక విషయం అర్థం కావడం లేదు ఇద్దరు ఎందుకు సూసైడ్ చేసుకుంది అని అనడంతో నాకు కూడా అదే అర్థం కావడం లేదు సార్ అని అంటుంది వసుధార. ఈ నిజాలు మొత్తం బయటపడాలి అన్న వసుధారకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు అని తెలియాలి అన్న చిత్ర బతకాలి డాడ్ అని అంటాడు. అప్పుడు వసుధార నన్ను వాళ్ళు ఎందుకు టార్గెట్ చేశారు అర్థం కావడం లేదు. లేదంటే వాళ్ల చేత ఇంకెవరైనా ఇలా చేయిస్తున్నారో అని అంటాడు రిషి. మరొకవైపు శైలేంద్ర నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదు మామ్ అనడంతో నువ్వు సూపర్ నాన్న నువ్వు ఇక్కడ లేకపోయినా కూడా వసుధారని తెలుగులో జైల్లో ఇరికించావు అని సంతోష పడుతూ ఉంటారు.

కోపంతో రగిలిపోతున్న మహేంద్ర

తర్వాత రిషి వాళ్ళు ఎవరో వాళ్ళు ఏమి ఆశించినంత చేస్తున్నారో త్వరలోనే తెలుసుకుంటాను అని అంటాడు. అప్పుడు వసుధార మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్ వాళ్ళు మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారు అని అంటుంది. అప్పుడు మహేంద్ర రిషి ని రెచ్చగొట్టాలని ఈసారి నా కొడుకు రిషి కొట్టబోయే దెబ్బ వాళ్లకు అచ్చు పడేలా ఉంటుంది అని అనడంతో రిషి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత వసుధార నిద్రలేచి చూడగా పక్కన రిషి లేకపోవడంతో టెన్షన్ పడుతూ బయటికి వెళుతుంది. అప్పుడు ఇల్లు మొత్తం వెతికినా కూడా కనిపించకపోవడంతో మహేంద్రను నిద్రలేపి అడగగా ఇక్కడ కూడా లేడు అని చెప్పడంతో ఇద్దరు రిషి కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. నాకు చాలా టెన్షన్ గా ఉంది మావయ్య ఫోన్ స్విచాఫ్ వస్తుంది కనీసం ఒక్క మాట చెప్పి కూడా వెళ్లలేదు అనడంతో ఏం కాదమ్మా నువ్వు ధైర్యంగా ఉండు అని అంటాడు మహేంద్ర.

చిత్తను చంపాలనుకున్న బాయ్ ఫ్రెండ్

మరొకవైపు చిత్రను చంపడానికి చిత్ర బాయ్ ఫ్రెండ్ కొంతమంది రౌడీలు అని పిలుచుకొని వస్తాడు. అప్పుడు చిత్ర బెడ్ మీద పడుకుంది అనుకొని కత్తితో పొడవడంతో సరిగ్గా పడుకోలేదు అనుకుంటా అని అక్కడికి వస్తాడు రిషి. అప్పుడు రిషిని చూసి చిత్ర బాయ్ఫ్రెండ్ రౌడీలు ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడు రౌడీలు చిత్ర బాయ్ ఫ్రెండ్ తప్పించుకొని పారిపోతుండగా రిషి పరిగెత్తుకొని వెళ్లి ఆ చిత్ర బాయ్ ఫ్రెండ్ ని పట్టుకుంటాడు. ఆ తర్వాత రోజు ఉదయం కాలేజీలో రిషి కాలేజీ స్టాఫ్ ని అలాగే చిత్ర తల్లిదండ్రులను అక్కడికి పిలిపిస్తాడు. అప్పుడు కాలేజీ స్టాఫ్ లో ఒక అతను జరిగేది మొత్తం దేవయానికి వీడియో కాల్ లో చూపిస్తూ ఉంటాడు. అప్పుడు చిత్ర తల్లి ఏంటి సార్ ఇది. మేమేం పాపం చేశాము.. ఎందుకు మమ్మల్ని ఇలా శిక్షిస్తున్నారు అనడంతో అవునా అనడంతో అలా అంటారేంటండి అని అంటాడు చిత్రా వాళ్ళ నాన్న.

Guppedantha Manasu November 27 Today Episode: రిషి మాటలకు భయపడుతున్న చిత్ర తల్లిదండ్రులు

మా కూతురికి ఇలా అయినప్పటి నుంచి మేము భయం భయంగా బతుకుతున్నాము అని అంటారు. ఇప్పుడు మా కూతురు కనిపించడం లేదు ఎక్కడ దాచారో చెప్పండి సార్ పోలీసులు మీరైనా అతన్ని అడగండి సార్ అని అంటాడు చిత్ర వాళ్ళ నాన్న. అప్పుడు పోలీస్ చెప్పండి సార్ అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశారు అనడంతో మేము కిడ్నాప్ చేసాము అనడానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనడంతో మీకు తప్ప అవసరం ఇంకెవరికి లేదు అని అంటారు పోలీస్. నా కూతురిని నువ్వే చంపేసావు కదా అనడంతో రిషి షటప్ అని గట్టిగా అరవడంతో చిత్ర వాళ్ళ నాన్న భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు చిత్రాన్ని ప్రాణాలతో సేఫ్ గా అక్కడికి మహేంద్ర అక్కడికి తీసుకురావడంతో అది చూసి చిత్ర తల్లిదండ్రులు పోలీసులు దేవయాని షాక్ అవుతారు..

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 27, 2023 at 7:12 ఉద.